Followers

Sunday 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై మూడవ అధ్యాయం

                 ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అపశ్యతాం చానిరుద్ధం తద్బన్ధూనాం చ భారత
చత్వారో వార్షికా మాసా వ్యతీయురనుశోచతామ్

ఇంకా అనిరుద్ధుడు రాకపోయేసరిని అందరూ ఆందోళనగా ఉన్నారు

నారదాత్తదుపాకర్ణ్య వార్తాం బద్ధస్య కర్మ చ
ప్రయయుః శోణితపురం వృష్ణయః కృష్ణదైవతాః

నారదుడు వచ్చి జరిగిన విషయం చెప్పాడు.

ప్రద్యుమ్నో యుయుధానశ్చ గదః సామ్బోऽథ సారణః
నన్దోపనన్దభద్రాద్యా రామకృష్ణానువర్తినః

అక్షౌహిణీభిర్ద్వాదశభిః సమేతాః సర్వతో దిశమ్
రురుధుర్బాణనగరం సమన్తాత్సాత్వతర్షభాః

భజ్యమానపురోద్యాన ప్రాకారాట్టాలగోపురమ్
ప్రేక్షమాణో రుషావిష్టస్తుల్యసైన్యోऽభినిర్యయౌ

బలరామ కృష్ణులూ యాదవ సైన్యమూ అందరూ కలసి యుద్ధానికి వెళ్ళారు బాణాసురుని మీద

బాణార్థే భగవాన్రుద్రః ససుతః ప్రమథైర్వృతః
ఆరుహ్య నన్దివృషభం యుయుధే రామకృష్ణయోః

ఆసీత్సుతుములం యుద్ధమద్భుతం రోమహర్షణమ్
కృష్ణశఙ్కరయో రాజన్ప్రద్యుమ్నగుహయోరపి

కుమ్భాణ్డకూపకర్ణాభ్యాం బలేన సహ సంయుగః
సామ్బస్య బాణపుత్రేణ బాణేన సహ సాత్యకేః

అపుడు శంకరుడు నందిని అధిరోహించి యుద్ధానికి వచ్చాడు. ఆయనతో బాటుగా కుమారస్వామీ, వినాయకుడూ పార్శ్వదులూ అందరూ వచ్చారు.

బ్రహ్మాదయః సురాధీశా మునయః సిద్ధచారణాః
గన్ధర్వాప్సరసో యక్షా విమానైర్ద్రష్టుమాగమన్

శఙ్కరానుచరాన్శౌరిర్భూతప్రమథగుహ్యకాన్
డాకినీర్యాతుధానాంశ్చ వేతాలాన్సవినాయకాన్

ప్రేతమాతృపిశాచాంశ్చ కుష్మాణ్డాన్బ్రహ్మరాక్షసాన్
ద్రావయామాస తీక్ష్ణాగ్రైః శరైః శార్ఙ్గధనుశ్చ్యుతైః

కృష్ణుడికీ శంకరుడికీ ప్రద్య్మ్నుడికీ కుమారస్వామికీ కుంబాణ్డకాదులకీ, సాత్యకికీ బాణుడికీ

పృథగ్విధాని ప్రాయుఙ్క్త పిణాక్యస్త్రాణి శార్ఙ్గిణే
ప్రత్యస్త్రైః శమయామాస శార్ఙ్గపాణిరవిస్మితః

బ్రహ్మాస్త్రస్య చ బ్రహ్మాస్త్రం వాయవ్యస్య చ పార్వతమ్
ఆగ్నేయస్య చ పార్జన్యం నైజం పాశుపతస్య చ

మోహయిత్వా తు గిరిశం జృమ్భణాస్త్రేణ జృమ్భితమ్
బాణస్య పృతనాం శౌరిర్జఘానాసిగదేషుభిః

ఈ విచిత్రమైన యుద్ధాన్ని చూడడానికి దేవతలందరూ వచ్చారు. భూత ప్రేత పిశాచ శాఖినీ డాకినీ భేతాలాది ప్రేత మాతృ గణాలతో పరస్పరం ఘోరమైన యుద్ధం జరిగింది. బాణుని సైన్యాన్ని స్వామి తన ఖడ్గములతో బాణములతో ఆయుధములతో చెల్లాచెదురు చేసాడు

స్కన్దః ప్రద్యుమ్నబాణౌఘైరర్ద్యమానః సమన్తతః
అసృగ్విముఞ్చన్గాత్రేభ్యః శిఖినాపక్రమద్రణాత్

కుమ్భాణ్డకూపకర్ణశ్చ పేతతుర్ముషలార్దితౌ
దుద్రువుస్తదనీకని హతనాథాని సర్వతః

ఐదువందల ధనస్సులతో ఐదువందల బాణాలను ప్రయోగించాడు. అన్నిటినీ స్వామి చేదించుకుంటూ, సారధినీ రథాన్నీ అందరినీ చంపేసి బాణుడు చంపే దగ్గరలో ఉండగా

విశీర్యమాణమ్స్వబలం దృష్ట్వా బాణోऽత్యమర్షితః
కృష్ణమభ్యద్రవత్సఙ్ఖ్యే రథీ హిత్వైవ సాత్యకిమ్

ధనూంష్యాకృష్య యుగపద్బాణః పఞ్చశతాని వై
ఏకైకస్మిన్శరౌ ద్వౌ ద్వౌ సన్దధే రణదుర్మదః

తాని చిచ్ఛేద భగవాన్ధనూంసి యుగపద్ధరిః
సారథిం రథమశ్వాంశ్చ హత్వా శఙ్ఖమపూరయత్

తన్మాతా కోటరా నామ నగ్నా మక్తశిరోరుహా
పురోऽవతస్థే కృష్ణస్య పుత్రప్రాణరిరక్షయా

అతని మాత కోటర కుమారున్ని కాపాడాలని నగ్నముగా వచ్చి ఎదురు నిలబడగా కృష్ణుడు ముఖం తిప్పుకుని రథం వెనక్కు మరల్చాడు, పరస్త్రీని నగ్నముగా చూడకూడదని.

తతస్తిర్యఙ్ముఖో నగ్నామనిరీక్షన్గదాగ్రజః
బాణశ్చ తావద్విరథశ్ఛిన్నధన్వావిశత్పురమ్

విద్రావితే భూతగణే జ్వరస్తు త్రీశిరాస్త్రీపాత్
అభ్యధావత దాశార్హం దహన్నివ దిశో దశ

అథ నారాయణః దేవః తం దృష్ట్వా వ్యసృజజ్జ్వరమ్
మాహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే జ్వరావుభౌ

మాహేశ్వరః సమాక్రన్దన్వైష్ణవేన బలార్దితః
అలబ్ధ్వాభయమన్యత్ర భీతో మాహేశ్వరో జ్వరః
శరణార్థీ హృషీకేశం తుష్టావ ప్రయతాఞ్జలిః

ఇది చూసి శంకరుడు శివ జ్వరాన్ని (ఒక అస్త్రాన్ని) ప్రయోగించగా అది కృష్ణుడు సైన్యాన్ని బాధించడం మొదలుపెట్టగా, స్వామి వైష్ణవ జ్వరాన్ని ప్రయోగించాడు.
(జ్వరం వచ్చే నక్షత్రం బట్టి అది ఏ జ్వరమో చెప్పవచ్చు. శ్రవణాది నక్షత్రాలు విష్ణు నక్షత్రాలు, ఆరుద్రా మఖాది నక్షత్రాలు శివ నక్షత్రాలు. వచ్చిన నక్షత్రం బట్టి అది ఏ జ్వరమో నిర్ణయించవచ్చు.)
వైష్ణ్యవ జ్వరముతో బాధపడిన్ శివ జ్వరం స్వామిని స్తోత్రం చేస్తోంది
ఈ నాలుగు శ్లోకాలనూ జవరం వచ్చిన వారు చదువుకుంటే జ్వరం పోతుంది అని శాస్త్రం
జ్వర ఉవాచ
నమామి త్వానన్తశక్తిం పరేశమ్సర్వాత్మానం కేవలం జ్ఞప్తిమాత్రమ్
విశ్వోత్పత్తిస్థానసంరోధహేతుం యత్తద్బ్రహ్మ బ్రహ్మలిఙ్గమ్ప్రశాన్తమ్

నీవు పరమాత్మవు,అనంత శక్తివి, జ్ఞ్యాన స్వరూపుడవు,
నీవు జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారానికి మూలము.

కాలో దైవం కర్మ జీవః స్వభావో ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికారః
తత్సఙ్ఘాతో బీజరోహప్రవాహస్త్వన్మాయైషా తన్నిషేధం ప్రపద్యే

కాలమూ జీవుడూ కర్మా దైవమూ స్వభావమూ జీవుడూ క్షేత్రమూ శరీరమూ శరీరములో విఘాతమూ, అంతా బీజమూ మోలకవంటిది. ప్రపంచానికి మారుపేరు బీజరోహ ప్రవాహం. విత్తనమూ మొలక. విత్తనం వలన చెట్టూ, చెట్టు వలన విత్తనం. ప్రప్రంచం అంతా ఇంతే. ఇదంతా నీ మాయ. అలాంటి నీ మాయను మేము గెలవాలంటే మీరే దిక్కు. మీకు శరణు వేడుతున్నాము

నానాభావైర్లీలయైవోపపన్నైర్దేవాన్సాధూన్లోకసేతూన్బిభర్షి
హంస్యున్మార్గాన్హింసయా వర్తమానాన్జన్మైతత్తే భారహారాయ భూమేః

నీవే నీ లీలతో, విలాసముగా ఏర్పడిన భావములతో దేవతలనూ సాధుజనులనూ సకల జనులనూ జగములనూ కాపాడుతున్నావు.
హింసించే దుర్మార్గులను నీవు వధిస్తున్నావు. నీ అవతారం భూమి యొక్క భారం తొలగించడానికే

తప్తోऽహమ్తే తేజసా దుఃసహేన శాన్తోగ్రేణాత్యుల్బణేన జ్వరేణ
తావత్తాపో దేహినాం తేऽన్ఘ్రిమూలం నో సేవేరన్యావదాశానుబద్ధాః

నీ దుసాహమైన తేజస్స్తుఓ తపించిపోతున్నాను. నీ జ్వరం అత్యుల్బణం, మహాభయంకరమైనది. శాంతమే కానీ, నీ జ్వరం ఉగ్రం. వైష్ణవ జ్వరం శాంతముగా ఉన్న్నా అతి ఉర్గమైనది. ఎలాగైతే నీవు అందరికీ కనపడవో నీ జ్వరం కూడా కనపడు. శాతముగా ఉండి ఉగ్రముగా ఉంటుంది. చాలా బాధపెడుతుంది. నీ పాదపద్మములను సేవించనంత వరకే జీవులకు తాపములు ఉంటాయి.ఆశాబద్ధులైన జీవులు నీ పాదాలను ఆశ్రయించలేరు. ఆన్ని ఆశలు వదులుకుని నీ పాదాలను ఆశ్రయిస్తే ఏ తాపమూ ఉండదు అని ప్రార్థిస్తే

శ్రీభగవానువాచ
త్రిశిరస్తే ప్రసన్నోऽస్మి వ్యేతు తే మజ్జ్వరాద్భయమ్
యో నౌ స్మరతి సంవాదం తస్య త్వన్న భవేద్భయమ్

స్వామి ప్రసన్నుడై నా జవరం నుండి భయం పోతుంది. మన ఇద్దరి సంబాషణనూ ఎవరు స్మరిస్తారో వారికి నీ జ్వరం నుండీ నా జ్వరం నుండీ ఏనాడూ ఏ బాధా ఉండదు. అని చెప్పి

ఇత్యుక్తోऽచ్యుతమానమ్య గతో మాహేశ్వరో జ్వరః
బాణస్తు రథమారూఢః ప్రాగాద్యోత్స్యన్జనార్దనమ్

ఆ జ్వరం కాస్తా వెళ్ళిపోయింది. బాణాసురుడు అన్నీ సమకూర్చుకుని యుద్ధానికి వచ్చాడు.

తతో బాహుసహస్రేణ నానాయుధధరోऽసురః
ముమోచ పరమక్రుద్ధో బాణాంశ్చక్రాయుధే నృప

వేయి బాహువులతో బాణాసురుడు స్వామి మీద బాణములు ప్రయోగించగా పరమాత్మ అన్నిటినీ కూడా చేదించి,

తస్యాస్యతోऽస్త్రాణ్యసకృచ్చక్రేణ క్షురనేమినా
చిచ్ఛేద భగవాన్బాహూన్శాఖా ఇవ వనస్పతేః

వీడి గర్వమంతా బాహువులతోనే కదా అని తన చక్రం ప్రయోగించి, అతని నాలుగు బాహువులను ఉంచి మిగిలిన బాహువులను చెట్టుకొమంలను నరికేసినట్లు చేదించాడు

బాహుషు ఛిద్యమానేషు బాణస్య భగవాన్భవః
భక్తానకమ్ప్యుపవ్రజ్య చక్రాయుధమభాషత

తన భక్తుని బాహువులను చేదిస్తోంటే పరమ శివుడు స్వామితో బాణాసురున్ని కాపాడాలని ఈ విధముగా స్తోత్రం చేసాడు

శ్రీరుద్ర ఉవాచ
త్వం హి బ్రహ్మ పరం జ్యోతిర్గూఢం బ్రహ్మణి వాఙ్మయే
యం పశ్యన్త్యమలాత్మాన ఆకాశమివ కేవలమ్

స్వామీ, నీవు పరం జ్యోతివీ, పరబ్రహ్మవు, నీవు ప్రతీ వారి వాక్కులో ఉంటావు. మనకు కలిగే సంపదలూ ఆపదలకూ మూలం వాక్కు. వారికి ఏ విధముగా ఏది కావాలో ఆ విధముగా వారిచేత మాట్లాడిస్తూ ఉంటావు.పరిశుద్ధమైన మనసు కలవారే నిన్ను సేవించగలరు

నాభిర్నభోऽగ్నిర్ముఖమమ్బు రేతో
ద్యౌః శీర్షమాశాః శ్రుతిరఙ్ఘ్రిరుర్వీ
చన్ద్రో మనో యస్య దృగర్క ఆత్మా
అహం సముద్రో జఠరం భుజేన్ద్రః

నభస్సు నాభి, అగ్ని ముఖం వీర్యం జలము, ద్యవు శీర్షం ఆశ శ్రుతి, భూమి పాదం చంద్రుడు మనసూ, సూర్యుడు నేత్రం, నేను అంతఃకరణాన్ని, సముద్రం నీ ఉదరం.,

రోమాణి యస్యౌషధయోऽమ్బువాహాః
కేశా విరిఞ్చో ధిషణా విసర్గః
ప్రజాపతిర్హృదయం యస్య ధర్మః
స వై భవాన్పురుషో లోకకల్పః

ఔషధులు రోమములూ, కేశములు మేఘములు, బుద్ధి బ్రహ్మ, ధర్మం హృదయం. ఇది నీ విశ్వరూపం

తవావతారోऽయమకుణ్ఠధామన్ధర్మస్య గుప్త్యై జగతో హితాయ
వయం చ సర్వే భవతానుభావితా విభావయామో భువనాని సప్త

నీ అవతారం ధర్మాన్ని రక్షించడానికీ, జగత్తును కాపాడడానికి. మేమందరం నీ ప్రభావముతో ప్రేరేపించబడి జగత్తు యొక్క పరిపాలనా ధర్మాలను చేస్తున్నాము

త్వమేక ఆద్యః పురుషోऽద్వితీయస్తుర్యః స్వదృగ్ధేతురహేతురీశః
ప్రతీయసేऽథాపి యథావికారం స్వమాయయా సర్వగుణప్రసిద్ధ్యై

నీవొక్కడవే అద్వితీయుడవు ఆది పురుషుడవు, అన్నిటికీ కారణమైన నీవే దేనికీ కారణం కావు
నీలో ఏ గుణాలూ లేవు (సత్వ రజో తమో గుణాలు) కానీ లోకధర్మాలను కాపాడడానికి ఆయా సమయాలలో ఆయా గుణముల వలన ఏర్పడే వికారాలను చూపుతున్నావు. వాటిని చూచి నీవు కూడా మాలాంటి వాడవే అనుకుంటున్నాము

యథైవ సూర్యః పిహితశ్ఛాయయా స్వయా
ఛాయాం చ రూపాణి చ సఞ్చకాస్తి
ఏవం గుణేనాపిహితో గుణాంస్త్వమ్
ఆత్మప్రదీపో గుణినశ్చ భూమన్

ఉదాహరణకు, మబ్బు సూర్యునికి అడ్డురాగానే ఆయన కాంతి తరిగిపోతుందా. తన ప్రకాశము పోకుండానే తనకు అడ్డు వచ్చిన మబ్బును కూడా తన కాంతితోనే తాను చూపెడతాడు. చూచే కన్నులో కూడా తానే ఉన్నాడు. మబ్బు కంటికీ సూర్యునికీ అడ్డు వచ్చినా మబ్బునూ చూపుతున్నాడు, మబ్బు వలన వచ్చే నీడనూ చూపుతున్నాడు. తనకు మబ్బూ లేదు నీడాలేదు. అలాగే పరమాత్మ కూడా మాయను అడ్డు పెట్టుకుని, మాయనూ చూపుతున్నాడు, మననూ చూపుతున్నాడు, మాయ వలన కలిగే అజ్ఞ్యానాన్ని చూపుతున్నాడు. సూర్యుడిని మబ్బు ఎలా కప్పలేదో, మాయ నిన్ను కప్పిపుచ్చలేదు.
కప్పబడని సూర్యుడిలాగ గుణాలతో నీవు కప్పబడవు. గుణములు కలవాని వాడి వలే కనపడతావు.

యన్మాయామోహితధియః పుత్రదారగృహాదిషు
ఉన్మజ్జన్తి నిమజ్జన్తి ప్రసక్తా వృజినార్ణవే

నీ మాయలో మునిగిన వారు భార్యా ఇల్లూ సంసారం పిల్లలూ అనే ప్రవాహములో మునుగుతారు. తేలుతారు. మళ్ళీ మునుగుతారు

దేవదత్తమిమం లబ్ధ్వా నృలోకమజితేన్ద్రియః
యో నాద్రియేత త్వత్పాదౌ స శోచ్యో హ్యాత్మవఞ్చకః

నీవు ప్రసాదించిన మానవ దేహాన్ని పొంది కూడా ఇంద్రియ జయమును పొందకుండా, ఇంద్రియ జయముతో నీ పాదాలను ఆశ్రయించని వాడి మానవజన్మ వ్యర్థము. వాడు ఆత్మ వంచకుడు. మానవ జన్మ ఉన్నంతలోపే పరమాత్మ పాదాలను ఆశ్రయించే పరయత్నం చేయని వాడు ఆత్మ వంచకుడు

యస్త్వాం విసృజతే మర్త్య ఆత్మానం ప్రియమీశ్వరమ్
విపర్యయేన్ద్రియార్థార్థం విషమత్త్యమృతం త్యజన్

అందరికీ ఆత్మవూ ప్రియుడవూ ఈశ్వరుడవూ ఐన నిన్ను వదిలిపెట్టి, విషయభోగాలను ఆశ్రయించేవారు అరచేతిలో ఉన్న అమృతాన్ని వదలి, విషాన్ని తింటున్నవారితో సమానం.

అహం బ్రహ్మాథ విబుధా మునయశ్చామలాశయాః
సర్వాత్మనా ప్రపన్నాస్త్వామాత్మానం ప్రేష్ఠమీశ్వరమ్

నేనూ , బ్రహ్మా దేవతలూ మునులూ, మేమందరమూ నిన్నే ఆశ్రయించాము. మా అందరికీ ఆత్మవూ ప్రియుడవూ ఈశ్వరుడవూ నీవే.

తం త్వా జగత్స్థిత్యుదయాన్తహేతుం
సమం ప్రసాన్తం సుహృదాత్మదైవమ్
అనన్యమేకం జగదాత్మకేతం
భవాపవర్గాయ భజామ దేవమ్

ప్రపంచం యొక్క సృష్టీ స్థితీ లయం, ఈ మూడింటినీ నీవు సమానముగా చేస్తావు. సృష్టించినపుడు సంతోషం, లయం చేసినపుడు బాధా, నీకు ఉండవు. ఎలాంటి వికారములూ లేకుండా ఉంటావు
ఇలాంటి జగదాత్మ స్వరూపుడవైన నిన్ను సంసారం తొలగుటకు సేవిస్తున్నాము

అయం మమేష్టో దయితోऽనువర్తీ మయాభయం దత్తమముష్య దేవ
సమ్పాద్యతాం తద్భవతః ప్రసాదో యథా హి తే దైత్యపతౌ ప్రసాదః

ఈ బాణాసురుడు నా ప్రియభక్తుడు, ఇష్టుడు, నన్ను అనుసరించి ఉంటాడు. నీకు ఎలాంటి భయమూ కలగదు అని అభయమిచ్చాను. నేను ఇచ్చిన మాటను నీవే నిలబెట్టాలి. ఈ దైత్యపతిని కాపాడు అని ప్రార్థిస్తే

శ్రీభగవానువాచ
యదాత్థ భగవంస్త్వం నః కరవామ ప్రియం తవ
భవతో యద్వ్యవసితం తన్మే సాధ్వనుమోదితమ్

నీవు చెప్పినది నేను కాదంటానా, నీ ఇష్టమే నా ఇష్టము. నీవు చేసిన దాన్ని నేనూ ఆమోదిస్తున్నాను.

అవధ్యోऽయం మమాప్యేష వైరోచనిసుతోऽసురః
ప్రహ్రాదాయ వరో దత్తో న వధ్యో మే తవాన్వయః

వీడిని నేను చంపనూ, చంపకూడదు. ఇతను బలి చక్రవర్తి కొడుకు. బలి చక్రవర్తి విరోచనుడి కొడుకు. విరోచనుడు ప్రహ్లాదుని కొడుకు. అందుకు వీడిని నేను చంపకూడదు. ప్రహ్లాదునికి నేను ఇదివరలో వరమిచ్చాను. "మీ వంశములో ఎవరినీ చంపను " అని.

దర్పోపశమనాయాస్య ప్రవృక్ణా బాహవో మయా
సూదితం చ బలం భూరి యచ్చ భారాయితం భువః

ఇతని గర్వాన్ని పోగొట్టడానికి ఇతని బాహువులను తెగ గొట్టాను. భూభారం అధికమవుతున్నదని ఇతని సైన్యాన్ని చంపాను

చత్వారోऽస్య భుజాః శిష్టా భవిష్యత్యజరామరః
పార్షదముఖ్యో భవతో న కుతశ్చిద్భయోऽసురః

ఇతనికి ఈ నాలుగు బాహువులూ  ఇలాగే ఉంటాయి. ఇతను ఇప్పటినుంచీ నీ గణాలలో ఒకడు. అతనికి ఆపదలేదు

ఇతి లబ్ధ్వాభయం కృష్ణం ప్రణమ్య శిరసాసురః
ప్రాద్యుమ్నిం రథమారోప్య సవధ్వో సముపానయత్

ఇలా అభయమిచ్చిన తరువాత బాణాసురుడు కృష్ణ పరమాత్మకు తల వంచి నమస్కరించి ప్రార్థన చేసాడు. అనిరుద్ధున్ని ఉషతో కలిపి రథం మీద కూర్చోబెట్టి కట్నకానుకలిచ్చి  నగరానికి సాగనంపాడు

అక్షౌహిణ్యా పరివృతం సువాసఃసమలఙ్కృతమ్
సపత్నీకం పురస్కృత్య యయౌ రుద్రానుమోదితః

రుద్రుని యొక్క ఆమోదాన్ని పొంది అందరూ వెళ్ళిపోయారు.

స్వరాజధానీం సమలఙ్కృతాం ధ్వజైః
సతోరణైరుక్షితమార్గచత్వరామ్
వివేశ శఙ్ఖానకదున్దుభిస్వనైర్
అభ్యుద్యతః పౌరసుహృద్ద్విజాతిభిః

మంగళ వాద్యాలతో శంఖ దుందుభి నినాదములతో పౌరులూ మిత్రులూ బ్రాహ్మణోత్తములు స్వాగతం చెబుతుంటే ఉషను తీసుకుని తన రాజధానికి బయలుదేరాడు

య ఏవం కృష్ణవిజయం శఙ్కరేణ చ సంయుగమ్
సంస్మరేత్ప్రాతరుత్థాయ న తస్య స్యాత్పరాజయః

ఈ శివ కేశవుల యుద్ధాన్నీ, విష్ణు విజయాన్నీ, బాణాసుర పరాభవాన్నీ ఎవరు చదువుతారో అలాంటి వారికి జీవితములో పరాజయముండదు.

                                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                           

Popular Posts