Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై మూడవ అధ్యాయం

                      ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తథానుగృహ్య భగవాన్గోపీనాం స గురుర్గతిః
యుధిష్ఠిరమథాపృచ్ఛత్సర్వాంశ్చ సుహృదోऽవ్యయమ్

స్వామి కూడా వారిని అనుగ్రహించాడు. ధర్మరాజునూ మిత్రులనూ కుశల ప్రశ్నలు అడిగాడు

త ఏవం లోకనాథేన పరిపృష్టాః సుసత్కృతాః
ప్రత్యూచుర్హృష్టమనసస్తత్పాదేక్షాహతాంహసః

అందరూ ఆయనకు బదులు చెప్పారు. పరమాత్మ పాదములను దర్శనం చేసుకున్నందు వలన తొలగిన పాపములు కలవారి ఆయనకు బదులు చెబుతున్నారు

కుతోऽశివం త్వచ్చరణామ్బుజాసవం మహన్మనస్తో ముఖనిఃసృతం క్వచిత్
పిబన్తి యే కర్ణపుటైరలం ప్రభో దేహంభృతాం దేహకృదస్మృతిచ్ఛిదమ్

నిరంతరం నీ పాదాలు స్మరించేవారికి అమంగళం ఉంటుందా. మహానుభావుల మనసునుండీ ముఖం నుండీ వెలువడిన నీ పాదపద్మములను తన చెవులతో తాగుతున్నవారికి దేహమునుండీ దేహం కలిగించే పూర్వ జన్మవాసన సంస్కారాన్ని చేదించేవారికి అమంగళం ఎక్కడ ఉంటుంది.

హి త్వాత్మ ధామవిధుతాత్మకృతత్ర్యవస్థామ్
ఆనన్దసమ్ప్లవమఖణ్డమకుణ్ఠబోధమ్
కాలోపసృష్టనిగమావన ఆత్తయోగ
మాయాకృతిం పరమహంసగతిం నతాః స్మ

మేము పరమహంస గతికి నమస్కరిస్తున్నాము. పరమ హంసలు చేరదగిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను. యోగ మాయతో మానవాకారాన్ని ధరించావు. కాలము చేత మింగబడే వారికి తొలగించడానికి మూలకారణమైన వాడవు.
మహానంద సముద్రం , అఖండం, ఎలాంటి విఛ్చినం లేని జ్ఞ్యాన స్వరూపుడవు. నీ కాంతితో సత్వరజస్తమో గుణాలకు మూలమైన ప్రకృతిని ధరించిన నీకు నమస్కారం

శ్రీఋషిరువాచ
ఇత్యుత్తమఃశ్లోకశిఖామణిం జనేష్వ్
అభిష్టువత్స్వన్ధకకౌరవస్త్రియః
సమేత్య గోవిన్దకథా మిథోऽగృనంస్
త్రిలోకగీతాః శృణు వర్ణయామి తే

యాదవులూ కౌరవులూ మునూ యోగులూ రాజులూ భక్తులూ ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉంటే మొత్తం స్త్రీలంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ద్రౌపతికి కృష్ణ పరమాత్మ భార్యలందరినీ ఒక్క సారి చూచే అవకాశం ఇన్నాళ్ళకు దొరికింది. తీర్థ యాత్రకూ పుణ్యక్షేత్రాలకూ గ్రహణాదులలో సంక్రమణాలలో వెళ్ళేది ఇందుకోసం. దర్శనం ఐపోయిన తరువాత ఇంతకాలం జరిగిన అనుభవాలను మాట్లాడుకోవచ్చు. ఒక సారి కూర్చుని ఒకరినొకరు క్షేమ సమాచారం అడుగుకున్నారు. సంభాషించుకున్నారు. సల్లాపం చేసుకున్నారు. ఇలా చేసుకుంటే ఎంతో కాలం మనసులో పెరిగిన మురికి పోతుంది. ఒకరికి కలిగిన అనుభవాలు ఒకరికి చెప్పుకుని పరమాత్మ యందు భక్తిని పెంచుకోవాలి.

శ్రీద్రౌపద్యువాచ
హే వైదర్భ్యచ్యుతో భద్రే హే జామ్బవతి కౌశలే
హే సత్యభామే కాలిన్ది శైబ్యే రోహిణి లక్ష్మణే

హే కృష్ణపత్న్య ఏతన్నో బ్రూతే వో భగవాన్స్వయమ్
ఉపయేమే యథా లోకమనుకుర్వన్స్వమాయయా

మిమ్ములను కృష్ణ పరమాత్మ ఎలా ఎలా పెళ్ళి చేసుకున్నాడు.

శ్రీరుక్మిణ్యువాచ
చైద్యాయ మార్పయితుముద్యతకార్ముకేషు
రాజస్వజేయభటశేఖరితాఙ్ఘ్రిరేణుః
నిన్యే మృగేన్ద్ర ఇవ భాగమజావియూథాత్
తచ్ఛ్రీనికేతచరణోऽస్తు మమార్చనాయ

నన్ను మా అన్నగారు శిశుపాలునికి ఇవ్వాలని సంకల్పించారు. దానితో అందరూ ధనువు ఎక్కుపెట్టి కృష్ణున్ని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నారు. గెలవడానికి వీలు లేని అంతమంది భటుల శిరస్సులో తన పాద రేణువు పడవేశాడు కృష్ణుడు. మేకలా గొర్రెల మందల నుండి తన భాగాన్ని సింహం తీసుకుపోయినట్లుగా స్వామి నన్ను తీసు వెళ్ళాడు. ఎల్లపుడూ అమ్మవారికి నివాసమైన పరమాత్మ పాదాన్ని నేను అర్చించాలి.

శ్రీసత్యభామోవాచ
యో మే సనాభివధతప్తహృదా తతేన
లిప్తాభిశాపమపమార్ష్టుముపాజహార
జిత్వర్క్షరాజమథ రత్నమదాత్స తేన
భీతః పితాదిశత మాం ప్రభవేऽపి దత్తామ్

సనాభి అంటే తమ్ముడు. సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు వధించబడడం వలన తపించిన మా తండ్రి కృష్ణుని మీద అపనింద మోపాడు. దాని నుండి తప్పించుకోవడానికి జాంబవతునితో యుద్ధం చేసి స్యమంతక మణిని మా తండ్రికిచ్చి నన్ను వివాహం చేసుకున్నాడు.
నన్ను ఇదివరకే ఇంకొకరికి ఇద్దామనుకున్నా ఈ సంఘటనతో కృష్ణునికి ఇచ్చి వివాహం చేసారు

శ్రీజామ్బవత్యువాచ
ప్రాజ్ఞాయ దేహకృదముం నిజనాథదైవం
సీతాపతిం త్రినవహాన్యమునాభ్యయుధ్యత్
జ్ఞాత్వా పరీక్షిత ఉపాహరదర్హణం మాం
పాదౌ ప్రగృహ్య మణినాహమముష్య దాసీ

మా నాన్నగారు 27 రోజులు కృష్ణునితో యుద్ధం చేసారు. ఇతను శ్రీరామచంద్రుడే అని తెలుసుకుని నన్ను కానుకగా ఇచ్చాడు. పాదాలు కడిగి మణితో సహా నన్ను ఈయనకు ఇచ్చాడు. నేను ఆయనకు దాసీని

శ్రీకాలిన్ద్యువాచ
తపశ్చరన్తీమాజ్ఞాయ స్వపాదస్పర్శనాశయా
సఖ్యోపేత్యాగ్రహీత్పాణిం యోऽహం తద్గృహమార్జనీ

పరమాత్మ కోసం తపస్సు చేస్తున్నట్లు అర్జనుడితో కలసి వచ్చి నన్ను పాణిగ్రహణం చేసుకున్నాడు

శ్రీమిత్రవిన్దోవాచ
యో మాం స్వయంవర ఉపేత్య విజిత్య భూపాన్
నిన్యే శ్వయూథగం ఇవాత్మబలిం ద్విపారిః
భ్రాతౄంశ్చ మేऽపకురుతః స్వపురం శ్రియౌకస్
తస్యాస్తు మేऽనుభవమఙ్ఘ్ర్యవనేజనత్వమ్

స్వయవం వరానికి వచ్చి, శత్రువులను ఓడించి ,, కుక్కల మందలో ఉన్న తన భాగాన్ని సింహం తీసుకు వచ్చినట్లు తీసుకు వచ్చింది. (ద్విపం అంటే ఏనుగు - ద్విపారి అంటే సింహం)
నాకు ఇష్టంలేకుండా వేరేవారికి ఇద్దామని అనుకున్న మా సోదరుల నుండి అపహరించి ఇంటికి తీసుకు వచ్చాడు. ఆయన పాద ప్రక్షాళన రోజూ చేయగలిగితే చాలు
శ్రీసత్యోవాచ
సప్తోక్షణోऽతిబలవీర్యసుతీక్ష్ణశృఙ్గాన్
పిత్రా కృతాన్క్షితిపవీర్యపరీక్షణాయ
తాన్వీరదుర్మదహనస్తరసా నిగృహ్య
క్రీడన్బబన్ధ హ యథా శిశవోऽజతోకాన్

స్వామి నన్ను అడిగాడు. అప్పుడు మా తండ్రి ఏడు బలిసిన కోడెలను బంధించమని అడిగారు. అపుడు స్వామి ఏడు రూపాలతో బలముతో వాటిని ముట్టించి ఆడుకుంటున్నట్లుగా వాటిని  బంధించాడు. మేకపిల్లలను ఎలా పిల్లలు కట్టెస్తారో అలా స్వామి ఏడు కోడెలనూ కట్టేసి నన్ను పెళ్ళి చేసుకున్నాడు.

య ఇత్థం వీర్యశుల్కాం మాం
దాసీభిశ్చతురన్గిణీమ్
పథి నిర్జిత్య రాజన్యాన్
నిన్యే తద్దాస్యమస్తు మే

ఈ విధముగా నన్ను చేసుకుని వెళుతూ ఉంటే అంతకు ముందు నన్ను వివాహం చేసుకుందామని ఆశపడ్డరాజులు దారిలో అడ్డగిస్తే వారిని తన పరాక్రమముతో ఓడించి తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఆయనకు నేను దాస్యం చేయాలి

శ్రీభద్రోవాచ
పితా మే మాతులేయాయ స్వయమాహూయ దత్తవాన్
కృష్ణే కృష్ణాయ తచ్చిత్తామక్షౌహిణ్యా సఖీజనైః

నాకు కృష్ణుని మీద మనసు ఉంది అని తెలుసుకుని మా తండ్రి పిలిచి నన్ను కృష్ణుని చేతిలో పెట్టారు

అస్య మే పాదసంస్పర్శో భవేజ్జన్మని జన్మని
కర్మభిర్భ్రామ్యమాణాయా యేన తచ్ఛ్రేయ ఆత్మనః

ప్రతీ జన్మలో ఈయన పాదాల్ను స్పృశించే భాగ్యం నాకు కలుగుగాక. రక రకాల కర్మలతో తిరుగ్తున్న ఈ ఆత్మకు ఏ పాదస్పర్శ వలన మేలు కలుగుతుందో అటువంటి పాద స్పర్శ నాకు కలుగుగాక

శ్రీలక్ష్మణోవాచ
మమాపి రాజ్ఞ్యచ్యుతజన్మకర్మ శ్రుత్వా ముహుర్నారదగీతమాస హ
చిత్తం ముకున్దే కిల పద్మహస్తయా వృతః సుసమ్మృశ్య విహాయ లోకపాన్

నారదుని వలన స్వామి పరాక్రమం విని నేను స్వయం వరములో తక్కిన వారిని కాదని ఈయనను వరించాను. నా అభిప్రాయాన్ని తెలుసుకుని,

జ్ఞాత్వా మమ మతం సాధ్వి పితా దుహితృవత్సలః
బృహత్సేన ఇతి ఖ్యాతస్తత్రోపాయమచీకరత్

యథా స్వయంవరే రాజ్ఞి మత్స్యః పార్థేప్సయా కృతః
అయం తు బహిరాచ్ఛన్నో దృశ్యతే స జలే పరమ్

అర్జనుడు మత్స్య యంత్రాన్ని చేదించి ద్రౌపతిని పొందినట్లుగా మా తండ్రి కూడా ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేసారు. ఆ మత్స్య యంత్రాన్ని నీటిలో అర్జనుడు చూసి కొట్టాడు. ఇది నీటిలో కనపడదు, నీడ కూడా కనపడదు. కేవలం బిందువు కనపడుతుంది. కనపడే బిందువులో చేప యొక్క ఆకారం ఊహించి, ఆ చేప యొక్క కంటిని కొట్టాలి .బిందువుతో మత్స్యాన్నీ, మత్స్యముతో మత్స్య అక్షినీ ఊహించి కొట్టాలి.

శ్రుత్వైతత్సర్వతో భూపా ఆయయుర్మత్పితుః పురమ్
సర్వాస్త్రశస్త్రతత్త్వజ్ఞాః సోపాధ్యాయాః సహస్రశః

ఇది విని చాలా మంది వచ్చారు.

పిత్రా సమ్పూజితాః సర్వే యథావీర్యం యథావయః
ఆదదుః సశరం చాపం వేద్ధుం పర్షది మద్ధియః

మా నాన్న వారి వారి పరాక్రమాలకూ వయసుకూ యోగ్యతకూ పదవులకూ అనుగుణముగా వారిని గౌరవించి అందరికీ ధనువూ బాణం ఇచ్చారు.

ఆదాయ వ్యసృజన్కేచిత్సజ్యం కర్తుమనీశ్వరాః
ఆకోష్ఠం జ్యాం సముత్కృష్య పేతురేకేऽమునాహతాః

సజ్యం కృత్వాపరే వీరా మాగధామ్బష్ఠచేదిపాః
భీమో దుర్యోధనః కర్ణో నావిదంస్తదవస్థితిమ్

కొందరు ధనువే లేపలేకపోయారు. కొందరు నారి ఎక్కుపెట్టలేకపోయారు. ఎక్కుపెట్టలేక కొందరూ, ఎక్కుపెట్టి కొందరూ పడిపోయారు. అది ఎక్కడుందో దుర్యోధన భీమ కర్ణులు తెలుసుకోలేకపోయారు

మత్స్యాభాసం జలే వీక్ష్య జ్ఞాత్వా చ తదవస్థితిమ్
పార్థో యత్తోऽసృజద్బాణం నాచ్ఛినత్పస్పృశే పరమ్

అర్జనుడు నీటిలో ఒక చోట ఉంది అని ఊహించుకున్నాడు. ఆ బాణం మత్స్యానికి తగిలింది కానీ చేదించలేకపోయింది.

రాజన్యేషు నివృత్తేషు భగ్నమానేషు మానిషు
భగవాన్ధనురాదాయ సజ్యం కృత్వాథ లీలయా

పరమాత్మ అభిజిత్ ముహూర్తములో వచ్చి ఆ బాణముతో చేదించాడు. దేవతలందరూ దుందుభులను మోగించి జయ శబ్దాలు చేసారు

తస్మిన్సన్ధాయ విశిఖం మత్స్యం వీక్ష్య సకృజ్జలే
ఛిత్త్వేషుణాపాతయత్తం సూర్యే చాభిజితి స్థితే

దివి దున్దుభయో నేదుర్జయశబ్దయుతా భువి
దేవాశ్చ కుసుమాసారాన్ముముచుర్హర్షవిహ్వలాః

తద్రఙ్గమావిశమహం కలనూపురాభ్యాం
పద్భ్యాం ప్రగృహ్య కనకోజ్వలరత్నమాలామ్
నూత్నే నివీయ పరిధాయ చ కౌశికాగ్ర్యే
సవ్రీడహాసవదనా కవరీధృతస్రక్

అపుడు నేను వనమాలను తీసుకుని గజ్జెలు ధ్వనిస్తూ ఉండగా కొప్పులో పూలు ముడుచుకుని,కొప్పులో ముడుచుకున్న పూల వాసనకు వెంటబడ్డ తుమ్మెదల నాదముతో సభ అంతా సంగీతం వినిపిస్తూ ఉండగా గొప్ప  నల్లని కేశములను ప్రకాశింపచేస్తున్న కుండలముల కాంతిని పక్కవారికి అందనీయకుండా పరమాత్మ యందు మాత్రమే దృష్టిపడేలా అలకలను పక్కకు జరిపి.

ఉన్నీయ వక్త్రమురుకున్తలకుణ్డలత్విడ్
గణ్డస్థలం శిశిరహాసకటాక్షమోక్షైః
రాజ్ఞో నిరీక్ష్య పరితః శనకైర్మురారేర్
అంసేऽనురక్తహృదయా నిదధే స్వమాలామ్

పక్కన ఉన్న రాజులను కూడా ఒక చూపు చూసి, రాజులందరినీ చూచుకుంటూ పరమాత్మ యొక్క మెడలో మాల వేసింది.

తావన్మృదఙ్గపటహాః శఙ్ఖభేర్యానకాదయః
నినేదుర్నటనర్తక్యో ననృతుర్గాయకా జగుః

ఇలా గాయకులు గానం చేసారు, నాట్యం చేసారు. ఇలా పార్మాత్మను నేను వరించాను.

ఏవం వృతే భగవతి మయేశే నృపయూథపాః
న సేహిరే యాజ్ఞసేని స్పర్ధన్తో హృచ్ఛయాతురాః

ఐనా నేను పరమాత్మను వరించుట స్వయం వరానికి వచ్చిన రాజులు జీర్ణించుకోలేకపోయారు.

మాం తావద్రథమారోప్య హయరత్నచతుష్టయమ్
శార్ఙ్గముద్యమ్య సన్నద్ధస్తస్థావాజౌ చతుర్భుజః

పరమాత్మ ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి నన్ను తీసుకుని రథం మీద కూర్చోబెట్టి శాంఖమును ఎక్కుపెట్టి నాలుగు చేతులతో సిద్ధముగా ఉన్నాడు.

దారుకశ్చోదయామాస కాఞ్చనోపస్కరం రథమ్
మిషతాం భూభుజాం రాజ్ఞి మృగాణాం మృగరాడివ

లేళ్ళన్నీ చూస్తుండగా సింహం లంఘించి వెళ్ళినట్లుగా వెళ్ళాడు

తేऽన్వసజ్జన్త రాజన్యా నిషేద్ధుం పథి కేచన
సంయత్తా ఉద్ధృతేష్వాసా గ్రామసింహా యథా హరిమ్

దారిలో అడ్డం వచ్చిన వారిని తన బాణముతో సంహరించాడు

తే శార్ఙ్గచ్యుతబాణౌఘైః కృత్తబాహ్వఙ్ఘ్రికన్ధరాః
నిపేతుః ప్రధనే కేచిదేకే సన్త్యజ్య దుద్రువుః

చక్కగా అలంకరించబడిన ద్వారకా నగరానికి తీసుకు వెళ్ళి నన్ను వివాహం చేసుకున్నాడు

తతః పురీం యదుపతిరత్యలఙ్కృతాం
రవిచ్ఛదధ్వజపటచిత్రతోరణామ్
కుశస్థలీం దివి భువి చాభిసంస్తుతాం
సమావిశత్తరణిరివ స్వకేతనమ్

పితా మే పూజయామాస సుహృత్సమ్బన్ధిబాన్ధవాన్
మహార్హవాసోऽలఙ్కారైః శయ్యాసనపరిచ్ఛదైః

మా తండ్రి కూడా బంధువులందరినీ ఆనందింపచేసాడు. శయ్యాదానం చేసాడు. (శయ్యాదానం చేస్తే అది తీసుకున్న దంపతులకు ఒక సంవత్సర కాలం బయటకు వెళ్ళి యాచించవలసిన అవసరం లేకుండా వారికి ఏర్పాటు చేయాలి.)

దాసీభిః సర్వసమ్పద్భిర్భటేభరథవాజిభిః
ఆయుధాని మహార్హాణి దదౌ పూర్ణస్య భక్తితః

ఇలా దాసీజనముతో నన్ను ఇచ్చాడు మా తండ్రి. నాకు ఎంతో మంది దాసీలున్నా నేను గృహదాసీగా నన్ను నేను భావించుకుంటున్నాను

ఆత్మారామస్య తస్యేమా వయం వై గృహదాసికాః
సర్వసఙ్గనివృత్త్యాద్ధా తపసా చ బభూవిమ

ఆయన ఆత్మారాముడు, సర్వ సంగాలనూ వదిలినవాడు, ఆయనకు మేము దగ్గర ఉండి అన్ని సేవలూ చేస్తాము. తనకు తానుగా నాకిది కావాలి అని ఎప్పుడూ అడగడు. ఏదీ పట్టించుకోడు. ఆయనకు అన్ని దాస్యాలూ చేయాలని మేము కోరుకుంటున్నాము

మహిష్య ఊచుః
భౌమం నిహత్య సగణం యుధి తేన రుద్ధా
జ్ఞాత్వాథ నః క్షితిజయే జితరాజకన్యాః
నిర్ముచ్య సంసృతివిమోక్షమనుస్మరన్తీః
పాదామ్బుజం పరిణినాయ య ఆప్తకామః

పదహారు వేల మంది భార్యల ప్రతినిధిగా ఒకరు మాట్లాడుతున్నారు. నరకాసురుని చేత బంధించబడిన మమ్ము తన యందు మనసు ఉన్నవారిగా తెలుసుకుని, ఆయననే మేము కోరుతున్నాము అని తెలుసుకున్న ఆప్తకాముడు (అనుకున్నదాన్నల్లా పొందగల వాడు) మమ్ములను పొందాడు.

న వయం సాధ్వి సామ్రాజ్యం స్వారాజ్యం భౌజ్యమప్యుత
వైరాజ్యం పారమేష్ఠ్యం చ ఆనన్త్యం వా హరేః పదమ్

ఈ సామ్రాజ్యాలూ భోగాలూ మోక్షమూ మొదలైనవి మాకు వద్దు. నివృత్తి లేని మోక్షాన్నీ, పరమపదాన్నీ మేము కోరము. పరమాత్మ పాద పరాగ సంపదను పొందిన మేము ఇవేమీ కోరము.

కామయామహ ఏతస్య శ్రీమత్పాదరజః శ్రియః
కుచకుఙ్కుమగన్ధాఢ్యం మూర్ధ్నా వోఢుం గదాభృతః

వ్రజస్త్రియో యద్వాఞ్ఛన్తి పులిన్ద్యస్తృణవీరుధః
గావశ్చారయతో గోపాః పదస్పర్శం మహాత్మనః

పరమాత్మ అడుగుల తొక్కిడి పడ్డ గరిక పోచలను తమ వక్షస్థలములో ఉంచుకుందామని గోపికలు కోరినట్లుగా. ఆవులను కాస్తున్న గోపాలురూ,గోపికలూ ఏ పరమాత్మ యొక్క పాద పరాగం అంటిన గడ్డి పరకలు హృదయములో ఉంచుకోవాలని కోరుకున్నట్లుగా మేము కూడా ఆ స్వామి పాదపరాగాన్నే కోరుతున్నాము. మాకు మిగతావేమీ అవసరం లేదు.

                                                                   సర్వం శ్రీకృష్ణార్పణంస్తు

Popular Posts