Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై రెండవ అధ్యాయం

               ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై రెండవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
అథైకదా ద్వారవత్యాం వసతో రామకృష్ణయోః
సూర్యోపరాగః సుమహానాసీత్కల్పక్షయే యథా

ఇలా బలరామ కృష్ణులు ద్వారకలో ఉన్న సమయములో సూర్యగ్రహణం వచ్చింది.

తం జ్ఞాత్వా మనుజా రాజన్పురస్తాదేవ సర్వతః
సమన్తపఞ్చకం క్షేత్రం యయుః శ్రేయోవిధిత్సయా

అందరూ ముందే శ్రేయస్సు కలగడం కోసం సమంతపంచక క్షేత్రానికి వెళ్ళారు. పరశు రాముడు 21 సార్లు క్షత్రియులను సంహరించి వారి రక్తముతో ఐదు నదులను పారించాడు. ఆ నదులలోనే రక్తాన్ని తర్పణం  చేసి తృప్తీ శాంతీ పొంది, ఆయుధాలను విడిచిపెట్టాడు. ఇదే పంచ నదులు, పంచ-అలం, పంచ - ఆపః. పజాబుగా మారింది. ఈ ప్రాంతానికి వెళ్ళారు అందరూ

నిఃక్షత్రియాం మహీం కుర్వన్రామః శస్త్రభృతాం వరః
నృపాణాం రుధిరౌఘేణ యత్ర చక్రే మహాహ్రదాన్

తాను చేసిన క్షత్రియ వధ అనే పాపం తొలగించడానికి నదులను అక్కడకే రప్పించి అందులో స్నానం చేసి, ఎంతటి వాడైనా తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకునే తీరాలి అని లోకానికి చెప్పాడు.

ఈజే చ భగవాన్రామో యత్రాస్పృష్టోऽపి కర్మణా
లోకం సఙ్గ్రాహయన్నీశో యథాన్యోऽఘాపనుత్తయే

మహత్యాం తీర్థయాత్రాయాం తత్రాగన్భారతీః ప్రజాః
వృష్ణయశ్చ తథాక్రూర వసుదేవాహుకాదయః

ఇంత పెద్ద సూర్య గ్రహణం రాబోతుంది. అందుకు భారత దేశ ప్రజలందరూ వచ్చారు.
అకౄరుడూ వసుదేవుడూ ఆహుకుడూ

యయుర్భారత తత్క్షేత్రం స్వమఘం క్షపయిష్ణవః
గదప్రద్యుమ్నసామ్బాద్యాః సుచన్ద్రశుకసారణైః
ఆస్తేऽనిరుద్ధో రక్షాయాం కృతవర్మా చ యూథపః

తమ పాపాలు పోగొట్టుకోవాలని అందరూ వచ్చారు.
ఇంచుమించు అందరూ వచ్చారు కాబట్టి శత్రువుల వలన ఆపదలు కలుగకుండా అనిరుద్ధుడూ కృతవర్మా వారి రక్షణా  బాధ్యతను తీసుకున్నారు

తే రథైర్దేవధిష్ణ్యాభైర్హయైశ్చ తరలప్లవైః
గజైర్నదద్భిరభ్రాభైర్నృభిర్విద్యాధరద్యుభిః

ఏనుగులూ అశ్వములూ రథములూ, వీటిని తీసుకుని అనేక గంధములూ ఆభరణములూ మణులూ మాణిక్యములూ స్త్రీలూ పురుషులూ అందరూ వచ్చి స్నానం చేసి ఉపవాసముతో సావధాన మనస్కులై

వ్యరోచన్త మహాతేజాః పథి కాఞ్చనమాలినః
దివ్యస్రగ్వస్త్రసన్నాహాః కలత్రైః ఖేచరా ఇవ

తత్ర స్నాత్వా మహాభాగా ఉపోష్య సుసమాహితాః
బ్రాహ్మణేభ్యో దదుర్ధేనూర్వాసఃస్రగ్రుక్మమాలినీః

బ్రాహ్మణులకు గో పుష్ప వస్త్ర దానాలు చేసారు. పరశురాముని వలన ఏర్పడిన హ్రదములో స్నానం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారి నుండి ఆశీర్వాదం తీసుకున్నారు.

రామహ్రదేషు విధివత్పునరాప్లుత్య వృష్ణయః
దదః స్వన్నం ద్విజాగ్ర్యేభ్యః కృష్ణే నో భక్తిరస్త్వితి

 మాకు కృష్ణ పరమాత్మ యందు భక్తి కలుగు గాక అని ఆశీర్వదించమని ప్రార్థించాడు
భగవంతుడు కాని దాని యందు విరక్తి కలగాలని ఆశీర్వదించమని అన్నారు
దట్టమైన నీడ గల చెట్ల మూలములో అందరూ కూర్చున్నారు.

స్వయం చ తదనుజ్ఞాతా వృష్ణయః కృష్ణదేవతాః
భుక్త్వోపవివిశుః కామం స్నిగ్ధచ్ఛాయాఙ్ఘ్రిపాఙ్ఘ్రిషు

తత్రాగతాంస్తే దదృశుః సుహృత్సమ్బన్ధినో నృపాన్
మత్స్యోశీనరకౌశల్య విదర్భకురుసృఞ్జయాన్

ఇలా కూర్చుంటే మిత్రులూ బంధువులూ, సకల దేశపు రాజులూ వేంచేసారు.

కామ్బోజకైకయాన్మద్రాన్కున్తీనానర్తకేరలాన్
అన్యాంశ్చైవాత్మపక్షీయాన్పరాంశ్చ శతశో నృప
నన్దాదీన్సుహృదో గోపాన్గోపీశ్చోత్కణ్ఠితాశ్చిరమ్

తమ పక్షం వారూ శత్రువ్ పక్షం వారు ఇతర పక్షాల వారు ఉదాసీనులూ, నందాదులూ గోపికలూ వచ్చారు.

అన్యోన్యసన్దర్శనహర్షరంహసా ప్రోత్ఫుల్లహృద్వక్త్రసరోరుహశ్రియః
ఆశ్లిష్య గాఢం నయనైః స్రవజ్జలా హృష్యత్త్వచో రుద్ధగిరో యయుర్ముదమ్

గోపాలకులూ గోపికలూ నందాదులూ వసుదేవాదులు పులకింతలూ కళ్ళ వెంబడి నీళ్ళూ రాగా, ఆలింగనం చేసుకున్నారు , ఆడవారిని ఆడవాఉ మగవారిని మగవారు. పెద్దవారికి నమస్కరించారు చిన్నవారి చేత నమస్కరించబడ్డారు

స్త్రియశ్చ సంవీక్ష్య మిథోऽతిసౌహృద
స్మితామలాపాఙ్గదృశోऽభిరేభిరే
స్తనైః స్తనాన్కుఙ్కుమపఙ్కరూషితాన్
నిహత్య దోర్భిః ప్రణయాశ్రులోచనాః

తతోऽభివాద్య తే వృద్ధాన్యవిష్ఠైరభివాదితాః
స్వాగతం కుశలం పృష్ట్వా చక్రుః కృష్ణకథా మిథః

పృథా భ్రాతౄన్స్వసౄర్వీక్ష్య తత్పుత్రాన్పితరావపి
భ్రాతృపత్నీర్ముకున్దం చ జహౌ సఙ్కథయా శుచః

స్వాగతాలూ కుశలాలూ చెప్పారు, అడిగించారు. తరువాత కుంతీ దేవి తన సోదరులనూ వారి పుత్రులనూ చూసి, అన్నగారి భార్యలనూ కృష్ణున్నీ చూసి మాట్లాడుతూ దుఃఖాన్ని విడిచిపెట్టింది

కున్త్యువాచ
ఆర్య భ్రాతరహం మన్యే ఆత్మానమకృతాశిషమ్
యద్వా ఆపత్సు మద్వార్తాం నానుస్మరథ సత్తమాః

అన్నగారూ నేను ఎక్కువ అదృష్టం చేసుకోని దానిలాగా భావించుకుంటున్నాను. నాకు ఇన్ని ఆపదలు వస్తే నావారు ఎవరూ నన్ను తలచుకోలేదు.

సుహృదో జ్ఞాతయః పుత్రా భ్రాతరః పితరావపి
నానుస్మరన్తి స్వజనం యస్య దైవమదక్షిణమ్

పరమాత్మ అనుకూలముగా లేకుంటే మిత్రులూ బంధువులూ సోదరులూ పుత్రులూ, చివరకు తల్లి తండ్రులు కూడా స్మరించరని అనుకుంటాను. దానికి నా జీవితమే తార్కాణం

శ్రీవసుదేవ ఉవాచ
అమ్బ మాస్మానసూయేథా దైవక్రీడనకాన్నరాన్
ఈశస్య హి వశే లోకః కురుతే కార్యతేऽథ వా

మమ్ము తప్పు బట్టకూ, మేమంతా దేవుడి చేతుల్లో ఆటబొమ్మలం. లోకమంతా ఆయన చేతుల్లో ఉండి చేస్తుందీ చేయిస్తుంది.

కంసప్రతాపితాః సర్వే వయం యాతా దిశం దిశమ్
ఏతర్హ్యేవ పునః స్థానం దైవేనాసాదితాః స్వసః

కంసునికి భయపడి మనమందరమూ తలో దిక్కుకూ వెళ్ళాము. ఆ పరమాత్మే మనల్ని ఇపుడు ఒక చోట కలిపాడు

శ్రీశుక ఉవాచ
వసుదేవోగ్రసేనాద్యైర్యదుభిస్తేऽర్చితా నృపాః
ఆసన్నచ్యుతసన్దర్శ పరమానన్దనిర్వృతాః

వసుదేవ ఉగ్రసేనాది యాదవుల చేత అర్చించబడి పరమాత్మను చూచామూ అన్న పరమానందముతో వారందరూ తృప్తి పొందారు

భీష్మో ద్రోణోऽమ్బికాపుత్రో గాన్ధారీ ససుతా తథా
సదారాః పాణ్డవాః కున్తీ సఞ్జయో విదురః కృపః

కున్తీభోజో విరాటశ్చ భీష్మకో నగ్నజిన్మహాన్
పురుజిద్ద్రుపదః శల్యో ధృష్టకేతుః స కాశిరాట్

దమఘోషో విశాలాక్షో మైథిలో మద్రకేకయౌ
యుధామన్యుః సుశర్మా చ ససుతా బాహ్లికాదయః

రాజానో యే చ రాజేన్ద్ర యుధిష్ఠిరమనువ్రతాః
శ్రీనికేతం వపుః శౌరేః సస్త్రీకం వీక్ష్య విస్మితాః

ఇలా ఇందరూ వచ్చారు. ధర్మరాజు వెంట అతని సామంతరాజులు అనుసరించి వచ్చారు
భార్యలతో కూడిన పరమాత్మ యొక్క శ్రీ నిలయమైన దివ్యమంగళ విగ్రహాన్ని తనివి తీరా చూచారు.

అథ తే రామకృష్ణాభ్యాం సమ్యక్ప్రాప్తసమర్హణాః
ప్రశశంసుర్ముదా యుక్తా వృష్ణీన్కృష్ణపరిగ్రహాన్

బలరామ కృష్ణులతో అందరూ పూజించబడి, కృష్ణ పరమాత్మ చేత కాపాడబడిన యాదవులను పొగిడారు అందరూ

అహో భోజపతే యూయం జన్మభాజో నృణామిహ
యత్పశ్యథాసకృత్కృష్ణం దుర్దర్శమపి యోగినామ్

ఉగ్రసేనా ఇంత మందిలో మీ జన్మే సార్ధకం. యోగులకు కూడా చూడ వీలులేని పరమాత్మను రోజూ చూస్తున్నారు.

యద్విశ్రుతిః శ్రుతినుతేదమలం పునాతి
పాదావనేజనపయశ్చ వచశ్చ శాస్త్రమ్
భూః కాలభర్జితభగాపి యదఙ్ఘ్రిపద్మ
స్పర్శోత్థశక్తిరభివర్షతి నోऽఖిలార్థాన్


ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే భాగవతం మొత్తం చదివిన ఫలితం వస్తుంది.
ఎవరి కీర్తి వేదముల చేత స్తోత్రం చేయబడుతోందో, ఆ కీర్తి సకల జగత్తునూ పావనం చేస్తుంది.
పరమాత్మయొక్క పాదము నుండి బయలు దేరిన జలం సకల జగత్తునూ పవిత్రం చేస్తుంది. అతని కీర్తి వేదములనూ, అతని పాద జలం లోకములను పవిత్రం చేస్తుంది. పరమాత్మ మాట్లాడిన మాటలే వేద పురాణములు.
ఈ భూమి కాలము చేత బాగా ఉడికిపోతుంది. కాలం వలన వచ్చిన అనేక పాపుల తాపముతో వేపబడిన భూమి ఈ పరమాత్మ యొక్క పాద స్పర్శ వలన కొత్త శక్తిని పొంది, మనకు అన్ని కోరికలనూ ఇస్తున్నది. కాలచబ్డిన భూమి పంట ఇవ్వదు.కానీ పరమాత్మ పాద స్పర్శ పడాగానే పాపముతో కాల్చబడిన భూమి కూడా అన్ని కోరికలనూ ఇస్తున్నది.

తద్దర్శనస్పర్శనానుపథప్రజల్ప
శయ్యాసనాశనసయౌనసపిణ్డబన్ధః
యేషాం గృహే నిరయవర్త్మని వర్తతాం వః
స్వర్గాపవర్గవిరమః స్వయమాస విష్ణుః

కృష్ణ పరమాత్మను చూడడమే కాదు, మీరు ఆయనను స్పృశిస్తున్నారు. ఆయనను ధ్యానిస్తున్నారు. ఆయనకే నమస్కరిస్తున్నారు. ఆయననే అర్చిస్తున్నారు. ఆయననే స్మరిస్తున్నారు. మీరు ఆయనను చూస్తూ తాకుతూ వెంట నడుస్తూ మాట్లాడుతూ, ఒక శయ్య మీద పడుకుంట్నునారు. ఆయన పక్కన కూర్చుంటున్నారు,కలసి భుజిస్తున్నారు,ఆయన పిల్లలతో పెళ్ళి సంబంధములు కలుపుకుంటున్నారు
ఇన్ని రకముల సంబంధములతో పరమాత్మ ఉన్న చోట స్వర్గమూ, అపవర్గమూ  ఎందుకు. నిజముగా పరమాత్మ భక్తుడు పరమాత్మనే కోరతాడు.

శ్రీశుక ఉవాచ
నన్దస్తత్ర యదూన్ప్రాప్తాన్జ్ఞాత్వా కృష్ణపురోగమాన్
తత్రాగమద్వృతో గోపైరనఃస్థార్థైర్దిదృక్షయా

అపుడు నందుడు, కృష్ణుడు వసుదేవాదులు వచ్చారన్న వార్త విన్నాడు.బళ్ళు తీసుకుని అక్కడకు వచ్చారు

తం దృష్ట్వా వృష్ణయో హృష్టాస్తన్వః ప్రాణమివోత్థితాః
పరిషస్వజిరే గాఢం చిరదర్శనకాతరాః

పోయిన ప్రాణం తిరిగి వస్తే ఎంత ఆనందిస్తారో అంత ఆనందించి గాఢముగా కౌగిలించుకున్నాడు

వసుదేవః పరిష్వజ్య సమ్ప్రీతః ప్రేమవిహ్వలః
స్మరన్కంసకృతాన్క్లేశాన్పుత్రన్యాసం చ గోకులే

వసుదేవుడు నందున్ని చూచి అంతకు పూర్వం వారు పడిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

కృష్ణరామౌ పరిష్వజ్య పితరావభివాద్య చ
న కిఞ్చనోచతుః ప్రేమ్ణా సాశ్రుకణ్ఠౌ కురూద్వహ

కంసునికి భయపడి చివరకు మా పిల్లలను మీ దగ్గ్ర ఉంచితే మా పిల్లలను మీ పిల్లల కంటే ప్రేమగా పెంచారు.
కృష్ణున్ని నందుడు గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. గొంతు పెగలలేదు.

తావాత్మాసనమారోప్య బాహుభ్యాం పరిరభ్య చ
యశోదా చ మహాభాగా సుతౌ విజహతుః శుచః

యశోద ఇద్దరి పిల్లలను గట్టిగా కౌగిలించుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ఇంత కాలం పడిన ఎడబాటుని విరమించుకుంది

రోహిణీ దేవకీ చాథ పరిష్వజ్య వ్రజేశ్వరీమ్
స్మరన్త్యౌ తత్కృతాం మైత్రీం బాష్పకణ్ఠ్యౌ సమూచతుః

రోహిణాదులు కూడా పాతవన్నీ జ్ఞ్యాపకం చేసుకున్నారు

కా విస్మరేత వాం మైత్రీమనివృత్తాం వ్రజేశ్వరి
అవాప్యాప్యైన్ద్రమైశ్వర్యం యస్యా నేహ ప్రతిక్రియా

యశోదా నీవు చేసిన ఉపకారం,నీవు చూపిన మైత్రి ఎవరైనా మరచిపోతారా
ఇంద్ర పదవిలాంటి సంపద ఇచ్చినా నీవు చేసిన దానికి ప్రతిక్రియ కాదు.

ఏతావదృష్టపితరౌ యువయోః స్మ పిత్రోః
సమ్ప్రీణనాభ్యుదయపోషణపాలనాని
ప్రాప్యోషతుర్భవతి పక్ష్మ హ యద్వదక్ష్ణోర్
న్యస్తావకుత్ర చ భయౌ న సతాం పరః స్వః

కనులు తెరచి ఎవరి తండ్రీ ఎవరు తల్లీ అని అడిగినప్పుడు నీవే వారికి కనప్డ్డావు.
సంతోషపెట్టారు మురిపించారు నామకరణం చేసారు, పుణ్యాహవచనం చేసారు , పోషించారు, లాలించారు, కంటికి రెప్పల వలే మీరు వారిని కాపాడారు. (కంటికి ఎపుడు ఆపద వస్తుందో తెలియదు. తెలియక ఆపద వచ్చినా తెలియకుండానే కాపాడుతుంది కంటి రెప్ప)
ఇతరుల ధనమైనా మీ ధనము వలె చాలా జాగ్రత్తగా ప్రేమగా కాపాడారు

శ్రీశుక ఉవాచ
గోప్యశ్చ కృష్ణముపలభ్య చిరాదభీష్టం
యత్ప్రేక్షణే దృశిషు పక్ష్మకృతం శపన్తి
దృగ్భిర్హృదీకృతమలం పరిరభ్య సర్వాస్
తద్భావమాపురపి నిత్యయుజాం దురాపమ్

చాలా కాలం తరువాత గోపికలకు కృష్ణుడు కనిపించాడు. రెప్పలు పెట్టిన బ్రహ్మను తిడుతున్నారు. కన్నులతో హృదయముతో కృష్ణున్ని కౌగిలించుకున్నారు. నిరతరం కలసి ఉండేవారికి కూడా దొరకని స్వామిని వీరు ఎల్లప్పుడూ తమ మనసులో బంధించి ఉంచి అటువంటి భావాన్ని పొందారు

భగవాంస్తాస్తథాభూతా వివిక్త ఉపసఙ్గతః
ఆశ్లిష్యానామయం పృష్ట్వా ప్రహసన్నిదమబ్రవీత్

ఏకాంతములో స్వామి వారిన్ కలసి ఆలింగనం చేసుకుని వారి క్షేమాన్ని అడిగి ఇలా చెప్పాడు

అపి స్మరథ నః సఖ్యః స్వానామర్థచికీర్షయా
గతాంశ్చిరాయితాఞ్ఛత్రు పక్షక్షపణచేతసః

మన స్నేహం గుర్తు ఉందా. మనం స్నేహముగా ఉన్నప్పుడు దాన్ని వదలిపెట్టి మావాళ్ళకు మేలు కలిగించాలని వచ్చాను. ఆ వచ్చినప్పటినుంచీ మా వారికి గల శత్రు సంహారం చేయడముతో ఇంత కాలం జరిగింది.

అప్యవధ్యాయథాస్మాన్స్విదకృతజ్ఞావిశఙ్కయా
నూనం భూతాని భగవాన్యునక్తి వియునక్తి చ

పొరబాటున కృష్ణుడు కృతఘ్నుడు అనుకున్నారా. కృతఘ్నుడు కాదు అని మీరు భావిస్తున్నారా.
కలవాలని అనుకుంటాము. కలిసే ఉండాలని అనుకుంటాము. కలిపే వాడూ విడదీసేవాడూ భగవానుడు. మనం చేసేదేముంది. వాయువు కలిసి ఉన్న మబ్బులను చెల్లాచెదురు చేస్తుంది. విడిపోయిన మబ్బులను కలుపుతుంది. దుమ్మును రేపుంతుంది. జలమును కదిలిస్తుందు. వాయువూ కలుపుతూ విడదీస్తూ ఉన్నట్లు పరమాత్మ కూడా కలుపుతాడూ విడదీస్తాడు

వాయుర్యథా ఘనానీకం తృణం తూలం రజాంసి చ
సంయోజ్యాక్షిపతే భూయస్తథా భూతాని భూతకృత్

మయి భక్తిర్హి భూతానామమృతత్వాయ కల్పతే
దిష్ట్యా యదాసీన్మత్స్నేహో భవతీనాం మదాపనః

ప్రాణులకు నా మీద భక్తి మోక్షాన్ని ఇస్తుంది. నా మీద స్నేహం భగవత్సంకల్పముతో కలిగింది.

అహం హి సర్వభూతానామాదిరన్తోऽన్తరం బహిః
భౌతికానాం యథా ఖం వార్భూర్వాయుర్జ్యోతిరఙ్గనాః

అంతా నేనే ఉన్నాను. నేనే ఆది నేనే మధ్యా నేనే అంతం నేనే లోపలా నేనే వెలుపలా
పంచభూతాలు లేనిదెక్కడ. ఎలాగైతే పంచభూతాలు అంతటా వ్యాపించి ఉంటాయో నేను కూడా లోపలా వెలుపలా అంతటా ఉన్నాను

ఏవం హ్యేతాని భూతాని భూతేష్వాత్మాత్మనా తతః
ఉభయం మయ్యథ పరే పశ్యతాభాతమక్షరే

సకల భూతములు ఇలాగే ఉంటాయి. భూతములలో భూతములు ఉంటాయి. ఆత్మలో మనసు. పరమాత్మలో ఆత్మ, ఆత్మలో మనసూ, మనసు శరీరములో శరీరం ప్రపంచములో, ప్రపంచం బ్రహ్మాండములో, ఆ బ్రహ్మాండం పరమాత్మలో ఉంటుంది.
లోపలా వెలుపలా అనేది నా యందే ఉంటాయి. నేను వాటిలో ఉంటాను. సకల జగత్తూ నా యందే ఉంది.

శ్రీశుక ఉవాచ
అధ్యాత్మశిక్షయా గోప్య ఏవం కృష్ణేన శిక్షితాః
తదనుస్మరణధ్వస్త జీవకోశాస్తమధ్యగన్

కృష్ణుడు గోపికలకు ఆధ్యాత్మ విద్యను ఉపదేశించాడు. అలాంటి పరమాత్మ యొక్క నిరంతర స్మరణతో వీరిలో ఉండే వాసనా సంస్కారాలు ధ్వంసమయ్యాయి. అజ్ఞ్యానం తొలగిపోయింది.

ఆహుశ్చ తే నలిననాభ పదారవిన్దం
యోగేశ్వరైర్హృది విచిన్త్యమగాధబోధైః
సంసారకూపపతితోత్తరణావలమ్బం
గేహం జుషామపి మనస్యుదియాత్సదా నః

పద్మనాభా, అంతము లేని జ్ఞ్యానము గల యోగేశ్వరులకు కూడా మనసులో ధ్యానించ శక్యం కానీ నీ పాద పద్మములను, సంసారం అనే మహా కూపములో పడిన వారిని లేపుటకు ఆధారమైన నీ పాద పద్మాలు ఇంటిలో ఉన్న వారి (సంసారుల) మనసులో సాక్షాత్కరించుగాక. అని గోపికలు అడిగారు
సకల జీవులకూ నీ పాద స్మరణ భాగ్యం కలిగించు అని గోపికలు కోరారు.

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts