Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఐదవ అధ్యాయం

                      ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఐదవ అధ్యాయం

శ్రీరాజోవాచ
అజాతశత్రోస్తమ్దృష్ట్వా రాజసూయమహోదయమ్
సర్వే ముముదిరే బ్రహ్మన్నృదేవా యే సమాగతాః

దుర్యోధనుడు మాత్రం ఎందుకు సంతోషించలేదు.అతను ఎందుకు అసూయపడ్డాడు

దుర్యోధనం వర్జయిత్వా రాజానః సర్షయః సురాః
ఇతి శ్రుతం నో భగవంస్తత్ర కారణముచ్యతామ్

ఋషివర్యా ఈ విషయాన్ని విన్నాము. దానికి కారణం ఏమిటి

శ్రీబాదరాయణిరువాచ
పితామహస్య తే యజ్ఞే రాజసూయే మహాత్మనః
బాన్ధవాః పరిచర్యాయాం తస్యాసన్ప్రేమబన్ధనాః

మీ తాతగారైన ధర్మరాజు రాజసూయ యాగం చేస్తుంటే ఆ యాగం చూడడానికి వచ్చిన బంధువులందరూ ఆ యజ్ఞ్యములో పరిచర్య్లు చేయడానికి సిద్ధపడ్డారు

భీమో మహానసాధ్యక్షో ధనాధ్యక్షః సుయోధనః
సహదేవస్తు పూజాయాం నకులో ద్రవ్యసాధనే

భీముడు వంట శాల అధ్యక్షుడు. ధనశాలకు దుర్యోధనుడు అధ్యక్షుడు. సహదేవుడు పూజించడానికి, నకులుడు ద్రవ్యాలన్నీ కూర్చడానికి

గురుశుశ్రూషణే జిష్ణుః కృష్ణః పాదావనేజనే
పరివేషణే ద్రుపదజా కర్ణో దానే మహామనాః

అర్జనుడు పెద్దలను సేవించడమూ, కృష్ణుడు వచ్చిన బ్రాహ్మణుల పాదాలు కడగడం, దరుపతీ దేవి వచ్చినవారికి భోజనం వడ్డించడం, కర్ణుడు దానానికి

యుయుధానో వికర్ణశ్చ హార్దిక్యో విదురాదయః
బాహ్లీకపుత్రా భూర్యాద్యా యే చ సన్తర్దనాదయః

నిరూపితా మహాయజ్ఞే నానాకర్మసు తే తదా
ప్రవర్తన్తే స్మ రాజేన్ద్ర రాజ్ఞః ప్రియచికీర్షవః

ఆయా పనులలో వీరందరూ నియమించబడ్డారు. మహారాజుకు ప్రీతిని కలిగించడానికి వీరంతా ప్రవర్తిస్తున్నారు

ఋత్విక్సదస్యబహువిత్సు సుహృత్తమేషు
స్విష్టేషు సూనృతసమర్హణదక్షిణాభిః
చైద్యే చ సాత్వతపతేశ్చరణం ప్రవిష్టే
చక్రుస్తతస్త్వవభృథస్నపనం ద్యునద్యామ్

ఇలా అందరు మిత్రులూ ఇష్టులూ కలసి యజ్ఞ్యాన్ని పూర్తి చేసారు, శిశుపాలుడు మరణించాడు, అందరూ కలసి ఆకాశగంగలో అవభృత స్నానం చేసారు

మృదఙ్గశఙ్ఖపణవ ధున్ధుర్యానకగోముఖాః
వాదిత్రాణి విచిత్రాణి నేదురావభృథోత్సవే

అన్ని రకాల మంగళ వాద్యాలతో,, నర్తకీ మణులు నాట్యం చేసారు,గాయకులు గానం చేసారు. ఈ ధ్వనులు స్వర్గాన్ని తాకాయి,

నార్తక్యో ననృతుర్హృష్టా గాయకా యూథశో జగుః
వీణావేణుతలోన్నాదస్తేషాం స దివమస్పృశత్

చిత్రధ్వజపతాకాగ్రైరిభేన్ద్రస్యన్దనార్వభిః
స్వలఙ్కృతైర్భటైర్భూపా నిర్యయూ రుక్మమాలినః

యదుసృఞ్జయకామ్బోజ కురుకేకయకోశలాః
కమ్పయన్తో భువం సైన్యైర్యయమానపురఃసరాః

సదస్యర్త్విగ్ద్విజశ్రేష్ఠా బ్రహ్మఘోషేణ భూయసా
దేవర్షిపితృగన్ధర్వాస్తుష్టువుః పుష్పవర్షిణః

ధ్వజములూ పతాకములతో ఏనుగులూ గుర్రములూ భటులూ చక్కగా అలంకరించుకుని
బంగారు ఆభరణాలు ధరించి అవభృత స్నానానికి అందరూ బయలుదేరారు.యదు సృంజయా కాంబోజ కురూ కైకయ కోసల ఇతర మిత్ర రాజ్యాధిపతులు తమ సైన్యాలతో భూమిని కంపింపచేస్తోంటే సదస్యులూ బ్రాహ్మణులు వేదనాదముతో వారూ ముందుకు వస్తే, దేవర్షి పితృ గంధర్వులు స్తోత్రం చేస్తున్నారు, పుష్పవర్షం కురిపిస్తున్నారు. స్త్రీలు చక్కగా అలంకరించుకుని

స్వలణ్కృతా నరా నార్యో గన్ధస్రగ్భూషణామ్బరైః
విలిమ్పన్త్యోऽభిసిఞ్చన్త్యో విజహ్రుర్వివిధై రసైః

తైలగోరసగన్ధోద హరిద్రాసాన్ద్రకుఙ్కుమైః
పుమ్భిర్లిప్తాః ప్రలిమ్పన్త్యో విజహ్రుర్వారయోషితః

గుప్తా నృభిర్నిరగమన్నుపలబ్ధుమేతద్
దేవ్యో యథా దివి విమానవరైర్నృదేవ్యో
తా మాతులేయసఖిభిః పరిషిచ్యమానాః
సవ్రీడహాసవికసద్వదనా విరేజుః

ఒకరి మీద ఒకరు గంధం పూలూ నీళ్ళూ జల్లుకుంటున్నారు. నూనెనూ ఆవుపాలనూ పెరుగునూ వెన్ననూ గంధ జలాన్నీ కుంకుమ జలాన్ని జల్లుకుని వార స్త్రీలు ఇవన్నీ జల్లుతూ ఉంటే.
ఆకాశములో దేవతా స్త్రీలు విమానాలలో బయలుదేరినట్లుగా భూలోకములో వీరంతా దివ్యరథాలల్తో బయలుదేరారు. మేనమామ పిల్లలతో స్నేహితులతో చల్లబడుతూ కాస్త నవ్వూ కాస్త సిగ్గూ., ఇలాంటి విహారలతో వారు శోభిస్తూ ఉన్నారు.స్త్రీలు కూడా మరుదులనూ బావలనూ మేనత్త మేనమామ పిల్లలను గంధములూ వసంతాలనూ చల్లుకుంటూ ఉండగా

తా దేవరానుత సఖీన్సిషిచుర్దృతీభిః
క్లిన్నామ్బరా వివృతగాత్రకుచోరుమధ్యాః
ఔత్సుక్యముక్తకవరాచ్చ్యవమానమాల్యాః
క్షోభం దధుర్మలధియాం రుచిరైర్విహారైః

స సమ్రాడ్రథమారుఢః సదశ్వం రుక్మమాలినమ్
వ్యరోచత స్వపత్నీభిః క్రియాభిః క్రతురాడివ

వారు ఆడుకుంటూ ఉండగా కొప్పులోని పూలు రాలి కిందబడుతూ ఉన్నాయి. కాస్తంత మురికి ఉన్న బుద్ధి గలవారి మనసుకు వారు శోభను కలిగించారు. ఇలా మహారాజు రథాన్ని ఎక్కి ఆయా క్రియలతో యజ్ఞ్యములాగ తన భార్యలతో మహారాజు శోభించాడు. ద్రౌపతితో ధర్మరాజుని ఋత్వికులు  అందరూ స్నానం చేసారు. దేవ, నర దుంధుభులు మోగాయి.దేవతలు పుష్ప వర్షాన్ని కురిపించారు. దేవ ఋషి పితృ మానవులందరూ వారి వారి వర్ణములూ ఆశ్రములకూ తగిన రీతిలో స్నానం చేసారు

పత్నీసమ్యాజావభృథ్యైశ్చరిత్వా తే తమృత్విజః
ఆచాన్తం స్నాపయాం చక్రుర్గఙ్గాయాం సహ కృష్ణయా

దేవదున్దుభయో నేదుర్నరదున్దుభిభిః సమమ్
ముముచుః పుష్పవర్షాణి దేవర్షిపితృమానవాః

సస్నుస్తత్ర తతః సర్వే వర్ణాశ్రమయుతా నరాః
మహాపాతక్యపి యతః సద్యో ముచ్యేత కిల్బిషాత్

అవభృత స్నానం చేస్తే ఎంత గొప్ప పాపం చేసినవాడైనా ఆ పాపం నుండి ముక్తిన్ పొందుతాడు. అందుకే పిలువకున్నా యజ్ఞ్యానికి వెళ్ళాలి.

అథ రాజాహతే క్షౌమే పరిధాయ స్వలఙ్కృతః
ఋత్విక్సదస్యవిప్రాదీనానర్చాభరణామ్బరైః

బన్ధూఞ్జ్ఞాతీన్నృపాన్మిత్ర సుహృదోऽన్యాంశ్చ సర్వశః
అభీక్ష్నం పూజయామాస నారాయణపరో నృపః

సర్వే జనాః సురరుచో మణికుణ్డలస్రగ్
ఉష్ణీషకఞ్చుకదుకూలమహార్ఘ్యహారాః
నార్యశ్చ కుణ్డలయుగాలకవృన్దజుష్ట
వక్త్రశ్రియః కనకమేఖలయా విరేజుః

బంధువులూ జ్ఞ్యాతులూ మిత్రులూ సుహృత్తులూ వచ్చినవారందరినీ తన మీద గౌరవాన్నుంచి పాలుగొన్న వారందరినీ సేవలు చేసిన వారందరినీ ధర్మరాజు పరమాత్మ బుద్ధితో పూజించాడు.
వచ్చినవారందరూ దేవతల కాంతిని పొందారు. మణి కుండలములూ మాలలూ తలపాగాలూ కుండలములూ కంచుకములూ గొప్ప విలువైన హారములూ ధరించారు. బంగారు వడ్డాణాలతో ఇతర ఆభరణాలతో స్త్రీలు కూడా శోభించారు.

అథర్త్విజో మహాశీలాః సదస్యా బ్రహ్మవాదినః
బ్రహ్మక్షత్రియవిట్శుద్రా రాజానో యే సమాగతాః

దేవర్షిపితృభూతాని లోకపాలాః సహానుగాః
పూజితాస్తమనుజ్ఞాప్య స్వధామాని యయుర్నృప

హరిదాసస్య రాజర్షే రాజసూయమహోదయమ్
నైవాతృప్యన్ప్రశంసన్తః పిబన్మర్త్యోऽమృతం యథా

నాలుగు వర్ణాల వారిని ఋత్విక్కులనూ బ్రాహ్మణులనూ దేవర్షి పితృ భూతములనూ లోకపాలురనూ పూజించగా వారు వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు.
హరి దాసైన ధర్మరాజు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎంత పొగడినా వారికి తృప్తి కలుగలేదు. అమృతం తాగుతున్నవారికి తృప్తి కలుగనట్లు

తతో యుధిష్ఠిరో రాజా సుహృత్సమ్బన్ధిబాన్ధవాన్
ప్రేమ్ణా నివారయామాస కృష్ణం చ త్యాగకాతరః

వారందరూ వెళ్ళబోతూ ఉంటే ధర్మరాజు వారందరినీ ప్రేమతో ఆపాడు.అందులో కృష్ణుడూ ఉన్నాడు.

భగవానపి తత్రాఙ్గ న్యావాత్సీత్తత్ప్రియంకరః
ప్రస్థాప్య యదువీరాంశ్చ సామ్బాదీంశ్చ కుశస్థలీమ్

ధర్మరాజునకు ప్రీతి కలిగించడానికి కృష్ణుడు కూడా సాంబాది పుత్రులను కుశస్థలికి పంపి తాను అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు.

ఇత్థం రాజా ధర్మసుతో మనోరథమహార్ణవమ్
సుదుస్తరం సముత్తీర్య కృష్ణేనాసీద్గతజ్వరః

రాజసూయాన్ని జరిపించాలన్న కోరీకను కృష్ణ పరమాత్మ అనుగ్రహముతో దాటాడు

ఏకదాన్తఃపురే తస్య వీక్ష్య దుర్యోధనః శ్రియమ్
అతప్యద్రాజసూయస్య మహిత్వం చాచ్యుతాత్మనః

అలా ఉంటూ ఉండగా దుర్యోధనుడు ధర్మరాజు యొక్క రాజ్య సంపదను చూచి తనలో తాను పరితపించాడు.

యస్మింస్నరేన్ద్రదితిజేన్ద్రసురేన్ద్రలక్ష్మీర్
నానా విభాన్తి కిల విశ్వసృజోపక్లృప్తాః
తాభిః పతీన్ద్రుపదరాజసుతోపతస్థే
యస్యాం విషక్తహృదయః కురురాడతప్యత్

ఈ రాజసూయములో ప్రజాపతులందరూ వచ్చి అన్ని సంపదలనూ కూర్చారు. మానవుల దైత్యుల దేవ ఆధిపతుల సంపదలన్నీ అక్కడ వచ్చి చేరాయి.
ఇంతటి గొప్ప సంపదలతో  వైభవాలతో కూడిన ద్రౌపతి తన భర్తలతో అమిత వైభవాన్ని పొంది ఉన్నది. అలాంటి ద్రౌపతి యందు ఆసక్తి కల మనసు కలవాడైన దుర్యోధనుడు తపించాడు. అతను ద్రౌపతి యందు ఆసక్త హృదయుడు. రాజసూయములో అందరూ తెచ్చి ఇచ్చిన సంపదలతో శోభిస్తోన్న ద్రౌపతి యందు మనసు గల దుర్యోధనుడు తపించాడు

యస్మిన్తదా మధుపతేర్మహిషీసహస్రం
శ్రోణీభరేణ శనకైః క్వణదఙ్ఘ్రిశోభమ్
మధ్యే సుచారు కుచకుఙ్కుమశోణహారం
శ్రీమన్ముఖం ప్రచలకుణ్డలకున్తలాఢ్యమ్

ఇలా ఆ సభలో వేల మంది అంతఃపుర స్త్రీలూ మహారాణులు తమ అందెల ధ్వని చేస్తూ సభా మండపానికి వచ్చారు.

సభాయాం మయక్లృప్తాయాం క్వాపి ధర్మసుతోऽధిరాట్
వృతోऽనుగైర్బన్ధుభిశ్చ కృష్ణేనాపి స్వచక్షుషా

మయుని సభ యందు ధర్మరాజు తన తమ్ములూ బంధువులూ కృష్ణుడితో కలసి స్వర్ణ సింహాసనం మీద అపర ఇంద్రునిలా కూర్చున్నాడు

ఆసీనః కాఞ్చనే సాక్షాదాసనే మఘవానివ
పారమేష్ఠ్యశ్రీయా జుష్టః స్తూయమానశ్చ వన్దిభిః

చక్రవర్తి అధిపత్యం కలవాడై వందులు స్తోత్రం చేస్తూ ఉంటే

తత్ర దుర్యోధనో మానీ పరీతో భ్రాతృభిర్నృప
కిరీటమాలీ న్యవిశదసిహస్తః క్షిపన్రుషా

తన సోదరులతో కలసి దుర్యోధనుడు కిరీటం పెట్టుకుని ఖడ్గం పట్టుకుని కోపముతో వస్తున్నాడు

స్థలేऽభ్యగృహ్ణాద్వస్త్రాన్తం జలం మత్వా స్థలేऽపతత్
జలే చ స్థలవద్భ్రాన్త్యా మయమాయావిమోహితః

ఆ కోపములో అసూయలో మామూలు నేలను చూచి వస్త్రాన్ని పైకి లాక్కున్నాడు, నీటిని నేల అనుకుని, మయ మాయా విమోహముతో (అసూయా ద్వేషమూ అసహనమూ ఈర్ష్య గలిగినవారికి ఆ సభ విపరీతముగా కనపడుతుంది)

జహాస భీమస్తం దృష్ట్వా స్త్రియో నృపతయో పరే
నివార్యమాణా అప్యఙ్గ రాజ్ఞా కృష్ణానుమోదితాః

పడిపోతున్న దుర్యోధనున్ని చూచి భీముడూ ఇతర స్త్రీలూ ఇతర రాజులూ నవ్వారు. ధర్మరాజు వద్దు వద్దని వారిస్తున్నా కృష్ణ పరమాత్మ ఆమోదించడముతో నవ్వారు.

స వ్రీడితోऽవగ్వదనో రుషా జ్వలన్నిష్క్రమ్య తూష్ణీం ప్రయయౌ గజాహ్వయమ్
హాహేతి శబ్దః సుమహానభూత్సతామజాతశత్రుర్విమనా ఇవాభవత్
బభూవ తూష్ణీం భగవాన్భువో భరం సముజ్జిహీర్షుర్భ్రమతి స్మ యద్దృశా

సిగ్గుపడ్డాడు తలవంచుకున్నాడు, కోపముతో మండిపోతూ ఏమీ మాట్లాడకుండా హస్తినాపురానికి వెళ్ళాడు. లోకమంతా హా హాకారాలు చేసారు. ధర్మరాజు మనసుని చిన్నబుచ్చుకున్నాడు.పరమాత్మ మాత్రం మౌనం వహించాడు. భూభారాన్ని తొలగించదలచి ఇదంతా జరిపించాడు

ఏతత్తేऽభిహితం రాజన్యత్పృష్టోऽహమిహ త్వయా
సుయోధనస్య దౌరాత్మ్యం రాజసూయే మహాక్రతౌ

రాజసూయం గురించి అడిగావు కదా, రాజసూయ మహా యజ్ఞ్యములో దుర్యోధనుని యొక్క దుష్టభావాన్ని వివరించాను.

                                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts