ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై తొమ్మిదవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
నరకం నిహతం శ్రుత్వా తథోద్వాహం చ యోషితామ్
కృష్ణేనైకేన బహ్వీనాం తద్దిదృక్షుః స్మ నారదః
దీని తరువాత కొంతకాలానికి నారదునికి ఒక ఆలోచన వచ్చింది. ఈ స్వామి నరకాసురున్ని సంహరించి పదుహారువేల మంది రాజ పుత్రికల్ను వివాహం చేసుకున్నాడు.ఇంతమందికీ ఇన్ని అంతఃపురాలు ఏర్పాటు చేసాడు. అందరితో ఈయన ఎలా ఉంటున్నాడు.ఎందరి మనసుకు సంతోషం కలుగుతున్నది.ఎందరిని ఈయన బాధపెడుతున్నాడు అని తెలుసుకోవాలని నారదుడు ద్వారకా నగరానికి వచ్చాడు
చిత్రం బతైతదేకేన వపుషా యుగపత్పృథక్
గృహేషు ద్వ్యష్టసాహస్రం స్త్రియ ఏక ఉదావహత్
ఇత్యుత్సుకో ద్వారవతీం దేవర్షిర్ద్రష్టుమాగమత్
పుష్పితోపవనారామ ద్విజాలికులనాదితామ్
ఉత్ఫుల్లేన్దీవరామ్భోజ కహ్లారకుముదోత్పలైః
ఛురితేషు సరఃసూచ్చైః కూజితాం హంససారసైః
ప్రాసాదలక్షైర్నవభిర్జుష్టాం స్ఫాటికరాజతైః
మహామరకతప్రఖ్యైః స్వర్ణరత్నపరిచ్ఛదైః
విభక్తరథ్యాపథచత్వరాపణైః శాలాసభాభీ రుచిరాం సురాలయైః
సంసిక్తమార్గాఙ్గనవీథిదేహలీం పతత్పతాకధ్వజవారితాతపామ్
తస్యామన్తఃపురం శ్రీమదర్చితం సర్వధిష్ణ్యపైః
హరేః స్వకౌశలం యత్ర త్వష్ట్రా కార్త్స్న్యేన దర్శితమ్
శ్రీకృష్ణ పరమాత్మునికి తన నిర్మాణ కౌశలాన్ని చూపదలచుకున్న విశ్వకర్మ అంతఃపురాన్ని అంత బాగా నిర్మించాడు. అన్ని రకాల శోభలు కలిగిన పదుహారువేల అంతఃపురాలని చూచాడు
కనపడ్డ ఒక అంతఃపురానికి వెళ్ళాడు. రకరకాల స్తంభములూ, ఏనుగు దంతములతో చేసిన ఆసనాలు రత్నమూ వజ్రములూ స్ఫటికములతో ఉన్నాయి. రత్నముల కాంతితో పగలూ రాత్రీ ఒకే తీరుగా ఉన్నాయి.
తత్ర షోడశభిః సద్మ సహస్రైః సమలఙ్కృతమ్
వివేశైకతోమం శౌరేః పత్నీనాం భవనం మహత్
విష్టబ్ధం విద్రుమస్తమ్భైర్వైదూర్యఫలకోత్తమైః
ఇన్ద్రనీలమయైః కుడ్యైర్జగత్యా చాహతత్విషా
వితానైర్నిర్మితైస్త్వష్ట్రా ముక్తాదామవిలమ్బిభిః
దాన్తైరాసనపర్యఙ్కైర్మణ్యుత్తమపరిష్కృతైః
దాసీభిర్నిష్కకణ్ఠీభిః సువాసోభిరలఙ్కృతమ్
పుమ్భిః సకఞ్చుకోష్ణీష సువస్త్రమణికుణ్డలైః
రత్నప్రదీపనికరద్యుతిభిర్నిరస్త ధ్వాన్తం విచిత్రవలభీషు శిఖణ్డినోऽఙ్గ
నృత్యన్తి యత్ర విహితాగురుధూపమక్షైర్నిర్యాన్తమీక్ష్య ఘనబుద్ధయ ఉన్నదన్తః
తస్మిన్సమానగుణరూపవయఃసువేష
దాసీసహస్రయుతయానుసవం గృహిణ్యా
విప్రో దదర్శ చమరవ్యజనేన రుక్మ
దణ్డేన సాత్వతపతిం పరివీజయన్త్యా
తం సన్నిరీక్ష్య భగవాన్సహసోత్థితశ్రీ
పర్యఙ్కతః సకలధర్మభృతాం వరిష్ఠః
ఆనమ్య పాదయుగలం శిరసా కిరీట
జుష్టేన సాఞ్జలిరవీవిశదాసనే స్వే
తస్యావనిజ్య చరణౌ తదపః స్వమూర్ధ్నా
బిభ్రజ్జగద్గురుతమోऽపి సతాం పతిర్హి
బ్రహ్మణ్యదేవ ఇతి యద్గుణనామ యుక్తం
తస్యైవ యచ్చరణశౌచమశేషతీర్థమ్
అంతఃపురానికి వెళ్ళేసరికి ఆ ప్రియురాలు కృష్ణపరమాతకు చామరముతో వీస్తుండడం చూచాడు. నారదుడు వచ్చాడు కృష్ణుడు అమాంతం లేచి వెళ్ళి, స్వాగం చెప్పి, కూర్చోబెట్టి పాదప్రక్షాళన చేసి, నెత్తిన నీళ్ళు జల్లుకుని, అన్ని పూజలూ చేసి
సమ్పూజ్య దేవఋషివర్యమృషిః పురాణో
నారాయణో నరసఖో విధినోదితేన
వాణ్యాభిభాష్య మితయామృతమిష్టయా తం
ప్రాహ ప్రభో భగవతే కరవామ హే కిమ్
నారాయణుడు, సకల దేవతలూ ఎవరి పాద తీర్థోదకాన్ని శిరస్సున ధరిస్తారో అటువంటి స్వామి నారదుని పాదోదకాన్ని శిరస్సున జల్లుకుని మెత్త మెత్తగా మాట్లాడి , స్వామి మీరు ఆజ్ఞ్యపించండి ఏమి చేయాలో అని అడిగాడు
శ్రీనారద ఉవాచ
నైవాద్భుతం త్వయి విభోऽఖిలలోకనాథే
మైత్రీ జనేషు సకలేషు దమః ఖలానామ్
నిఃశ్రేయసాయ హి జగత్స్థితిరక్షణాభ్యాం
స్వైరావతార ఉరుగాయ విదామ సుష్ఠు
అఖిలలోకనాధా, నీవారి యందు ప్రీతి దుష్టుల యందు దండనా నీ విషయములో వింతకాదు. జగత్తు క్షేమానికి నీవు సృష్టిస్తావు రక్షిస్తావు, అవతారముతో వస్తావు. సకల జనూలకూ మోక్షం కలిగించే నీ పాద పద్మాలను చూచాను
దృష్టం తవాఙ్ఘ్రియుగలం జనతాపవర్గం
బ్రహ్మాదిభిర్హృది విచిన్త్యమగాధబోధైః
సంసారకూపపతితోత్తరణావలమ్బం
ధ్యాయంశ్చరామ్యనుగృహాణ యథా స్మృతిః స్యాత్
సంసారం అనే కూపములో పడిన వారిని ఉద్ధరించే నీ పాదపద్మాలను ధ్యానం చేస్తూ తిరిగేట్లుగా ఎప్పుడూ నా స్మృతి నీ పాదముల యందు ఉండేట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు. అక్కడి నుంచి ఇంకో స్త్రీ ఇంటికి వెళ్ళాడు
తతోऽన్యదావిశద్గేహం కృష్ణపత్న్యాః స నారదః
యోగేశ్వరేశ్వరస్యాఙ్గ యోగమాయావివిత్సయా
దీవ్యన్తమక్షైస్తత్రాపి ప్రియయా చోద్ధవేన చ
పూజితః పరయా భక్త్యా ప్రత్యుత్థానాసనాదిభిః
అక్క్డ కృష్ణుడు తన ప్రియురాలితో పాచికలాడుతున్నాడు. అక్కడ కూడా కృష్ణుని చేత పూజలందుకున్నాడు నారదుడు
పృష్టశ్చావిదుషేవాసౌ కదాయాతో భవానితి
క్రియతే కిం ను పూర్ణానామపూర్ణైరస్మదాదిభిః
మీరు పూర్ణులు. మీకు ఏమి చేయగలవాడని అని కృష్ణుడు అడుగగా ఏమీ మాట్లాడకుండా ఇంకో ఇంటికి వెళ్ళాడు
అథాపి బ్రూహి నో బ్రహ్మన్జన్మైతచ్ఛోభనం కురు
స తు విస్మిత ఉత్థాయ తూష్ణీమన్యదగాద్గృహమ్
తత్రాప్యచష్ట గోవిన్దం లాలయన్తం సుతాన్శిశూన్
తతోऽన్యస్మిన్గృహేऽపశ్యన్మజ్జనాయ కృతోద్యమమ్
అక్కడ కృష్ణుడు మనవల్లని ఎత్తుకుని ఆడిస్తున్నాడు. దాన్నీ చూచాడు. ఇంకో ఇంటికి వెళ్ళాడు
జుహ్వన్తం చ వితానాగ్నీన్యజన్తం పఞ్చభిర్మఖైః
భోజయన్తం ద్విజాన్క్వాపి భుఞ్జానమవశేషితమ్
అక్కడ స్వామి అప్పుడే స్నానానికి వెళుతున్నాడు. ఇంకో చోట హోమం చేస్తున్నాడు, ఇంకో చోట బ్రాహ్మణులకు భోజనం పెడుతున్నాడు
క్వాపి సన్ధ్యాముపాసీనం జపన్తం బ్రహ్మ వాగ్యతమ్
ఏకత్ర చాసిచర్మాభ్యాం చరన్తమసివర్త్మసు
ఇంకో చోట సంధ్యా వందనం చేస్తున్నాడు. ఇంకో చోట కత్తి డాలూ యుద్ధాన్ని అభ్యసిస్తున్న వాడినీ, ఒక చోట ఏనుగులతో ఒక చో గుర్రములతో
అశ్వైర్గజై రథైః క్వాపి విచరన్తం గదాగ్రజమ్
క్వచిచ్ఛయానం పర్యఙ్కే స్తూయమానం చ వన్దిభిః
మన్త్రయన్తం చ కస్మింశ్చిన్మన్త్రిభిశ్చోద్ధవాదిభిః
జలక్రీడారతం క్వాపి వారముఖ్యాబలావృతమ్
ఇంకో చోట నిదురపోతున్నాడు ఒక చోట వందులందరూ స్తోత్రం చేస్తున్నాడు,, ఒక చోట మంత్రులతో కలసి ఆలోచిస్తున్నాడు, ఒక చోట జల క్రీడలాడుతున్నాడు
కుత్రచిద్ద్విజముఖ్యేభ్యో దదతం గాః స్వలఙ్కృతాః
ఇతిహాసపురాణాని శృణ్వన్తం మఙ్గలాని చ
ఒక చోట గోదానం చేస్తున్నాడు, ఒక చోట ఇతిహాస పురాణాలను బ్రాహ్మణులతో వింటున్నాడు.
హసన్తం హాసకథయా కదాచిత్ప్రియయా గృహే
క్వాపి ధర్మం సేవమానమర్థకామౌ చ కుత్రచిత్
ధ్యాయన్తమేకమాసీనం పురుషం ప్రకృతేః పరమ్
శుశ్రూషన్తం గురూన్క్వాపి కామైర్భోగైః సపర్యయా
హాస్యముగా మాట్లాడుతూ నవ్వుతున్నాడు, ఒక చోట ధర్మాన్ని ఒక చోట అర్థ కామాలని సేవిస్తున్నవాడిని, ఒక చోట పరమాత్మను ధ్యానం చేస్తున్నవాడిని, ఒక చోట గురువులకు సేవ చేస్తున్నవాడిని
కుర్వన్తం విగ్రహం కైశ్చిత్సన్ధిం చాన్యత్ర కేశవమ్
కుత్రాపి సహ రామేణ చిన్తయన్తం సతాం శివమ్
పుత్రాణాం దుహితౄణాం చ కాలే విధ్యుపయాపనమ్
దారైర్వరైస్తత్సదృశైః కల్పయన్తం విభూతిభిః
ప్రస్థాపనోపనయనైరపత్యానాం మహోత్సవాన్
వీక్ష్య యోగేశ్వరేశస్య యేషాం లోకా విసిస్మిరే
ఒక చోట పేచీ పెట్టుకుంటున్నాడు, ఒక చోట కలహిస్తున్నాడు ఒక చోట మైత్రి చేత్సున్నాడు ఒక చోట రామునితో కలసి ఏదో మాట్లాడుతున్నాడు
యజన్తం సకలాన్దేవాన్క్వాపి క్రతుభిరూర్జితైః
పూర్తయన్తం క్వచిద్ధర్మం కూర్పారామమఠాదిభిః
చరన్తం మృగయాం క్వాపి హయమారుహ్య సైన్ధవమ్
ఘ్నన్తం తత్ర పశూన్మేధ్యాన్పరీతం యదుపుఙ్గవైః
కొడుకులనూ కోడల్లనూ బిడ్డలనూ మనవళ్ళనూ మనవరాళ్ళనూ ఇలా వారితో. ఒక చోట పెళ్ళి చూపులూ, నిశ్చితార్థాలూ, వివాహాలు జరుపుతూ, అక్షరాభ్యాసం అన్న ప్రాశనం, ఇలాంటి జరుపుతూ
అవ్యక్తలిన్గం ప్రకృతిష్వన్తఃపురగృహాదిషు
క్వచిచ్చరన్తం యోగేశం తత్తద్భావబుభుత్సయా
ఇలా రకరకాలుగా జరుపుతూ ఉన్నాడు, ఇలా పరమాత్మ లీలలను చూచి, యజ్ఞ్యాలతో దేవతలను ఆరాధిస్తున్న స్వామిని, ఒక చోట బావులు తవ్విస్తూ తోటలు ఏర్పాటు చేస్తూ మఠాలూ సత్రాలూ దేవాలయాలూ కట్టిస్తున్న స్వామి. ఒక చోట గుర్రం ఎక్కి ఏనుగు ఎక్కి ఒక చోట వేతకు వెళుతున్నాడు. కౄరమృగాలను చంపుతున్నాడు
ఇలా ఇన్ని రకాలుగా స్వామిని చూచి నారదుడు ఏమీ అర్థం కాక
అథోవాచ హృషీకేశం నారదః ప్రహసన్నివ
యోగమాయోదయం వీక్ష్య మానుషీమీయుషో గతిమ్
చివరికి ఒక ఇంటికి వెళ్ళి స్వామితో అంటున్నాడు, స్వామీ నీ యోగమాయను చూడాలని వచ్చాను. నీ యోగమాయ మహా యోగులకు కూడా అర్థం కాదు.
విదామ యోగమాయాస్తే దుర్దర్శా అపి మాయినామ్
యోగేశ్వరాత్మన్నిర్భాతా భవత్పాదనిషేవయా
అనుజానీహి మాం దేవ లోకాంస్తే యశసాప్లుతాన్
పర్యటామి తవోద్గాయన్లీలా భువనపావనీః
దీనితో నీ పాదములను మరికాస్త గట్టిగా పట్టుకోవాలని తెలిసినది. నాకు అనుజ్ఞ్య ఇవ్వు. నీ ఈ గొప్ప కీర్తిని లోకమంతటా ప్రచారం చేయడానికి గానం చేస్తూ తిరిగుతా అని ప్రార్థించాడు
శ్రీభగవానువాచ
బ్రహ్మన్ధన్నస్య వక్తాహం కర్తా తదనుమోదితా
తచ్ఛిక్షయన్లోకమిమమాస్థితః పుత్ర మా ఖిదః
నారదా, నీవూ మాయలో పడ్డావా? నేనెవరో తెలుసా. నేను ధర్మాన్ని బోధించే వాడిని, ధర్మాన్ని ఆచరించేవాడిని, ఇతరులు ఆచరిస్తూ ఉంటే ఆమోదించేవాడిని. ధర్మాన్ని ఎలా బోధించాలి ఎలా ఆచరించాలి ఎలా ఆమోదించాలి అన్న మూడు విషయాలనూ లోకములకు నేర్పడానికే ఈ అవతారం. నేను అదే పని చేస్తున్నాను. నీవేమీ బాధపడకు. నేను వచ్చింది కేవలం చెప్పడానికే కాదు. ఆచరించి ఆచరింపచేయడానికి. నా విషయములో నీకు దిగులు వద్దు.
శ్రీశుక ఉవాచ
ఇత్యాచరన్తం సద్ధర్మాన్పావనాన్గృహమేధినామ్
తమేవ సర్వగేహేషు సన్తమేకం దదర్శ హ
ఇన్ని ఇళ్ళలో ఒక్కడే ఉండటాన్ని చూచాడు
కృష్ణస్యానన్తవీర్యస్య యోగమాయామహోదయమ్
ముహుర్దృష్ట్వా ఋషిరభూద్విస్మితో జాతకౌతుకః
ఎంత ఆశ్చర్యం, ఒకే సారి ఇన్ని చోట్ల వేరు వేరు రూపాలతో రకరకాల పనులు చేస్తూ ఉన్న కృష్ణ పరమాత్మ చేత పూజించబడి ఆయననే స్మరిస్తూ నారదుడు బయలుదేరాడు
ఇత్యర్థకామధర్మేషు కృష్ణేన శ్రద్ధితాత్మనా
సమ్యక్సభాజితః ప్రీతస్తమేవానుస్మరన్యయౌ
ఏవం మనుష్యపదవీమనువర్తమానో నారాయణోऽఖిలభవాయ గృహీతశక్తిః
రేమేऽణ్గ షోడశసహస్రవరాఙ్గనానాం సవ్రీడసౌహృదనిరీక్షణహాసజుష్టః
సకల లోకముల సృష్టి రక్షణ కోసం శక్తిని స్వీకరించిన స్వామి పదుహారు వేల మంది స్త్రీలతో స్వామి రమించాడు
సిగ్గు స్నేహం మైత్రూ విలాసం నవ్వూ వయ్యారాలు ఇలాంటి వాటితో సేవించబడుతూ తాను రమించాడు. ఇది పెద్ద వింతేమీ కాదు
యానీహ విశ్వవిలయోద్భవవృత్తిహేతుః
కర్మాణ్యనన్యవిషయాణి హరీశ్చకార
యస్త్వఙ్గ గాయతి శృణోత్యనుమోదతే వా
భక్తిర్భవేద్భగవతి హ్యపవర్గమార్గే
సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణమైన పరమాత్మ అనంతమైన ఏ ఏ కర్మలు చేసాడో, ఆ కర్మలను గానం చేసే వారు వినేవారూ ఆమోదించేవారు, మోక్షమునకు మార్గము చూపే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది.
సర్వం శ్రీకృష్ణార్ప్ణమస్తు