Followers

Sunday 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై తొమ్మిదవ అధ్యాయం

                 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై తొమ్మిదవ అధ్యాయం

శ్రీరాజోవాచ
యథా హతో భగవతా భౌమో యేనే చ తాః స్త్రియః
నిరుద్ధా ఏతదాచక్ష్వ విక్రమం శార్ఙ్గధన్వనః

కృష్ణుడు నరకాసురున్ని ఎందుకు చంపాడు. నరకాసురుడు ఆ కన్యలను ఎందుకు బంధించాడు

శ్రీశుక ఉవాచ
ఇన్ద్రేణ హృతఛత్రేణ హృతకుణ్డలబన్ధునా
హృతామరాద్రిస్థానేన జ్ఞాపితో భౌమచేష్టితమ్

నరకాసురుడు స్వర్గం మీదకు దండించి అతని చత్ర చామరములూ అధితి యొక్క కుండలములౌన్ హరించి తీసుకు వచ్చాడు

సభార్యో గరుడారూఢః ప్రాగ్జ్యోతిషపురం యయౌ
గిరిదుర్గైః శస్త్రదుర్గైర్జలాగ్న్యనిలదుర్గమమ్
మురపాశాయుతైర్ఘోరైర్దృఢైః సర్వత ఆవృతమ్

నరకాసురుని ఈ దౌష్ట్యాన్ని సహించలేని ఇంద్రుడు నారదుని ద్వారా కబురు పంపితే స్వామి ఒక రోజు సాయంకాలం సత్యభామను వెంట తీసుకుని గరుడారూహుడై ప్రాక్ జోతీషపురమునకు బయలు దేరాడు.
అక్కడ గిరిదుర్గములూ శస్త్ర దుర్గములూ జల దుర్గములూ అగ్ని దుర్గమూ అనల దుర్గమూ అనే ఐదు దుర్గాలు ఉన్నాయి. వీటిని దాటితేనే ఆ నగరం కనపడుతుంది. ఇవన్నీ దాటినా మురాసురుడు పాశములతో ఆ ప్రాంతాన్ని ఎవరూ రాకుండా చేసాడు
గదయా నిర్బిభేదాద్రీన్శస్త్రదుర్గాణి సాయకైః
చక్రేణాగ్నిం జలం వాయుం మురపాశాంస్తథాసినా

పరమాత్మ గదతో గిరి దుర్గాలనూ శస్త్ర దుర్గాలను బాణముతో ధ్వంసం చేసాడు.చక్రముతో అగ్ని జల వాయు దుర్గములనూ, ముర పాశములను ఖడ్గముతో శంఖముతో అక్కడ ఉన్న యంత్రములనూ, భక్తుల హృదయాలను పులకింపచేసాడు

శఙ్ఖనాదేన యన్త్రాణి హృదయాని మనస్వినామ్
ప్రాకారం గదయా గుర్వ్యా నిర్బిభేద గదాధరః

అక్కడి ప్రాకారాన్ని తన గదతో ధ్వంసం చేసాడు

పాఞ్చజన్యధ్వనిం శ్రుత్వా యుగాన్తశనిభీషణమ్
మురః శయాన ఉత్తస్థౌ దైత్యః పఞ్చశిరా జలాత్

పాంచజన్య ధ్వనిని విని నగర పాలకుడైన మురాసురుడు ఐదు తలలతో నీటినుండి శూలాన్ని తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు

త్రిశూలముద్యమ్య సుదుర్నిరీక్షణో యుగాన్తసూర్యానలరోచిరుల్బణః
గ్రసంస్త్రిలోకీమివ పఞ్చభిర్ముఖైరభ్యద్రవత్తార్క్ష్యసుతం యథోరగః

మహా ఉగ్రముగా ఉన్నాడు. యుగాంత సూర్యునిలా ప్రకాశిస్తూ అతను వస్తే గరుత్మంతుని మీదకు పరిగెత్తే పాములా ఉన్నాడు

ఆవిధ్య శూలం తరసా గరుత్మతే నిరస్య వక్త్రైర్వ్యనదత్స పఞ్చభిః
స రోదసీ సర్వదిశోऽమ్బరం మహానాపూరయన్నణ్డకటాహమావృణోత్

గరుత్మంతుని మీద శూలాన్ని ప్రయోగించు సింహనాదం చేసాడు
మురాసురుడు శరీరాన్ని బాగా పెంచుతాడు. కామ రూపి.

తదాపతద్వై త్రిశిఖం గరుత్మతే హరిః శరాభ్యామభినత్త్రిధోజసా
ముఖేషు తం చాపి శరైరతాడయత్తస్మై గదాం సోऽపి రుషా వ్యముఞ్చత

ఆ శూలాన్ని బాణములతో ధ్వంసం చేసాడు. గదను ప్రయోగించాడు మురుడు. స్వామి తన గదతో భేధించాడు

తామాపతన్తీం గదయా గదాం మృధే గదాగ్రజో నిర్బిభిదే సహస్రధా
ఉద్యమ్య బాహూనభిధావతోऽజితః శిరాంసి చక్రేణ జహార లీలయా

చక్రముతో అతని శిరస్సును ఖండిస్తే అతను చనిపోయి నీటిలో పడ్డాడు. మురాంతకుడైన స్వామికి మురారి అని పేరు వచ్చింది.

వ్యసుః పపాతామ్భసి కృత్తశీర్షో నికృత్తశృఙ్గోऽద్రిరివేన్ద్రతేజసా
తస్యాత్మజాః సప్త పితుర్వధాతురాః ప్రతిక్రియామర్షజుషః సముద్యతాః

ఆ మురాసురునికి ఏడుగురు కుమారులు ఉన్నారు.

తామ్రోऽన్తరిక్షః శ్రవణో విభావసుర్
వసుర్నభస్వానరుణశ్చ సప్తమః
పీఠం పురస్కృత్య చమూపతిం మృధే
భౌమప్రయుక్తా నిరగన్ధృతాయుధాః

ఈ ఏడుగురూ యుద్ధానికి రాగా వారు ప్రయోగించే అన్ని రకముల ఆయుధాలనీ ధ్వంసం చేసి కృష్ణ పరమాత్మ వారిని కూడా వధించాడు.

ప్రాయుఞ్జతాసాద్య శరానసీన్గదాః శక్త్యృష్టిశూలాన్యజితే రుషోల్బణాః
తచ్ఛస్త్రకూటం భగవాన్స్వమార్గణైరమోఘవీర్యస్తిలశశ్చకర్త హ

ఇలా తనవారందూ పోయిన తరువాత కృష్ణుడు ఘోర యుద్ధం చేస్తున్నాడని తెలుసుకుని  భూమి పుత్రుడైన నరకుడు వచ్చాడు

తాన్పీఠముఖ్యాననయద్యమక్షయం
నికృత్తశీర్షోరుభుజాఙ్ఘ్రివర్మణః
స్వానీకపానచ్యుతచక్రసాయకైస్
తథా నిరస్తాన్నరకో ధరాసుతః
నిరీక్ష్య దుర్మర్షణ ఆస్రవన్మదైర్
 - గజైః పయోధిప్రభవైర్నిరాక్రమాత్

సముద్రములో పుట్టిన ఏనుగులను తీసుకుని యుద్ధానికి వచ్చాడు. సూర్యుని మీద మెరుపుతో ఉన్న మేఘం లాగా గరుడుని మీద భార్యతో ఉన్న కృష్ణున్ని ఈ నరకాసురుడు చూచాడు

దృష్ట్వా సభార్యం గరుడోపరి స్థితం
సూర్యోపరిష్టాత్సతడిద్ఘనం యథా
కృష్ణం స తస్మై వ్యసృజచ్ఛతఘ్నీం
యోధాశ్చ సర్వే యుగపచ్చ వివ్యధుః

ఇలా ఇరువురూ అస్త్ర ప్రయోగాలు చేసుకుని నరకాసుర సైన్యాన్ని స్వామి ధ్వంశం చేస్తే

తద్భౌమసైన్యం భగవాన్గదాగ్రజో
విచిత్రవాజైర్నిశితైః శిలీముఖైః
నికృత్తబాహూరుశిరోధ్రవిగ్రహం
చకార తర్హ్యేవ హతాశ్వకుఞ్జరమ్

బాహువులూ ఊరువులూ ఆయుధాలూ శిరస్సులూ వాహనాలూ అన్ని నరికేసి నరకాసురుని సైన్యం ఏ ఏ ఆయుధాలు ప్రయోగిస్తోందో వాటిని స్వామి చిన్నాభిన్నం చేసాడు

యాని యోధైః ప్రయుక్తాని శస్త్రాస్త్రాణి కురూద్వహ
హరిస్తాన్యచ్ఛినత్తీక్ష్ణైః శరైరేకైకశస్త్రీభిః

ఉహ్యమానః సుపర్ణేన పక్షాభ్యాం నిఘ్నతా గజాన్
గురుత్మతా హన్యమానాస్తుణ్డపక్షనఖేర్గజాః

గరుత్మంతుడు కూడా గోళ్ళతో కొందరినీ ముక్కుతో కొందరినీ రెక్కలతో కొందరినీ చంపాడు

పురమేవావిశన్నార్తా నరకో యుధ్యయుధ్యత

దృష్ట్వా విద్రావితం సైన్యం గరుడేనార్దితం స్వకం
తం భౌమః ప్రాహరచ్ఛక్త్యా వజ్రః ప్రతిహతో యతః
నాకమ్పత తయా విద్ధో మాలాహత ఇవ ద్విపః

నరకాసురునికి గరుడుని మీద కోపం వచ్చి తన శక్తిని ప్రయోగించాడు
వజ్రాయుధాన్ని కూడా తోసిపారేసే శక్తిని నరకాసురుడు గరుడుని మీద వేశాడు. పెద్ద ఏనుగును పూల మాలతో కొడితే ఎలా చలించదో గరుడునికి ఏమీ కాలేదు.

శూలం భౌమోऽచ్యుతం హన్తుమాదదే వితథోద్యమః
తద్విసర్గాత్పూర్వమేవ నరకస్య శిరో హరిః
అపాహరద్గజస్థస్య చక్రేణ క్షురనేమినా

సకుణ్డలం చారుకిరీటభూషణం బభౌ పృథివ్యాం పతితమ్సముజ్జ్వలమ్
హ హేతి సాధ్విత్యృషయః సురేశ్వరా మాల్యైర్ముకున్దం వికిరన్త ఈదిరే

నరకాసురుడు శూలాన్ని తీసుకుని కృష్ణున్ని చంపుదామని ముందుకొచ్చాడు , అపుడు స్వామి తన చక్రముతో నరకాసురుని శిరస్సును ఖండించాడు

నరకాసురుడు వధించబడడాన్ని చూచి ఋషులూ యోగులూ దేవతలూ స్తోత్రం చేసి పూల వర్షం కురిపించారు

తతశ్చ భూః కృష్ణముపేత్య కుణ్డలే
ప్రతప్తజామ్బూనదరత్నభాస్వరే
సవైజయన్త్యా వనమాలయార్పయత్
ప్రాచేతసం ఛత్రమథో మహామణిమ్

నరకాసురుని తల్లి ఐన భూదేవి నరకుడు అంతకు ముందు అపహరించిన కుండలాలు తీసుకును కృష్ణునికి ఇచ్చి స్తోత్రం చేసింది.

అస్తౌషీదథ విశ్వేశం దేవీ దేవవరార్చితమ్
ప్రాఞ్జలిః ప్రణతా రాజన్భక్తిప్రవణయా ధియా

భూమిరువాచ
నమస్తే దేవదేవేశ శఙ్ఖచక్రగదాధర
భక్తేచ్ఛోపాత్తరూపాయ పరమాత్మన్నమోऽస్తు తే

భక్తేచ్ఛోపాత్తరూపాయ  - పరమాత్మకు ఇన్ని రూపాలు ఎందుకు? భక్తులు ఏ ఏ రూపాలలో స్వామిని పూజించాలని కోరుకుంటారో ఆ రూపములో వస్తాడు. భక్తుల ఇష్టాన్ని అనుసరించి నీవు ఆయా రూపాలు ధరిస్తావు

నమః పఙ్కజనాభాయ నమః పఙ్కజమాలినే
నమః పఙ్కజనేత్రాయ నమస్తేపఙ్కజాఙ్ఘ్రయే

సకల జగత్తుకూ సృష్టి కర్త ఐన బ్రహ్మను తనలో ఉంచుకున్న పద్మము నాభిలో ఉంచుకున్నవాడు.
ఆ పద్మాలను మాలగా వేసుకున్నవాడు. అంటే రక్షించేవాడు. అదే పద్మాలను నేత్రములుగా కలిగినవాడు. జగత్తును రక్షించడానికి అమృతం పంచినవాడు. అదే పద్మాలను పాదములుగా పెట్టుకున్నాడు. తన పాదములతో భక్తుల పాపాలను హరించినవాడు

నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే
పురుషాయాదిబీజాయ పూర్ణబోధాయ తే నమః

నీవే ఆది బీజం నీవే పరిపూర్ణ జ్ఞ్యాన స్వరూపుడవు

అజాయ జనయిత్రేऽస్య బ్రహ్మణేऽనన్తశక్తయే
పరావరాత్మన్భూతాత్మన్పరమాత్మన్నమోऽస్తు తే

నీవే భూతాత్మవూ నీవే పరమాత్మవూ పెద్దవారికీ చిన్నవారికీనీవే ఆత్మవు.

త్వం వై సిసృక్షురజ ఉత్కటం ప్రభో
తమో నిరోధాయ బిభర్ష్యసంవృతః
స్థానాయ సత్త్వం జగతో జగత్పతే
కాలః ప్రధానం పురుషో భవాన్పరః

నీవే సృష్టి చేయగోరి సత్వ గుణాన్ని రక్ష చేయగోరి సత్వ గుణాన్ని, నశింపచేయగోరి తమో గుణాన్నీ తీసుకుంటావు. నీవే కాలమూ నీవే ప్రకృతి నీవే పురుషుడవు.

అహం పయో జ్యోతిరథానిలో నభో మాత్రాణి దేవా మన ఇన్ద్రియాణి
కర్తా మహానిత్యఖిలం చరాచరం త్వయ్యద్వితీయే భగవనయం భ్రమః

పంచ భూతములూ పంచ తన్మాత్రలూ మనసూ పంచ జ్ఞ్యాన కర్మేంద్రియములూ అహంకారమూ మహత్ తత్వమూ, సకల చరాచరజగత్తుకూ నీవే కర్తవు.
ఇదంతా నీలోనే ఉంది.  నీకంటే విడిగా వేరే ఉన్నది అనుకోవడం భ్రమ

తస్యాత్మజోऽయం తవ పాదపఙ్కజం భీతః ప్రపన్నార్తిహరోపసాదితః
తత్పాలయైనం కురు హస్తపఙ్కజం శిరస్యముష్యాఖిలకల్మషాపహమ్

లోకాలను బాధించే నరకాసురున్ని వధించావు. జగత్తు యొక్క బాధను తొలగించి శాంతిని కూర్చావు. ఇతను నరకాసురుని కుమారుడు. ఇతని శిరసు మీద అన్ని పాపాలు పోగొట్టే నీ హస్తమును వుంచు. అని భూమి ప్రార్థిస్తే

శ్రీశుక ఉవాచ
ఇతి భూమ్యర్థితో వాగ్భిర్భగవాన్భక్తినమ్రయా
దత్త్వాభయం భౌమగృహమ్ప్రావిశత్సకలర్ద్ధిమత్

స్వామి అభయమిచ్చి నరకాసుర అంతఃపురానికి స్వామి ప్రవేశించాడు.

తత్ర రాజన్యకన్యానాం షట్సహస్రాధికాయుతమ్
భౌమాహృతానాం విక్రమ్య రాజభ్యో దదృశే హరిః

అక్కడ పదుహారు వేల రాజపుత్రికలు, నరకాసురుడు అపహరించిన వారిని  చూచాడు. వారు ఈయనను చూచి మోహంచెందారు.

తమ్ప్రవిష్టం స్త్రియో వీక్ష్య నరవర్యం విమోహితాః
మనసా వవ్రిరేऽభీష్టం పతిం దైవోపసాదితమ్

భూయాత్పతిరయం మహ్యం ధాతా తదనుమోదతామ్
ఇతి సర్వాః పృథక్కృష్ణే భావేన హృదయం దధుః

నరకసాఉరుడు మనకు మేలే చేసాడు. కృష్ణున్నిమనకు దర్శింపచేసాడు. ఇతన్నే మనం వివాహం చేసుకుంటే బాగుండు. ఇతను మన భర్త కావాలి. బ్రహ్మ మా ఈ కోరిక తీర్చు గాక అని కృష్ణుని యందు మనసు ఉంచి కోరగా కృష్ణుడు అందరినీ ద్వారకా నగరానికి పంపించాడు.అరవైనాలుగు ఐరావత కులములో ఉన్న ఏనుగులను కానుకగా పంపారు.

తాః ప్రాహిణోద్ద్వారవతీం సుమృష్టవిరజోऽమ్బరాః
నరయానైర్మహాకోశాన్రథాశ్వాన్ద్రవిణం మహాత్

ఐరావతకులేభాంశ్చ చతుర్దన్తాంస్తరస్వినః
పాణ్డురాంశ్చ చతుఃషష్టిం ప్రేరయామాస కేశవః

గత్వా సురేన్ద్రభవనం దత్త్వాదిత్యై చ కుణ్డలే
పూజితస్త్రిదశేన్ద్రేణ మహేన్ద్ర్యాణ్యా చ సప్రియః

అలాగే కృష్ణుడు సత్య్భామను తీసుకుని స్వర్గానికి వెళ్ళి అక్కడ అదిథికి కుండలాలు ఇచ్చి ఇంద్రుని చేత పూజించబడి భోజనం చేసి బయలు దేరుతుండగా

చోదితో భార్యయోత్పాట్య పారీజాతం గరుత్మతి
ఆరోప్య సేన్ద్రాన్విబుధాన్నిర్జిత్యోపానయత్పురమ్

సత్యభామ అక్కడ కాసేపు కూర్చుని వెళదాం అంటే, అక్కడ పారిజాత వృక్షాన్ని చూచింది సత్యభామ, కృష్ణుడితో అది కావాలి అని అడిగింది. కృష్ణుడు అది తీసుకోబోతుంటే భటులు వారించారు. కృష్ణుడు వారి మాట వినలేదు

స్థాపితః సత్యభామాయా గృహోద్యానోపశోభనః
అన్వగుర్భ్రమరాః స్వర్గాత్తద్గన్ధాసవలమ్పటాః

యయాచ ఆనమ్య కిరీటకోటిభిః పాదౌ స్పృశన్నచ్యుతమర్థసాధనమ్
సిద్ధార్థ ఏతేన విగృహ్యతే మహానహో సురాణాం చ తమో ధిగాఢ్యతామ్

ఇంద్రుడు ఆ విషయం తెలుసుకుని, కృష్ణుని మీదకు యుద్ధానికి వచ్చాడు.
సకల చరాచర లోకములూ ఏ పరమాత్మ కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఏ పరమాత్మ పాదాలకు తమ కిరీటాలు తాకిస్తూ నమస్కారం చేస్తారో అలాంటి పరమాత్మను అంతలోనే మరచిపోయి అతనితో విరోధం తెచ్చుకున్నారు దేవతలు. ఎంతటి మూర్ఖులు.

అథో ముహూర్త ఏకస్మిన్నానాగారేషు తాః స్త్రియః
యథోపయేమే భగవాన్తావద్రూపధరోऽవ్యయః

ఈ ప్రకారముగా యుద్ధములో వారిని కూడా ఓడించి వారికి బుద్ధి చెప్పి అతని ఆమోదముతో ద్వారకకు వచ్చి పారిజాతాన్ని ద్వారకలో ప్రతిష్ఠించి,

గృహేషు తాసామనపాయ్యతర్కకృన్నిరస్తసామ్యాతిశయేష్వవస్థితః
రేమే రమాభిర్నిజకామసమ్ప్లుతో యథేతరో గార్హకమేధికాంశ్చరన్

ఒక మంచి రోజు చూసి తానే పదుహారువేల రూపాలు ధరించి పదుహారువేల మందిని వివాహం చేసుకున్నాడు. వారంతా కూడా అమ్మవారి యొక్క అంశలే. అమ్మవారే స్వామిని సర్వాత్మనా అనుభవించాలి అనుకున్నది. పరిపూర్ణముగా స్వామిని సేవించాలంటే  అనంతమైన రూపాలు కావాలి. తన కోరికకు అనుగుణముగానే లక్ష్మీ దేవి సర్వాత్మనా పరమాత్మను సేవించడానికి ఇన్ని రూపాలు ధరించి వచ్చింది. ఆమె కోరిక తీర్చడానికి స్వామి కూడా అన్ని రూపాలు ధరించి ఆమెను వివాహం చేసుకున్నాడు

ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రియస్తా
బ్రహ్మాదయోऽపి న విదుః పదవీం యదీయామ్
భేజుర్ముదావిరతమేధితయానురాగ
హాసావలోకనవసఙ్గమజల్పలజ్జాః

బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తెలుసుకోలేని ఆచూకి కలిగిన స్వామిని భర్తగా పొంది వీరు పరమ ఆనందాన్ని పొందారు

ప్రత్యుద్గమాసనవరార్హణపదశౌచ
తామ్బూలవిశ్రమణవీజనగన్ధమాల్యైః
కేశప్రసారశయనస్నపనోపహార్యైః
దాసీశతా అపి విభోర్విదధుః స్మ దాస్యమ్

ఈ సేవలన్నీ వారు చేసారు. ఇవి మొత్తం పదుహారు ఉపచారాలు/
ప్రత్యుద్గమం - స్వామి వచ్చినపుడు ఎదురు వెళ్ళుట
ఆసన  - సింహాసనం వేయుట
వరార్హణ - పూజించుట
పాదశౌచం
తాంబూలం
విశ్రమనం  - విశ్రాంతినివ్వడం
వీజనం - చామరాలు వీయడం
గంధమూ మాలలూ
జుట్టు దువ్వడం
పడుకోబెట్టడం
స్నానం చేయించడం
ఉపహార్య - ఇతర సేవలతో
ఒక్కొక్కరికీ వేల మంది దాసీజనం ఉన్నా అన్ని సేవలూ తామే చేసి తాము దాస్యం చేసారు స్వామికి
ఇన్ని రకాల దాస్యం చేసినా ఆయన మనసును హరించలేకపోయారు. ఇది స్వామి యొక్క జితేంద్రియత్వం

                  ఓం నమో భగవతే వాసుదేవాయ
                                                    
                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts