Followers

Sunday 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఐదవ అధ్యాయం

                       
                ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఐదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
బలభద్రః కురుశ్రేష్ఠ భగవాన్రథమాస్థితః
సుహృద్దిదృక్షురుత్కణ్ఠః ప్రయయౌ నన్దగోకులమ్

బలరాముడు, చాలా కాలం అవ్వడముతో తన మిత్రులను తీసుకుని వ్రేపల్లెకు వెళ్ళాడు.

పరిష్వక్తశ్చిరోత్కణ్ఠైర్గోపైర్గోపీభిరేవ చ
రామోऽభివాద్య పితరావాశీర్భిరభినన్దితః

గోపికలూ గోపాలురూ యశోదా నందులు గాఢముగా కౌగిలించుకున్నారు. బలరాముడు నందునికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు

చిరం నః పాహి దాశార్హ సానుజో జగదీశ్వరః
ఇత్యారోప్యాఙ్కమాలిఙ్గ్య నేత్రైః సిషిచతుర్జలైః

నందుడు బలరాముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని "మా మీద ఇంత కాలానికి నీకు దయ కలిగిందా" అని

గోపవృద్ధాంశ్చ విధివద్యవిష్ఠైరభివన్దితః
యథావయో యథాసఖ్యం యథాసమ్బన్ధమాత్మనః

పెద్దలకు తాను నమస్కారం చేసాడు. చిన్నవారు తనకు నమస్కారం చేసారు
వయసుకూ స్నేహానికీ సంబంధానికీ అనుగుణముగా వ్యవహరించాడు

సముపేత్యాథ గోపాలాన్హాస్యహస్తగ్రహాదిభిః
విశ్రాన్తమ్సుఖమాసీనం పప్రచ్ఛుః పర్యుపాగతాః

కొందరితో పరిహాసపు మాటలు కొందరితో కౌగిలింతలు కొందరితో చేతులు కలిపి, సంబంధాన్నీ వయసునూ యోగ్యతను బట్టి అందరినీ మన్నించాడు

పృష్టాశ్చానామయం స్వేషు ప్రేమగద్గదయా గిరా
కృష్ణే కమలపత్రాక్షే సన్న్యస్తాఖిలరాధసః

భోజనం చేసినతరువాత అందరూ కలసి అడుగుతున్నారు. కృష్ణ పరమాత్మ యందే అన్ని పూజలూ అన్ని ప్రాణాలూ బలాలూ సంపదలూ ఉంచినవారు

కచ్చిన్నో బాన్ధవా రామ సర్వే కుశలమాసతే
కచ్చిత్స్మరథ నో రామ యూయం దారసుతాన్వితాః

రామా, మన బంధువులంతా క్షేమముగా ఉన్నారా. భార్యలూ పిల్లలూ మనవలూ అందరూ వచ్చారు కదా, మమ్మల్ని తలచుకుంటున్నారా

దిష్ట్యా కంసో హతః పాపో దిష్ట్యా ముక్తాః సుహృజ్జనాః
నిహత్య నిర్జిత్య రిపూన్దిష్ట్యా దుర్గం సమాశ్రీతాః

కంసుడు ఓడించబడ్డాడు, దుష్టులంతా పదవులనుంచి తప్పించబడ్డారు. కొందరిని చంపారు కొందరిని ఓడించారు కొందరినుంచి దూరముగా తరిమేసి ఉత్తమ దుర్గాన్ని ఆశ్రయించి ప్రజలను కాపాడుతున్నారు

గోప్యో హసన్త్యః పప్రచ్ఛూ రామసన్దర్శనాదృతాః
కచ్చిదాస్తే సుఖం కృష్ణః పురస్త్రీజనవల్లభః

అటువంటి కృష్ణుడు బాగున్నాడా. పురస్త్రీ జన వల్లభుడు బాగున్నాడా

కచ్చిత్స్మరతి వా బన్ధూన్పితరం మాతరం చ సః
అప్యసౌ మాతరం ద్రష్టుం సకృదప్యాగమిష్యతి
అపి వా స్మరతేऽస్మాకమనుసేవాం మహాభుజ

అమ్మా నాన్నా ఎలా ఉన్నారఓ అని ఎపుడైనా తలచుకుంటున్నాడా. ఒక్కసారైనా కృష్ణుడు వస్తాడా. మేము చేసిన సేవను ఎపుడైనా గుర్తుకు తెచ్చుకుంటాడా

మాతరం పితరం భ్రాతౄన్పతీన్పుత్రాన్స్వసౄనపి
యదర్థే జహిమ దాశార్హ దుస్త్యజాన్స్వజనాన్ప్రభో

తల్లీ తండ్రీ బంధువులూ మిత్రులూ ఇల్లూ వాకిలీ పశువులూ ఆస్తులూ, ఏవి వదలిపెట్టలేమో అలాంటివన్నీ అతని కోసం మేము విడిచిపెడితే మమ్మల్ని విడిచి అతను వెళ్ళిపోయాడు.

తా నః సద్యః పరిత్యజ్య గతః సఞ్ఛిన్నసౌహృదః
కథం ను తాదృశం స్త్రీభిర్న శ్రద్ధీయేత భాషితమ్

అలాంటి వాడి మాటలు ప్రపంచములో ఎవరైనా నమ్మకుండా ఉంటారా. మమ్మల్ని నమ్మబలికి దూరముగా వెళ్ళిపోయాడు. ఇకనైనా స్వామిని నమ్మవచ్చా

కథం ను గృహ్ణన్త్యనవస్థితాత్మనో
వచః కృతఘ్నస్య బుధాః పురస్త్రియః
గృహ్ణన్తి వై చిత్రకథస్య సున్దర
స్మితావలోకోచ్ఛ్వసితస్మరాతురాః

మేమంటే పల్లెటూరి వారము, గిరిజనులము, అరణ్యములో ఉండేవారం. కాబట్టి అమాయకులమై ఆయన మాటలు నమ్మము గానీ పురస్త్రీలు ఆయన మాటలను ఎలా నమ్ముతున్నారు.
వాళ్ళు ఎలా అతని వలలో పడుతున్నారు

కిం నస్తత్కథయా గోప్యః కథాః కథయతాపరాః
యాత్యస్మాభిర్వినా కాలో యది తస్య తథైవ నః

మనకెందుకు ఆయన ముచ్చట్లు. వేరే విషయాలు ఉంటే చెప్పు, మనం లేకుండా ఆయన పొద్దు పోతుంది కదా. ఆయన లేకుండా మన పొద్దు పోదా. అతనికి మా అవసరం లేనట్లుగా మాకూ అతని అవసరం లేదు.

ఇతి ప్రహసితం శౌరేర్జల్పితం చారువీక్షితమ్
గతిం ప్రేమపరిష్వఙ్గం స్మరన్త్యో రురుదుః స్త్రియః

అతని నవ్వూ మాటా చూపూ నడక, అతని ప్రేమా ఇవన్ని తలచుకుంటూ ఏడిచారు స్త్రీలందరూ

సఙ్కర్షణస్తాః కృష్ణస్య సన్దేశైర్హృదయంగమైః
సాన్త్వయామాస భగవాన్నానానునయకోవిదః

అపుడు బలరాముడు, నేను అందుకే వచ్చాను. కృష్ణ పరమాత్మ సందేశం తీసుకునే వచ్చాను. అలా కృష్ణుని సందేశాన్ని చెప్పినట్లుగా చెప్పి వారి శోకాన్ని పోగొట్టాడు.

ద్వౌ మాసౌ తత్ర చావాత్సీన్మధుం మాధవం ఏవ చ
రామః క్షపాసు భగవాన్గోపీనాం రతిమావహన్

అలా రెండు మాసాలు ఉన్నాడు. గోపికలకు ప్రీతి కలిగిస్తూ రెండు నెలలు అక్కడే ఉన్నాడు

పూర్ణచన్ద్రకలామృష్టే కౌముదీగన్ధవాయునా
యమునోపవనే రేమే సేవితే స్త్రీగణైర్వృతః

నిండు పున్నమిలో యమునా తీరములో హాయిగా ఆనందించాడు

వరుణప్రేషితా దేవీ వారుణీ వృక్షకోటరాత్
పతన్తీ తద్వనం సర్వం స్వగన్ధేనాధ్యవాసయత్

బలరామునికి వారుణి అంటే ప్రీతి. అందుకు వరుణుడు అతని కన్య ఐన వారుణిని పంపించాడు.వృక్ష సారమైన ఆ వారుణిని తన వారందరూ కాల్సి వారుణీ పానం చేసాడు,

తం గన్ధం మధుధారాయా వాయునోపహృతం బలః
ఆఘ్రాయోపగతస్తత్ర లలనాభిః సమం పపౌ

ఇలా వారుణీ  పానముతో వనమంతా తిరిగాడు. మత్తెక్కిన కళ్ళతో సంచరించాడు.బలరామునికి ఒకే కడియం ఒకే కుండలం ఉంటుంది.

ఉపగీయమానో గన్ధర్వైర్వనితాశోభిమణ్డలే
రేమే కరేణుయూథేశో మాహేన్ద్ర ఇవ వారణః

నేదుర్దున్దుభయో వ్యోమ్ని వవృషుః కుసుమైర్ముదా
గన్ధర్వా మునయో రామం తద్వీర్యైరీడిరే తదా

ఉపగీయమానచరితో వనితాభిర్హలాయుధ
వనేషు వ్యచరత్క్షీవో మదవిహ్వలలోచనః

స్రగ్వ్యేకకుణ్డలో మత్తో వైజయన్త్యా చ మాలయా
బిభ్రత్స్మితముఖామ్భోజం స్వేదప్రాలేయభూషితమ్

స ఆజుహావ యమునాం జలక్రీడార్థమీశ్వరః
నిజం వాక్యమనాదృత్య మత్త ఇత్యాపగాం బలః
అనాగతాం హలాగ్రేణ కుపితో విచకర్ష హ

ఇలా వెళ్ళి మద్యపానం చేసి ఆ మత్తులో అందరితో కలసి విహరిస్తూ నదిని చూచి స్నానం చేయాలి రమ్మని పిలిచాడు.ఆ నది రాలేదు. అపుడు నాగలి తీసి ఒక సారి లాగాడు.

పాపే త్వం మామవజ్ఞాయ యన్నాయాసి మయాహుతా
నేష్యే త్వాం లాఙ్గలాగ్రేణ శతధా కామచారిణీమ్

ఏవం నిర్భర్త్సితా భీతా యమునా యదునన్దనమ్
ఉవాచ చకితా వాచం పతితా పాదయోర్నృప

రామ రామ మహాబాహో న జానే తవ విక్రమమ్
యస్యైకాంశేన విధృతా జగతీ జగతః పతే

పరం భావం భగవతో భగవన్మామజానతీమ్
మోక్తుమర్హసి విశ్వాత్మన్ప్రపన్నాం భక్తవత్సల

అపుడు ఆ నది, స్వామీ నీ ప్రభావం తెలియలక అలా చేసాను క్షమించు. సకల భూమండలమంతా నీ వేయి ఫణాలలో ఒక మారు మూల ఉంచుతావు. నిన్ను నేను ధిక్కరించానని భావించవద్దు అనగా, ఆమెను మందలించి విడిచిపెట్టాడు

తతో వ్యముఞ్చద్యమునాం యాచితో భగవాన్బలః
విజగాహ జలం స్త్రీభిః కరేణుభిరివేభరాట్

కామం విహృత్య సలిలాదుత్తీర్ణాయాసీతామ్బరే
భూషణాని మహార్హాణి దదౌ కాన్తిః శుభాం స్రజమ్

వసిత్వా వాససీ నీలే మాలాం ఆముచ్య కాఞ్చనీమ్
రేయే స్వలఙ్కృతో లిప్తో మాహేన్ద్ర ఇవ వారణః

అద్యాపి దృశ్యతే రాజన్యమునాకృష్టవర్త్మనా
బలస్యానన్తవీర్యస్య వీర్యం సూచయతీవ హి

ఏనుగు ఆడ ఏనుగులతో కలసి విహరించినట్లుగా విహరించాడు. తనలో స్నానం చేసిన బలరామునికి యమునా నది ఆభరణాలూ పుష్పమాలలూ వస్త్రాలూ కానుకగా ఇచ్చింది. బంగారు మాలలనూ వస్త్రాలనూ ధరించి ఐరావత గజములా విహరించాడు. ఇప్పటికీ ఉత్తరభాగం కొంచెం పల్లముగా ఉంటుంది.

ఏవం సర్వా నిశా యాతా ఏకేవ రమతో వ్రజే
రామస్యాక్షిప్తచిత్తస్య మాధుర్యైర్వ్రజయోషితామ్


ఇలా అన్ని రాత్రులూ ఒక్క రాత్రిలా బలరాముని ప్రభావము చేత మధురమైన ఆటలతో గడిపారు.

                         సర్వం శ్రీకృష్ణార్పణంస్తు
                                    

Popular Posts