ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఏడవ అధ్యాయం
ఈ శాఖలూ ఇవి చదువుకున్న వారి గురించీ చదువుకుంటే అన్ని పాపాలు పోతాయి
సూత ఉవాచ
అథర్వవిత్సుమన్తుశ్చ శిష్యమధ్యాపయత్స్వకామ్
సంహితాం సోऽపి పథ్యాయ వేదదర్శాయ చోక్తవాన్
అధర్వ వేదాన్ని సుమతుడు తన శిష్యులకు బోధించాడు.
అతను వేద దర్శునికీ ,
శౌక్లాయనిర్బ్రహ్మబలిర్మోదోషః పిప్పలాయనిః
వేదదర్శస్య శిష్యాస్తే పథ్యశిష్యానథో శృణు
కుముదః శునకో బ్రహ్మన్జాజలిశ్చాప్యథర్వవిత్
అతను శౌక్లాయనునికీ, అతను బ్రహ్మబలికీ, పిప్పలాయునికీ, ఇలా మొదలైనవారందరూ అధర్వ వేదాన్ని చదువుకున్నారు
కుముద, శునక జాజలి అధర్వణ వేదాన్ని నేర్చుకున్నారు.
బభ్రుః శిష్యోऽథాన్గిరసః సైన్ధవాయన ఏవ చ
అధీయేతాం సంహితే ద్వే సావర్ణాద్యాస్తథాపరే
అంగీరసుని శిష్యుడు బభ్రు, ఆయన శిష్యుడు సైంధవాయనుడు
వారు రెండు సంహితలను నేర్చుకున్నారు
నక్షత్రకల్పః శాన్తిశ్చ కశ్యపాఙ్గిరసాదయః
ఏతే ఆథర్వణాచార్యాః శృణు పౌరాణికాన్మునే
నక్షత్ర కల్పా, శాంతి, కశ్యప అంగీరసాదులు అధర్వవేదానికి ఆచార్యులు
ఇంక పురాణాల గురించి విను.
త్రయ్యారుణిః కశ్యపశ్చ సావర్ణిరకృతవ్రనః
వైశమ్పాయనహారీతౌ షడ్వై పౌరాణికా ఇమే
అధీయన్త వ్యాసశిష్యాత్సంహితాం మత్పితుర్ముఖాత్
ఏకైకామహమేతేషాం శిష్యః సర్వాః సమధ్యగామ్
మా తండ్రి గారైన ఉగ్రస్రవుడు వ్యాసుని నుంచి నేర్చుకుంటే నేను వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను.
కశ్యపోऽహం చ సావర్ణీ రామశిష్యోऽకృతవ్రనః
అధీమహి వ్యాసశిష్యాచ్చత్వారో మూలసంహితాః
నేనూ కశ్యపుడూ సావర్ణీ, పరశురామ శిష్యుడైన అకృతవ్రనుడు చదువుకున్నాను
నాలుగు సంహితలనూ అధ్యయనం చేసాము
పురాణలక్షణం బ్రహ్మన్బ్రహ్మర్షిభిర్నిరూపితమ్
శృణుష్వ బుద్ధిమాశ్రిత్య వేదశాస్త్రానుసారతః
బ్రహ్మఋషులు పురాణ లక్షణాలేమిటో బాగా చెప్పారు
వేదశాస్త్రానుసారమైన పురాణం గురించి చెబుతున్నాను వినండి
సర్గోऽస్యాథ విసర్గశ్చ వృత్తిరక్షాన్తరాణి చ
వంశో వంశానుచరీతం సంస్థా హేతురపాశ్రయః
సర్గశ్చ, ప్రతి సర్గశ్చ వంశో మన్వంత రాణి చ, వంశాను చరితం చేతి పురాణం పంచ లక్షణం' అను అయిదు ముఖ్య విషయాలు పురాణంలో చెప్పబడి యున్నవి.
సర్గము అంటే సృష్టి
విసర్గము అంటే ప్రళయం
వృత్తి, రక్షణా, వంశమూ వంశాను చరితము, సంస్థా హేతువు అపాశ్రయం.
ఐదు కాకుండా మరో ఐదు ఉంటాయి మహాపురాణానికి
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుః
కేచిత్పఞ్చవిధం బ్రహ్మన్మహదల్పవ్యవస్థయా
ఈ పది లక్షణాలు. కొందరు దీన్ని ఐదు రకాలు అని చెబుతారు
అవ్యాకృతగుణక్షోభాన్మహతస్త్రివృతోऽహమః
భూతసూక్ష్మేన్ద్రియార్థానాం సమ్భవః సర్గ ఉచ్యతే
సర్గమంటే ప్రకృతి యొక్క గుణాలు శోభిస్తే మహత్తు పుడుతుంది. ఆ మహత్తు నుండి అహంకారం పుడుతుంది. ఆ అహంకారం మూడు రకాలు. సాత్విక రాజస తాంసములు. ఈ అహంకారం నుండి పంచ తన్మాత్రలూ పంచ జ్ఞ్యానేంద్రియములూ పంచ కర్మేంద్రియములూ పంచభూతములూ పుడతాయి. ఇదంతా కలిపి సర్గం అంటారు.
పురుషానుగృహీతానామేతేషాం వాసనామయః
విసర్గోऽయం సమాహారో బీజాద్బీజం చరాచరమ్
వీటినుండి బ్రహ్మాండమూ, దానినుండి చతుర్ముఖ బ్రహ్మ, దాని నుండి దేవతలూ మానవులూ దానవులూ బ్రహ్మఋషులూ రావడం విసర్గము.
పరమాత్మ చేత అనుగ్రహించబడిన ఈ 24 తత్వాల నుండి వాసనామయమైన సృష్టి విసర్గము. ఒక బీజం నుండి ఇంకో బీజం వచ్చినట్లుగా ఈ ఇరవై నాలుగు తత్వాల నుండి అంతా పుట్టింది
వృత్తిర్భూతాని భూతానాం చరాణామచరాణి చ
కృతా స్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాపి వా
సకల భూతముల వృత్తి ప్రవృత్తి, కోరికతో కానీ ప్రేరణతో గానీ ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణి పుడుతుంది
రక్షాచ్యుతావతారేహా విశ్వస్యాను యుగే యుగే
తిర్యఙ్మర్త్యర్షిదేవేషు హన్యన్తే యైస్త్రయీద్విషః
రక్ష అంటే పరమాత్మ యొక్క అవతార రూపం
ఇది ప్రతీ యుగములో ఉంటుంది
పరమాత్మ దేవతలుగా మానవులుగా ఋషిగా తిర్యక్ గా పుడతాడు. వేద శత్రువులను సంహరిస్తాడు
మన్వన్తరం మనుర్దేవా మనుపుత్రాః సురేశ్వరాః
ర్షయోऽంశావతారాశ్చ హరేః షడ్విధముచ్యతే
ఒక మన్వంతరం అంటే మనువూ, మను పుత్రులూ దేవతలూ సప్తఋషులూ, అవతారాలు, ఇంద్రుడు. ఇలా ఈ ఆరుగురూ ప్రతీ మన్వంతరములో ఉంటారు.
రాజ్ఞాం బ్రహ్మప్రసూతానాం వంశస్త్రైకాలికోऽన్వయః
వంశానుచరితం తేషామ్వృత్తం వంశధరాస్చ యే
బ్రహ్మ నుండి పుట్టిన రాజుల చరిత వంశము. ఇది త్రైకాలికం. వారి నుండి వచ్చిన వారు, మళ్ళీ వారి నుండి వచ్చినవారూ అంతా కలసి వంశానుచరితము.
నైమిత్తికః ప్రాకృతికో నిత్య ఆత్యన్తికో లయః
సంస్థేతి కవిభిః ప్రోక్తశ్చతుర్ధాస్య స్వభావతః
ప్రళయం నాలుగు రకాలు
నైమిత్తికం ప్రాకృతం ఆత్యంతికము నిత్యమూ. సంస్థ అంటే ప్రళయం
హేతుర్జీవోऽస్య సర్గాదేరవిద్యాకర్మకారకః
యం చానుశాయినం ప్రాహురవ్యాకృతముతాపరే
సర్గాదికి హేతువు అవిద్యతో ఉన్న జీవుడు హేతువు
దీనినే అనుశాయి అనీ అవ్యాకృతమనీ అంటారు ప్రకృతిని
వ్యతిరేకాన్వయో యస్య జాగ్రత్స్వప్నసుషుప్తిషు
మాయామయేషు తద్బ్రహ్మ జీవవృత్తిష్వపాశ్రయః
ఈ జీవునికి జాగృత్ స్వప్న సుషుప్తి అనే మూడు దశలు ఉంటాయి.
ఎక్కడెక్కడ సృష్టి ఉంటుందో అన్ని చోట్లా పరమాత్మే ఉంటాడు. ఆయన కారణం మనం కార్యము.
పదార్థేషు యథా ద్రవ్యం సన్మాత్రం రూపనామసు
బీజాదిపఞ్చతాన్తాసు హ్యవస్థాసు యుతాయుతమ్
బీజమూ అంకురము ప్రరోహమూ వృక్షమూ పతనం అనే ఐదు స్థితులు ఉంటాయి
ఇవి తెలుసుకున్నవాడు
విరమేత యదా చిత్తం హిత్వా వృత్తిత్రయం స్వయమ్
యోగేర్ల వా తదాత్మానం వేదేహాయా నివర్తతే
సత్వ రజస్తమో వృత్తులను విడిచిపెట్టి యోగముతో పరమాత్మను చేరతాడు
ఏవం లక్షణలక్ష్యాణి పురాణాని పురావిదః
మునయోऽష్టాదశ ప్రాహుః క్షుల్లకాని మహాన్తి చ
ఇవి పురాణ లక్షణాలు
మునులు మొత్తం పురాణాలు పద్దెనిమిది అన్నారు
మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది
బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లైఙ్గం సగారుడం
నారదీయం భాగవతమాగ్నేయం స్కాన్దసంజ్ఞితమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కణ్డేయం సవామనమ్
వారాహం మాత్స్యం కౌర్మం చ బ్రహ్మాణ్డాఖ్యమితి త్రిషట్
ఇలా మొత్తం పద్దెనిమిది పురాణాలు.
బ్రహ్మన్నిదం సమాఖ్యాతం శాఖాప్రణయనం మునేః
శిష్యశిష్యప్రశిష్యాణాం బ్రహ్మతేజోవివర్ధనమ్
ఈ ప్రకారముగా వేదములూ పురాణములు, వీటిని వ్యాసభగవానుడు ఎలా విస్తరింపచేసాడో చెప్పాను
ఈ శాఖ ప్రణయన విధానం తెలుసుకుంటే మనకు బ్రహ్మతేజస్సు పెరుగుతుంది.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు