Followers

Sunday, 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఎనిమిదవ అధ్యాయం

                  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఎనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
దుర్యోధనసుతాం రాజన్లక్ష్మణాం సమితింజయః
స్వయంవరస్థామహరత్సామ్బో జామ్బవతీసుతః

దుర్యోధనుని పుత్రిక లక్షణ. ఈమెను కృష్ణుని కుమారుడు, సాంబుడు (జాంబవతీ పుత్రుడు) స్వయం వరానికి వెళ్ళి అపహరించి తీసుకు వచ్చాడు.

కౌరవాః కుపితా ఊచుర్దుర్వినీతోऽయమర్భకః
కదర్థీకృత్య నః కన్యామకామామహరద్బలాత్

కౌరవులు చూచి కోపముతో అందరూ కలసి వచ్చి అతనితో యుద్ధం చేస్తే, ఒక్కొక్కరినీ తరిమివేసాడు. అపుడు అందరూ కలసి వచ్చి అతన్ని బంధించారు

బధ్నీతేమం దుర్వినీతం కిం కరిష్యన్తి వృష్ణయః
యేऽస్మత్ప్రసాదోపచితాం దత్తాం నో భుఞ్జతే మహీమ్

నిగృహీతం సుతం శ్రుత్వా యద్యేష్యన్తీహ వృష్ణయః
భగ్నదర్పాః శమం యాన్తి ప్రాణా ఇవ సుసంయతాః

ఇతి కర్ణః శలో భూరిర్యజ్ఞకేతుః సుయోధనః
సామ్బమారేభిరే యోద్ధుం కురువృద్ధానుమోదితాః

కొంతకాలానికి ఆ వార్త కృష్ణ బలరాములకు నారదుడు చెప్పాడు. మేము మీ కొడుకుని బంధించాము శక్తి ఉంటే వచ్చి విడిపించుకో అని కర్ణుడు పలికాడు

దృష్ట్వానుధావతః సామ్బో ధార్తరాష్ట్రాన్మహారథః
ప్రగృహ్య రుచిరం చాపం తస్థౌ సింహ ఇవైకలః

తం తే జిఘృక్షవః క్రుద్ధాస్తిష్ఠ తిష్ఠేతి భాషిణః
ఆసాద్య ధన్వినో బాణైః కర్ణాగ్రణ్యః సమాకిరన్

సోऽపవిద్ధః కురుశ్రేష్ఠ కురుభిర్యదునన్దనః
నామృష్యత్తదచిన్త్యార్భః సింహ క్షుద్రమృగైరివ

దానికి అందరూ ఒప్పుకున్నారు. కృష్ణుడు యాదవ సైన్యం తీసుకు రాబోతుంటే బలరాముడు వారించాడు. వారు మనవారే కదా, నేను వెళ్ళి తీసుకు వస్తాను. యాదవ కౌరవ యుద్ధం వద్దు అని నచ్చ జెప్పి ఉద్ధవున్ని తీసుకుని హస్తినకువెళ్ళాడు. బలరాముడు బయట ఉ ండి ఉద్ధవున్ని పంపించాడు నగరములోకి

విస్ఫూర్జ్య రుచిరం చాపం సర్వాన్వివ్యాధ సాయకైః
కర్ణాదీన్షడ్రథాన్వీరస్తావద్భిర్యుగపత్పృథక్

చతుర్భిశ్చతురో వాహానేకైకేన చ సారథీన్
రథినశ్చ మహేష్వాసాంస్తస్య తత్తేऽభ్యపూజయన్

తం తు తే విరథం చక్రుశ్చత్వారశ్చతురో హయాన్
ఏకస్తు సారథిం జఘ్నే చిచ్ఛేదణ్యః శరాసనమ్

తం బద్ధ్వా విరథీకృత్య కృచ్ఛ్రేణ కురవో యుధి
కుమారం స్వస్య కన్యాం చ స్వపురం జయినోऽవిశన్

దృతరాష్టృడు ఎలాంటి భావనలో ఉన్నాడో తెలుసుకోవడానికి ఉద్ధవున్ని పంపాడు. ఉద్ధవుడు కౌరవులకు విషయం చెప్పగా, గురువైన బలరాముడు వచ్చిన సంగతి తెలిసి అన్ని కానుకలూ పంపించారు వారు. అందరూ శిరస్సు వంచి బలరామునికి నమస్కారం చేసారు. కుశల ప్రశ్నలు పూర్తి ఐన తరువాత బలరాముడు ఈ విధముగా అన్నాడు. " రారాజు ఐన ఉగ్రసేనుడు మిమ్ము ఇలా ఆజ్ఞ్యాపిస్తున్నాడు. జాగ్రత్తగా విని ఆలస్యం కాకుండా అతని ఆజ్ఞ్యను మీరు పాటించండి. ధార్మికుడైన సాంబున్ని మీరు పది మందీ కలసి అధార్మికముగా బంధించరని తెలుసుకున్నాము. ఐనా మనలో మనకు కలహాలు వద్దని నేను యుద్ధాన్ని ఆపాను. బంధుత్వాన్ని మన్నించి మీరు కూడా అబ్బాయినీ అమ్మాయినీ కట్నకానుకలతో మా నగరానికి పంపించండి. అలా చేస్తే మన రెండు నగరాలూ క్షేమముగా సఖ్యముగా ఉంటాయి" అని ఉగ్రసేనుడు ఆజ్ఞ్యాపించాడు.

తచ్ఛ్రుత్వా నారదోక్తేన రాజన్సఞ్జాతమన్యవః
కురూన్ప్రత్యుద్యమం చక్రురుగ్రసేనప్రచోదితాః

సాన్త్వయిత్వా తు తాన్రామః సన్నద్ధాన్వృష్ణిపుఙ్గవాన్
నైచ్ఛత్కురూణాం వృష్ణీనాం కలిం కలిమలాపహః

జగామ హాస్తినపురం రథేనాదిత్యవర్చసా
బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ వృతశ్చన్ద్ర ఇవ గ్రహైః

గత్వా గజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః
ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయా

సోऽభివన్ద్యామ్బికాపుత్రం భీష్మం ద్రోణం చ బాహ్లికమ్
దుర్యోధనం చ విధివద్రామమాగతం అబ్రవీత్

తేऽతిప్రీతాస్తమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తమమ్
తమర్చయిత్వాభియయుః సర్వే మఙ్గలపాణయః

తం సఙ్గమ్య యథాన్యాయం గామర్ఘ్యం చ న్యవేదయన్
తేషాం యే తత్ప్రభావజ్ఞాః ప్రణేముః శిరసా బలమ్

బన్ధూన్కుశలినః శ్రుత్వా పృష్ట్వా శివమనామయమ్
పరస్పరమథో రామో బభాషేऽవిక్లవం వచః

ఉగ్రసేనః క్షితేశేశో యద్వ ఆజ్ఞాపయత్ప్రభుః
తదవ్యగ్రధియః శ్రుత్వా కురుధ్వమవిలమ్బితమ్

యద్యూయం బహవస్త్వేకం జిత్వాధర్మేణ ధార్మికమ్
అబధ్నీతాథ తన్మృష్యే బన్ధూనామైక్యకామ్యయా

వీర్యశౌర్యబలోన్నద్ధమాత్మశక్తిసమం వచః
కురవో బలదేవస్య నిశమ్యోచుః ప్రకోపితాః

అహో మహచ్చిత్రమిదం కాలగత్యా దురత్యయా
ఆరురుక్షత్యుపానద్వై శిరో ముకుటసేవితమ్

ఆ మాట విని కుపితులైన కౌరవులు కాలం చాలా విచిత్రమైనది. ఉగ్రసేనుడు రాజట. కాళ్ళకు వేసుకునే చెప్పులు నెత్తినపెట్టుకున్నట్లు ఉంది.

ఏతే యౌనేన సమ్బద్ధాః సహశయ్యాసనాశనాః
వృష్ణయస్తుల్యతాం నీతా అస్మద్దత్తనృపాసనాః

సంబంధం కలుపుకున్నమని వారు రాజులమని చెప్పుకున్నా సింహాసనం మీద కూర్చున్న శయ్యాసనాధి భోగాలు అనుభవిస్తూ ఉన్నా మేము ఉపేక్షించాము

చామరవ్యజనే శఙ్ఖమాతపత్రం చ పాణ్డురమ్
కిరీటమాసనం శయ్యాం భుఞ్జతేऽస్మదుపేక్షయా

చామరవ్యజనం శంఖం ఆతపత్రం కిరీటమూ శయ్యా ఇవన్ని అనుభవిస్తున్నరంటే మా ఉపేక్షే కారణం

అలం యదూనాం నరదేవలాఞ్ఛనైర్దాతుః ప్రతీపైః ఫణినామివామృతమ్
యేऽస్మత్ప్రసాదోపచితా హి యాదవా ఆజ్ఞాపయన్త్యద్య గతత్రపా బత

అది కాదని మేమే రాజులం అనే స్థితికి వచ్చింది. పాముకు అమృతం పోసినట్లు ఇచ్చినవారినే ఆజ్ఞ్యాపించే స్థితికి వచ్చారు. మా అనుగ్రహముతో ఇంత వారైన యాదవులు సిగ్గుడు విడిచి మమ్ము ఆజ్ఞ్యాపిస్తారా

కథమిన్ద్రోऽపి కురుభిర్భీష్మద్రోణార్జునాదిభిః
అదత్తమవరున్ధీత సింహగ్రస్తమివోరణః

ఇంద్రుడు కూడా బీష్మ ద్రోణ అర్జునాది యోధులతో యుద్ధం చేయడానికి జంకుతాడు. అలాంటి మమ్ము ఉగ్రసేనుడు ఆజ్ఞ్యాపిస్తాడా. మేము ఇవ్వకుంటే ఇంద్రుడు కూడా తీసుకోలేడు, సింహం తీసుకున్న దాన్ని తోడేలు లాగుకోలేనట్లుగా

శ్రీబాదరాయణిరువాచ
జన్మబన్ధుశ్రీయోన్నద్ధ మదాస్తే భరతర్షభ
ఆశ్రావ్య రామం దుర్వాచ్యమసభ్యాః పురమావిశన్

అనకూడని మాటలనీ అని అసభ్యులుగా నగరములోకి ప్రవేశించారు

దృష్ట్వా కురూనాం దౌఃశీల్యం శ్రుత్వావాచ్యాని చాచ్యుతః
అవోచత్కోపసంరబ్ధో దుష్ప్రేక్ష్యః ప్రహసన్ముహుః

కౌరవుల దుశ్శీలాన్ని చూచి అవాక్యములు విని బలరామునికి కోపం వచ్చి వికటాట్టహాసం చేస్తూ

నూనం నానామదోన్నద్ధాః శాన్తిం నేచ్ఛన్త్యసాధవః
తేషాం హి ప్రశమో దణ్డః పశూనాం లగుడో యథా

అహో యదూన్సుసంరబ్ధాన్కృష్ణం చ కుపితం శనైః
సాన్త్వయిత్వాహమేతేషాం శమమిచ్ఛన్నిహాగతః

త ఇమే మన్దమతయః కలహాభిరతాః ఖలాః
తం మామవజ్ఞాయ ముహుర్దుర్భాషాన్మానినోऽబ్రువన్

ఇన్ని రకముల మదములున్న దుర్మార్గులు శాంతిని కోరతారా. పశువు దండం తీసుకుని చెబితేనే మాట వింటుంది. ఇలాంటి వారికి కూడా దండమే మంత్రం.
కృష్ణుడు యాదవులూ కోప్పడ్డారు. వారిని శాంతింపచేస్తి నేను వెళతానని చెప్పినందుకు నాకు తగిన రీతిన వీరు బుద్ధి చెప్పారు.
వీరు దుర్మార్గులు కలహాతురులు మంద బుద్ధులు. నన్ను తిరస్కరించి అహంకారముతో మాట్లాడారు.

నోగ్రసేనః కిల విభుర్భోజవృష్ణ్యన్ధకేశ్వరః
శక్రాదయో లోకపాలా యస్యాదేశానువర్తినః

సుధర్మాక్రమ్యతే యేన పారిజాతోऽమరాఙ్ఘ్రిపః
ఆనీయ భుజ్యతే సోऽసౌ న కిలాధ్యాసనార్హణః

యస్య పాదయుగం సాక్షాచ్ఛ్రీరుపాస్తేऽఖిలేశ్వరీ
స నార్హతి కిల శ్రీశో నరదేవపరిచ్ఛదాన్

ఉగ్రసేనుడు రాజు కాడట. వీరు రాజట. ఇంద్రుడు సాక్షాత్తు సుధర్మను ఇచ్చి కృష్ణుని ఆజ్ఞ్యను శిరస్సున ధరిస్తున్నారు. ఉగ్రసేనుని ఆజ్ఞ్యను వారు వహిస్తున్నారు.అలాంటి ఉగ్రసేనుడు వీరికి రాజు కాదట. స్వర్గానికి వెళ్ళి పారిజాతాన్ని తీసుకుని వచ్చి తన తోటలో పెట్టుకున్న కృష్ణుడికి రాజ్యాధికారం లేదట. ఎవరి పాదపద్మాలను సాక్షాత్తు లఖ్స్మి సేవిస్తోందో అలాంటి శ్రియః పతి రాజ లాంచనానికి తగడట

యస్యాఙ్ఘ్రిపఙ్కజరజోऽఖిలలోకపాలైర్
మౌల్యుత్తమైర్ధృతముపాసితతీర్థతీర్థమ్
బ్రహ్మా భవోऽహమపి యస్య కలాః కలాయాః
శ్రీశ్చోద్వహేమ చిరమస్య నృపాసనం క్వ

ఎవరి పాద పరాగాన్ని బ్రహ్మాది దేవతలు ఇంద్రాదులు, పరమ శివుడూ, నేను కూడా ధరిస్తామో. మేమందరం ఆయన అంశలో ఒక భాగం. అతని ఆజ్ఞ్యను శిరసా వహిస్తాము.అటువంటి వానికి సింహాస్నార్హత లేదా

భుఞ్జతే కురుభిర్దత్తం భూఖణ్డం వృష్ణయః కిల
ఉపానహః కిల వయం స్వయం తు కురవః శిరః

కౌరవులు ఇచ్చిన భూమిని యాదవులు అనుభవిస్తున్నారట. మేము పాదుకలమా? కౌరవులు శిరస్సా

అహో ఐశ్వర్యమత్తానాం మత్తానామివ మానినామ్
అసమ్బద్ధా గిఋ రుక్షాః కః సహేతానుశాసీతా

దురహంకారముతో ఐశ్వర్యముతో మదించి అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు. భూమండలములో కౌరవులు లేకుండా చేస్తాను. అపుడు తెలుసుతుంది ఎవరు రాజులో ఎవరు కారో

అద్య నిష్కౌరవం పృథ్వీం కరిష్యామీత్యమర్షితః
గృహీత్వా హలముత్తస్థౌ దహన్నివ జగత్త్రయమ్

మూడు లోకాలనూ దహిస్తున్నట్లుగా నాగలి తీసుకుని నాగలి కొసతో

లాఙ్గలాగ్రేణ నగరముద్విదార్య గజాహ్వయమ్
విచకర్ష స గఙ్గాయాం ప్రహరిష్యన్నమర్షితః

జలయానమివాఘూర్ణం గఙ్గాయాం నగరం పతత్
ఆకృష్యమాణమాలోక్య కౌరవాః జాతసమ్భ్రమాః

పట్టణాన్ని లేపాడు. నాగలితో పోడిచి గంగలో వేయడానికి సిద్ధపడ్డాడు. గంగా ప్రవాహములో ఈ నగరం పడవలాగ ఊగిసలాడింది. విషయం అందరికీ అర్థమయ్యింది.

తమేవ శరణం జగ్ముః సకుటుమ్బా జిజీవిషవః
సలక్ష్మణం పురస్కృత్య సామ్బం ప్రాఞ్జలయః ప్రభుమ్

రామ రామాఖిలాధార ప్రభావం న విదామ తే
మూఢానాం నః కుబుద్ధీనాం క్షన్తుమర్హస్యతిక్రమమ్

స్థిత్యుత్పత్త్యప్యయానాం త్వమేకో హేతుర్నిరాశ్రయః
లోకాన్క్రీడనకానీశ క్రీడతస్తే వదన్తి హి

త్వమేవ మూర్ధ్నీదమనన్త లీలయా భూమణ్డలం బిభర్షి సహస్రమూర్ధన్
అన్తే చ యః స్వాత్మనిరుద్ధవిశ్వః శేషేऽద్వితీయః పరిశిష్యమాణః

బలరాముని వద్దకు వచ్చి బతుకు కోరుకున్నవారై బలరాముని శరణు వేడి లక్షణనూ సాంబుడినీ కానుకలతో సహా ఆయనకు ఇచ్చి సమర్పించుకుని చేతులు జోడించి, స్వామీ పొరబాటయ్యింది. నీ ప్రభావం నాకు తైలియదు. నీవు జగత్తు యొక్క సృష్టీ స్థితీ రక్షణ చేస్తావు. ఈ లోకాలన్నీ నీకు ఆటబొమ్మలు. భూమండలాన్ని నీవు ఆవగింజలా భరిస్తావు. ప్రపంచమంతా ప్రళయకాలములో భస్మమైతే నీవొక్కడవే మిగులుతావు. అందుకే నిన్ను శేషుడు అంటారు. నీ కోపం దుష్టులను శిక్షించి సజ్జనులను కాపాడడానికి పనికి వచ్చేది

కోపస్తేऽఖిలశిక్షార్థం న ద్వేషాన్న చ మత్సరాత్
బిభ్రతో భగవన్సత్త్వం స్థితిపాలనతత్పరః

నమస్తే సర్వభూతాత్మన్సర్వశక్తిధరావ్యయ
విశ్వకర్మన్నమస్తేऽస్తు త్వాం వయం శరణం గతాః

నీకు నమస్కారం. నిన్ను శరణు వేడుతున్నాము. మమ్ము కాపాడు. అని ప్రార్థిస్తే

శ్రీశుక ఉవాచ
ఏవం ప్రపన్నైః సంవిగ్నైర్వేపమానాయనైర్బలః
ప్రసాదితః సుప్రసన్నో మా భైష్టేత్యభయం దదౌ

దుర్యోధనః పారిబర్హం కుఞ్జరాన్షష్టిహాయనాన్
దదౌ చ ద్వాదశశతాన్యయుతాని తురఙ్గమాన్

వారి ప్రార్థనను తీసుకుని అభయం ఇచ్చాడు. దుర్యోధనుడు పన్నెండు వేల గుర్రాలను ఆరువేల రథాలను వేయి మంది దాసీలనూ ఇచ్చాడు

రథానాం షట్సహస్రాణి రౌక్మాణాం సూర్యవర్చసామ్
దాసీనాం నిష్కకణ్ఠీనాం సహస్రం దుహితృవత్సలః

ప్రతిగృహ్య తు తత్సర్వం భగవాన్సాత్వతర్షభః
ససుతః సస్నుషః ప్రాయాత్సుహృద్భిరభినన్దితః

తతః ప్రవిష్టః స్వపురం హలాయుధః
సమేత్య బన్ధూననురక్తచేతసః
శశంస సర్వం యదుపుఙ్గవానాం
మధ్యే సభాయాం కురుషు స్వచేష్టితమ్

అద్యాపి చ పురం హ్యేతత్సూచయద్రామవిక్రమమ్
సమున్నతం దక్షిణతో గఙ్గాయామనుదృశ్యతే

నగరములోకి ప్రవేశించి పిల్లలనూ కోడళ్ళనూ కలిసాడు. సభలో జరిగిన దాన్ని బలరాముడు వివరించాడు. ఇప్పటికీ హస్తినాపురం దక్షిణ భాగం ఎత్తులో ఉత్తరభాగం పల్లములో ఉంటుంది. అది బలరాముని విక్రమం.


                         సర్వం శ్రీకృష్ణార్పణంస్తు
                         

Popular Posts