Followers

Sunday 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఒకటవ అధ్యాయం

            ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఒకటవ అధ్యాయం

లోక గురువైన పరమాత్మ తాను కూడా గృహస్థువలే అన్ని ధర్మాలూ ఆచరించాడు

శ్రీశుక ఉవాచ
ఏకైకశస్తాః కృష్ణస్య పుత్రాన్దశదశాబఆః
అజీజనన్ననవమాన్పితుః సర్వాత్మసమ్పదా

ఒక్కొక్క భార్యకూ స్వామి వలన పదిమంది కుమారులు, పితృ తుల్య పరాక్రమం గలవారు, అన్ని రకములైన సంపదలతో (ఆత్మ బుద్ధీ మనో సంపదలు గల) పుట్టారు.

గృహాదనపగం వీక్ష్య రాజపుత్ర్యోऽచ్యుతం స్థితమ్
ప్రేష్ఠం న్యమంసత స్వం స్వం న తత్తత్త్వవిదః స్త్రియః

స్వామి ప్రతీ ఇంటిలోనూ ఆ ఇంటినుంచి కదలక ఇంటిని నుండి బయటకు వెళ్ళని భర్తను చూచి ఈయనకు నేనటే చాలా ఇష్టం అనుకున్నారు. పరమాత్మ తత్వం తెలియని వారు ఆయనకు మేమంటే ఇష్టం అని అనుకున్నారు

చార్వబ్జకోశవదనాయతబాహునేత్ర
సప్రేమహాసరసవీక్షితవల్గుజల్పైః
సమ్మోహితా భగవతో న మనో విజేతుం
స్వైర్విభ్రమైః సమశకన్వనితా విభూమ్నః

కేవలం వారు అలా భావించడానికి స్వామి అలా ప్రవర్తించాడు తప్ప, అంత మంది స్త్రీలలో ఏ ఒక్క స్త్రీ కూడా స్వామి యొక్క మనసు గెలవలేకపోయింది.
చక్కని ముఖమూ, విశాలమైన బాహువులూ నేత్రాలూ ప్రేమతో కూడిన  నవ్వులూ సరసపు మాటలతో ఎన్ని రకాలుగా స్త్రీలు తమ విలాసములతో వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో అలా ప్రయత్నించి కూడా తమ విలాసాలల్తో వయ్యారాలతో సంభ్రమాలతో సర్వ వ్యాపి ఐన పరమాత్మను గెలవలేకపోయారు.

స్మాయావలోకలవదర్శితభావహారి
భ్రూమణ్డలప్రహితసౌరతమన్త్రశౌణ్డైః
పత్న్యస్తు శోడశసహస్రమనఙ్గబాణైర్
యస్యేన్ద్రియం విమథితుమ్కరణైర్న శేకుః

చిరునవ్వూ ఆశ్చర్యం ప్రేమ విలాసాది భావాలు, కనుబొమ్మల యొక్క కదలికలూ ఇలాంటి ప్రేమను బాగా సూచించే రకరకాలైన విభ్రమాలతో మన్మధ బాణములతో అన్ని రకాల ప్రయంతాలతో కూడా పరమాత్మ మనసును గెలవలేకపోయారు

ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రియస్తా
బ్రహ్మాదయోऽపి న విదుః పదవీం యదీయామ్
భేజుర్ముదావిరతమేధితయానురాగ
హాసావలోకనవసఙ్గమలాలసాద్యమ్

సాక్షాత్ శ్రీమన్నారాయణున్ని భర్తగా పొందిన ఆ స్త్రీలు బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా ఏ స్థానమును తెలుసుకోలేకపోయారో, పరమాత్మ సంగమాన్ని పొంది అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు

ప్రత్యుద్గమాసనవరార్హణపాదశౌచ
తామ్బూలవిశ్రమణవీజనగన్ధమాల్యైః
కేశప్రసారశయనస్నపనోపహార్యైః
దాసీశతా అపి విభోర్విదధుః స్మ దాస్యమ్

ఎదురు వెళ్ళుటా సింహాసనమూ పూజా పాద ప్రక్షాళనమూ తాంబూలమూ విశ్రాంతీ వింజామరములూ గంధములూ మాల్యములూ
ఒక్కొక్కరికీ నూరుమంది దాఈలున్నా తామే స్వామికి అన్ని రకముల సేవలూ చేసారు, ఆయన మనసు గెలుచుకుందామని

తాసాం యా దశపుత్రాణాం కృష్ణస్త్రీణాం పురోదితాః
అష్టౌ మహిష్యస్తత్పుత్రాన్ప్రద్యుమ్నాదీన్గృణామి తే

ఒక్కొక్కరి పేర్లు చెబుతాను విను.

చారుదేష్ణః సుదేష్ణశ్చ చారుదేహశ్చ వీర్యవాన్
సుచారుశ్చారుగుప్తశ్చ భద్రచారుస్తథాపరః

చారుచన్ద్రో విచారుశ్చ చారుశ్చ దశమో హరేః
ప్రద్యుమ్నప్రముఖా జాతా రుక్మిణ్యాం నావమాః పితుః

వీరంతా రుక్మిణీ పుత్రులు

భానుః సుభానుః స్వర్భానుః ప్రభానుర్భానుమాంస్తథా
చన్ద్రభానుర్బృహద్భానురతిభానుస్తథాష్టమః

వీరు సత్యభామ పుత్రులు

శ్రీభానుః ప్రతిభానుశ్చ సత్యభామాత్మజా దశ
సామ్బః సుమిత్రః పురుజిచ్ఛతజిచ్చ సహస్రజిత్

వియయశ్చిత్రకేతుశ్చ వసుమాన్ద్రవిడః క్రతుః
జామ్బవత్యాః సుతా హ్యేతే సామ్బాద్యాః పితృసమ్మతాః

వీరు జాంబవతీ పుత్రులు

వీరశ్చన్ద్రోऽశ్వసేనశ్చ చిత్రగుర్వేగవాన్వృషః
ఆమః శఙ్కుర్వసుః శ్రీమాన్కున్తిర్నాగ్నజితేః సుతాః

నాగ్నజితి పుత్రులు వీరంతా

శ్రుతః కవిర్వృషో వీరః సుబాహుర్భద్ర ఏకలః
శాన్తిర్దర్శః పూర్ణమాసః కాలిన్ద్యాః సోమకోऽవరః

కాలిది పుత్రులు వీరు

ప్రఘోషో గాత్రవాన్సింహో బలః ప్రబల ఊర్ధగః
మాద్ర్యాః పుత్రా మహాశక్తిః సహ ఓజోऽపరాజితః

మాద్రి యొక్క పుత్రులు వీరు

వృకో హర్షోऽనిలో గృధ్రో వర్ధనోన్నాద ఏవ చ
మహాంసః పావనో వహ్నిర్మిత్రవిన్దాత్మజాః క్షుధిః

మిత్ర వింద యొక్క కుమారులు వీరు

సఙ్గ్రామజిద్బృహత్సేనః శూరః ప్రహరణోऽరిజిత్
జయః సుభద్రో భద్రాయా వామ ఆయుశ్చ సత్యకః

భద్ర యొక్క కుమారులు

దీప్తిమాంస్తామ్రతప్తాద్యా రోహిణ్యాస్తనయా హరేః
ప్రద్యమ్నాచ్చానిరుద్ధోऽభూద్రుక్మవత్యాం మహాబలః
పుత్ర్యాం తు రుక్మిణో రాజన్నామ్నా భోజకటే పురే

ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు కుమారుడు. ప్రద్యుమ్నుడికి రుక్మవతి (రుక్మి యొక్క పుత్రిక వలన) వలన కన్నాడు

ఏతేషాం పుత్రపౌత్రాశ్చ బభూవుః కోటిశో నృప
మాతరః కృష్ణజాతీనాం సహస్రాణి చ షోడశ

ఇలా మొత్తం సంతానం కొన్ని కోట్లమంది అయ్యారు.

శ్రీరాజోవాచ
కథం రుక్మ్యరీపుత్రాయ ప్రాదాద్దుహితరం యుధి
కృష్ణేన పరిభూతస్తం హన్తుం రన్ధ్రం ప్రతీక్షతే
ఏతదాఖ్యాహి మే విద్వన్ద్విషోర్వైవాహికం మిథః

రుక్మి పుత్రిక యందు కలిగారు అంటున్నారు. రుక్మిణినే ఇవ్వడానికి ఒప్పుకోని వాడు కృష్ణుడి కొడుక్కి తన కూతురిని ఎలా ఇచ్చాడు, వివరించవలసింది

అనాగతమతీతం చ వర్తమానమతీన్ద్రియమ్
విప్రకృష్టం వ్యవహితం సమ్యక్పశ్యన్తి యోగినః

మీలాంటి యోగులకు జరగవలసినది జరిగినది, జర్గుతున్నదీ, దూరముగా ఉన్నదీ దగ్గరగా ఉన్నదీ అన్నీ తెలుసు మీకు

శ్రీశుక ఉవాచ
వృతః స్వయంవరే సాక్షాదనణ్గోऽణ్గయుతస్తయా
రాజ్ఞః సమేతాన్నిర్జిత్య జహారైకరథో యుధి

స్వయం వరానికి ప్రద్యుమ్నుడు వెళ్ళగా ఆమె ఈయనను వరించింది. తక్కిన రాజులు ఎదిరిస్తే వారిని ఓడించాడు

యద్యప్యనుస్మరన్వైరం రుక్మీ కృష్ణావమానితః
వ్యతరద్భాగినేయాయ సుతాం కుర్వన్స్వసుః ప్రియమ్

నా శత్రువు కృష్ణుడే గానీ నా చెల్లి కాదు కదా అని రుకంకి ఆలోచించి ఆమోదించాడు.

రుక్మిణ్యాస్తనయాం రాజన్కృతవర్మసుతో బలీ
ఉపయేమే విశాలాక్షీం కన్యాం చారుమతీం కిల

రుక్మిణి యొక్క అమ్మాయి ఐన చారుమతిని కృతవర్మ కుమారుడికిచ్చి వివాహం చేసారు.

దౌహిత్రాయానిరుద్ధాయ పౌత్రీం రుక్మ్యాదదాద్ధరేః
రోచనాం బద్ధవైరోऽపి స్వసుః ప్రియచికీర్షయా
జానన్నధర్మం తద్యౌనం స్నేహపాశానుబన్ధనః

అతని కొడుకు అనిరుద్ధుడు. అనిరుద్ధున్ని ఆమె బిడ్డకు ఇచ్చాడు చెల్లెలకు ప్రీతి కలిగించాలని. ఇలాంటి సంబంధం (మేనరికం) శాస్త్ర బద్ధం కాదు. అంగ వైకల్యం గానీ బుద్ధి వైకల్యం గానీ వస్తుంది అని శాస్త్రం. (ఇది చరక సంహితలో కూడా ఉంది). ఐనా స్నేహ పాశానికి లొంగి వివాహం చేసుకున్నారు.

తస్మిన్నభ్యుదయే రాజన్రుక్మిణీ రామకేశవౌ
పురం భోజకటం జగ్ముః సామ్బప్రద్యుమ్నకాదయః

అనిరుద్ధుని వివాహానికి అందరూ వెళ్ళారు.కృష్ణుడి కుమారులందరూ కలసి వెళ్ళారు

తస్మిన్నివృత్త ఉద్వాహే కాలిఙ్గప్రముఖా నృపాః
దృప్తాస్తే రుక్మిణం ప్రోచుర్బలమక్షైర్వినిర్జయ

వివాహం జరిగిన తరువాత రుక్మికి అత్యంత ప్రీతి పాత్రుడు కాలింగుడు జ్యూదం ఆడమని ప్రోత్సహించాడు.

అనక్షజ్ఞో హ్యయం రాజన్నపి తద్వ్యసనం మహత్
ఇత్యుక్తో బలమాహూయ తేనాక్షైర్రుక్మ్యదీవ్యత

ఇద్దారూ కూర్చుని ఆడడం మొదలుపెట్టారు. మొదటి మూడు పందాలూ రుక్మి గెలిచాడు. బలరాముడు లక్ష పందెముగా పెట్టి బలరాముడే గెలిచినా , లేదు  నేనే గెలిచానన్నాడు రుక్మి.

శతం సహస్రమయుతం రామస్తత్రాదదే పణమ్
తం తు రుక్మ్యజయత్తత్ర కాలిఙ్గః ప్రాహసద్బలమ్
దన్తాన్సన్దర్శయన్నుచ్చైర్నామృష్యత్తద్ధలాయుధః

తతో లక్షం రుక్మ్యగృహ్ణాద్గ్లహం తత్రాజయద్బలః
జితవానహమిత్యాహ రుక్మీ కైతవమాశ్రితః

మన్యునా క్షుభితః శ్రీమాన్సముద్ర ఇవ పర్వణి
జాత్యారుణాక్షోऽతిరుషా న్యర్బుదం గ్లహమాదదే

సరే నన్నాడు బలరాముడు. మళ్ళీ ఆడదామని ఆడి, బలరాముడు గెలిచాడు. ఐనా నేనే గెలిచాను అన్నాడు రుక్మి. అపుడు బలరాముడు ఆకాశవాణినే అడుగుదాం అని అన్నాడు.

తం చాపి జితవాన్రామో ధర్మేణ ఛలమాశ్రితః
రుక్మీ జితం మయాత్రేమే వదన్తు ప్రాశ్నికా ఇతి

తదాబ్రవీన్నభోవాణీ బలేనైవ జితో గ్లహః
ధర్మతో వచనేనైవ రుక్మీ వదతి వై మృషా

అది కూడా ఒప్పుకోలేదు. దైవ వాక్కుని కూడా ఒప్పుకోకుండా.

తామనాదృత్య వైదర్భో దుష్టరాజన్యచోదితః
సఙ్కర్షణం పరిహసన్బభాషే కాలచోదితః

మీరు యాదవులూ గొల్లవాళ్ళూ, పశువులను కాచేవారు, మీకు రాజ్యార్హత లేదు. మావంటి వారితో జ్యూదం మీరేమాడతారు. పశువులతో ఆడతారు.

నైవాక్షకోవిదా యూయం గోపాలా వనగోచరాః
అక్షైర్దీవ్యన్తి రాజానో బాణైశ్చ న భవాదృశాః

రుక్మిణైవమధిక్షిప్తో రాజభిశ్చోపహాసితః
క్రుద్ధః పరిఘముద్యమ్య జఘ్నే తం నృమ్ణసంసది

అది విని కోపం వచ్చి అందరి రాజుల మధ్యా రుక్మిని సంహరించాడు బలరాముడు

కలిఙ్గరాజం తరసా గృహీత్వా దశమే పదే
దన్తానపాతయత్క్రుద్ధో యోऽహసద్వివృతైర్ద్విజైః

బలరాముడు ఓడితే నవ్వినందుకు కలింగరాజు పళ్ళన్నీ ఊడగొట్టాడు. అడ్డం వచ్చిన వారి కాళ్ళూ చేతులూ విరగొట్టి, కొందరిని వధించాడు.మిగిలినవారు పారిపోయారు

అన్యే నిర్భిన్నబాహూరు శిరసో రుధిరోక్షితాః
రాజానో దుద్రవర్భీతా బలేన పఙ్ఘార్దితాః

నిహతే రుక్మిణి శ్యాలే నాబ్రవీత్సాధ్వసాధు వా
రక్మిణీబలయో రాజన్స్నేహభఙ్గభయాద్ధరిః

కృష్ణుడు నోరు మెదపలేదు. ఏమైనా మాట్లాడితే బలరామునికి కోపం. మాట్లాడకపోతే రుక్మిణికి కోపం.
ఇరువురూ కావలసిన వారే కదా అని మౌనం పాటించాడు

తతోऽనిరుద్ధం సహ సూర్యయా వరం రథం సమారోప్య యయుః కుశస్థలీమ్
రామాదయో భోజకటాద్దశార్హాః సిద్ధాఖిలార్థా మధుసూదనాశ్రయాః

అమ్మాయినీ అబ్బాయినీ తీసుకుని ద్వారకా నగరానికి వచ్చారు. అనుకున్నవన్ని పూర్తయ్యాయి. స్వామిని ఆశ్రయించుట వలన ఏ కొరతా లేకుండా అన్ని పనులూ అనుకున్నవి అనుకున్నట్లు పూర్తయ్యాయి
                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts