Followers

Thursday, 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బైయవ అధ్యాయం

                                                     

   ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బైయవ అధ్యాయం


ఈ అధ్యాయం పరమాత్మ యొక్క దిన చర్య. మనం ఎలా దినచర్య చేయాలో తెలుస్తుంది.
శ్రీశుక ఉవాచ
అథోషస్యుపవృత్తాయాం కుక్కుటాన్కూజతోऽశపన్
గృహీతకణ్ఠ్యః పతిభిర్మాధవ్యో విరహాతురాః

పొద్దున్నే పరమాత్మ బ్రాహ్మీ ముహూర్తములో కోడి కూత వినగానే అలా కూచిన కోళ్ళను తిట్టుకుంటారు ప్రియురాళ్ళు

వయాంస్యరోరువన్కృష్ణం బోధయన్తీవ వన్దినః
గాయత్స్వలిష్వనిద్రాణి మన్దారవనవాయుభిః

వంది మాగధులు స్వామిని స్తోత్రం చేస్తూ సుప్రభాతం పాడుతారు

ముహూర్తం తం తు వైదర్భీ నామృష్యదతిశోభనమ్
పరిరమ్భణవిశ్లేషాత్ప్రియబాహ్వన్తరం గతా

స్వామి యొక్క వక్షస్థలములో ఉన్న రుక్మిణీ అమ్మవారు ఆయన కౌగిలి వీడడం సహించలేక.
బ్రాహ్మీ ముహూర్తములో ఆచమనాదులు చేసి,  లేచి ధ్యానం చేస్తూ పరమాత్మను స్మరిస్తూ కాసేపు కూర్చున్నాడు

బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ వార్యుపస్పృశ్య మాధవః
దధ్యౌ ప్రసన్నకరణ ఆత్మానం తమసః పరమ్

ఏకం స్వయంజ్యోతిరనన్యమవ్యయం స్వసంస్థయా నిత్యనిరస్తకల్మషమ్
బ్రహ్మాఖ్యమస్యోద్భవనాశహేతుభిః స్వశక్తిభిర్లక్షితభావనిర్వృతిమ్

పరమాత్మను ఇలా ధ్యానం చేసి స్నాన కృత్యములు పూర్తి చేసుకుని కొత్త వస్త్రాలు ధరించి హోమము చేసుకుని పరబ్రహ్మను మౌనముగా జపం చేసి

అథాప్లుతోऽమ్భస్యమలే యథావిధి
క్రియాకలాపం పరిధాయ వాససీ
చకార సన్ధ్యోపగమాది సత్తమో
హుతానలో బ్రహ్మ జజాప వాగ్యతః


ఉపస్థాయార్కముద్యన్తం తర్పయిత్వాత్మనః కలాః
దేవానృషీన్పితౄన్వృద్ధాన్విప్రానభ్యర్చ్య చాత్మవాన్

సూర్యోపస్థానముని చేసి తర్పణం చేసి దేవతలు ఋషులనూ పితృదేవతలనూ వృద్ధులనూ పూజించి

ధేనూనాం రుక్మశృఙ్గీనాం సాధ్వీనాం మౌక్తికస్రజామ్
పయస్వినీనాం గృష్టీనాం సవత్సానాం సువాససామ్

గిట్టలకూ నూపురాలకు కొమ్ములకు బంగారమూ ముత్యాల ఆభ్రణాలు వేసి గోదానం చేసి

దదౌ రూప్యఖురాగ్రాణాం క్షౌమాజినతిలైః సహ
అలఙ్కృతేభ్యో విప్రేభ్యో బద్వం బద్వం దినే దినే

గోవిప్రదేవతావృద్ధ గురూన్భూతాని సర్వశః
నమస్కృత్యాత్మసమ్భూతీర్మఙ్గలాని సమస్పృశత్

ఆత్మానం భూషయామాస నరలోకవిభూషణమ్
వాసోభిర్భూషణైః స్వీయైర్దివ్యస్రగనులేపనైః

గోవులనూ బ్రాహ్మణులను దేవతలనూ వృద్ధులనూ దీనులనూ గురువులనూ నమస్కరించి సంభావించి నమస్కరించి మంగళాశాసనాన్ని చేసి, వారి చేత మంగళా శాసనాన్ని పొంది

అవేక్ష్యాజ్యం తథాదర్శం గోవృషద్విజదేవతాః
కామాంశ్చ సర్వవర్ణానాం పౌరాన్తఃపురచారిణామ్
ప్రదాప్య ప్రకృతీః కామైః ప్రతోష్య ప్రత్యనన్దత

సంవిభజ్యాగ్రతో విప్రాన్స్రక్తామ్బూలానులేపనైః
సుహృదః ప్రకృతీర్దారానుపాయుఙ్క్త తతః స్వయమ్

నేయిలో తన ముఖాన్ని చూచి తరువాత అద్దములో తన ముఖాన్ని చూచి ఎవరెవరు యాచకులుగా వచ్చారో వారి కోరికలు తీర్చి, అందరికీ అన్నీ ఇచ్చి సంతోషింపచేసి తాను కూడా సంతోషించి బ్రాహ్మణులకు పూలమాలలూ గంధములూ తాంబూలములూ దానములూ ఇలాంటి వాటితో వారిని పూజించి మిత్రులనూ ప్రజలనూ మన్నించి, సూతుడు రథాన్ని తీసుకుని వస్తాడు

తావత్సూత ఉపానీయ స్యన్దనం పరమాద్భుతమ్
సుగ్రీవాద్యైర్హయైర్యుక్తం ప్రణమ్యావస్థితోऽగ్రతః

గృహీత్వా పాణినా పాణీ సారథేస్తమథారుహత్
సాత్యక్యుద్ధవసంయుక్తః పూర్వాద్రిమివ భాస్కరః

అది తీసుకుని చైద్య సుగ్రీవాది రథాలు పూంచబడిన రథానికి నమస్కారం చేసి సారధి చేతిన్ పట్టుకుని రథాన్ని ఎక్కాడు. ఒకడు సాత్యకి తమ్ముడు, ఒకడు ఉద్ధవుడు. వీరితో కలసి సూర్యభగవానుడిలా ప్రకాశిస్తూ అంతఃపుర స్త్రీలతో అనురాగముతో చూడబడుతూ నవ్వుతో చూచేవారి మనసును హరిస్తూ అతికష్టం మీద వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు

ఈక్షితోऽన్తఃపురస్త్రీణాం సవ్రీడప్రేమవీక్షితైః
కృచ్ఛ్రాద్విసృష్టో నిరగాజ్జాతహాసో హరన్మనః

సుధర్మాఖ్యాం సభాం సర్వైర్వృష్ణిభిః పరివారితః
ప్రావిశద్యన్నివిష్టానాం న సన్త్యఙ్గ షడూర్మయః

తత్రోపవిస్తః పరమాసనే విభుర్బభౌ స్వభాసా కకుభోऽవభాసయన్
వృతో నృసింహైర్యదుభిర్యదూత్తమో యథోడురాజో దివి తారకాగణైః

సుధర్మ అనే సభకు చేరి అక్కడ కూర్చుంటే ఆరు ఊర్ములూ ఉండవు (ఆకలీ దప్పీ శొక మోహమూ జరా మరణమూ) ఈ ఆరూ ఆ సభలో కూర్చున్నవారికి రావు.
స్వామి తన కాంతితో సింహాసనాన్నీ సభనూ ప్రకాశింపచేస్తూ ఉత్తములైన యాదవులతో కలసి చంద్రుడు నక్షత్రాలతో ప్రకాశిస్తున్నట్లుగా ఈయనా ప్రకాశించాడు
సభలో కొందరు హాస్య కథలూ కొందరు నాట్యములూ గానములూ మరి కొందరు మృదంగాది నాదములతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ స్తోత్రం చేస్తూ

తత్రోపమన్త్రిణో రాజన్నానాహాస్యరసైర్విభుమ్
ఉపతస్థుర్నటాచార్యా నర్తక్యస్తాణ్డవైః పృథక్

మృదఙ్గవీణామురజ వేణుతాలదరస్వనైః
ననృతుర్జగుస్తుష్టువుశ్చ సూతమాగధవన్దినః

తత్రాహుర్బ్రాహ్మణాః కేచిదాసీనా బ్రహ్మవాదినః
పూర్వేషాం పుణ్యయశసాం రాజ్ఞాం చాకథయన్కథాః

కొందరు బ్రాహ్మణులు ఇంతకంటే పూర్వములో ఉన్న రాజులు ఆచరించిన పుణ్య చరితములని వినిపించారు.

తత్రైకః పురుషో రాజన్నాగతోऽపూర్వదర్శనః
విజ్ఞాపితో భగవతే ప్రతీహారైః ప్రవేశితః

ఇలా అందరూ ఆయా పనులు చేస్తూ ఉంటే ఒక కొత్తవాడు సభలోకి వచ్చి కృష్ణునికి నమస్కరించి జరాసంధుడు ఒక ఇరవై నాలుగు వేల మంది రాజులను బంధించాడు. వారు పడుతున్న బాధలను వివరించి చెప్పాడు.

స నమస్కృత్య కృష్ణాయ పరేశాయ కృతాఞ్జలిః
రాజ్ఞామావేదయద్దుఃఖం జరాసన్ధనిరోధజమ్

యే చ దిగ్విజయే తస్య సన్నతిం న యయుర్నృపాః
ప్రసహ్య రుద్ధాస్తేనాసన్నయుతే ద్వే గిరివ్రజే

వారి వాక్కు ఆ దూత ఇలా చెప్పాడు

రాజాన ఊచుః
కృష్ణ కృష్ణాప్రమేయాత్మన్ప్రపన్నభయభఞ్జన
వయం త్వాం శరణం యామో భవభీతాః పృథగ్ధియః

మాకు సంసారమన్నా జరాసంధుడన్నా భయము. మేము మిమ్ము శరణు వేడుతున్నాము

లోకో వికర్మనిరతః కుశలే ప్రమత్తః
కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే
యస్తావదస్య బలవానిహ జీవితాశాం
సద్యశ్ఛినత్త్యనిమిషాయ నమోऽస్తు తస్మై

ఈ లోకము వికర్మ (దుష్ట కర్మ - చేయకూడని పని చేయడములో ఆసక్తిగా ఉంది, తనకు క్షేమం కలిగించుకోవడములో అజాగ్రత్తగా ఉంది.) నీవు చెప్పినటువంటి నీ ఆరాధనా రూపకమైన ఉత్తమ కర్మను ఆచరించడం మానేసింది. ఇన్ని చేసినా ప్రాణులకు జీవితాశ బలీయమైనది. దాన్ని కూడ తొలగించి మోక్షమివ్వగలది నీ పాద సేవమాత్రమే. ఈజగత్తుకు నీవే సూర్యుడవు. నీ కలతో అవతరించావు. దుష్టులను శిక్షించడానికీ సజ్జనులను రక్షించడానికి

లోకే భవాఞ్జగదినః కలయావతీర్ణః
సద్రక్షణాయ ఖలనిగ్రహణాయ చాన్యః
కశ్చిత్త్వదీయమతియాతి నిదేశమీశ
కిం వా జనః స్వకృతమృచ్ఛతి తన్న విద్మః

ఎవడూ నీ ఆజ్ఞ్యను దిక్కరించలేడు. నీ ఆజ్ఞ్యను కాదని మానవుడు తానుగా ఏది పొందగలడొ మాకు తెలియదు.

స్వప్నాయితం నృపసుఖం పరతన్త్రమీశ
శశ్వద్భయేన మృతకేన ధురం వహామః
హిత్వా తదాత్మని సుఖం త్వదనీహలభ్యం
క్లిశ్యామహేऽతికృపణాస్తవ మాయయేహ

మాకు రాజ సుఖం కలలో మాట ఐపోయింది. పరాధీనతలో ఉన్నాము. జీవచ్చవముగా బతుకుతున్నాము. నీమాయతో దీనులమైపోతున్నాము. చాలా కష్టపడుతున్నము

తన్నో భవాన్ప్రణతశోకహరాఙ్ఘ్రియుగ్మో
బద్ధాన్వియుఙ్క్ష్వ మగధాహ్వయకర్మపాశాత్
యో భూభుజోऽయుతమతఙ్గజవీర్యమేకో
బిభ్రద్రురోధ భవనే మృగరాడివావీః

ఆశ్రయించిన వారి శోకాన్ని తొలగించగల పాదములు గల మహానుభావా, జరాసంధుడనే పాశముతో బంధించబడ్డాము. పదివేల మంది రాజులను సింహం ఇతర మృగాలని బంధించింట్లుగా బంధించాడు.

యో వై త్వయా ద్వినవకృత్వ ఉదాత్తచక్ర
భగ్నో మృధే ఖలు భవన్తమనన్తవీర్యమ్
జిత్వా నృలోకనిరతం సకృదూఢదర్పో
యుష్మత్ప్రజా రుజతి నోऽజిత తద్విధేహి

మమ్ము నీవే విడిపించాలి.ఇది  వరలో వాడిన్ పదిహేడు సార్లు ఓడించగలిగావు.ఇపుడూ ఓడించి అతని నుండి మమ్ము విడిపించు. నీ ప్రజలు దుఃఖించకుండా ఉండడానికి చేయవలసిన పని చేయి

దూత ఉవాచ
ఇతి మాగధసంరుద్ధా భవద్దర్శనకఙ్క్షిణః
ప్రపన్నాః పాదమూలం తే దీనానాం శం విధీయతామ్

ఇలా వారు నిన్ను శరణు వేడారు వారికి శుభమును కలిగించవలసింది అని ప్రార్థిస్తుంటే

శ్రీశుక ఉవాచ
రాజదూతే బ్రువత్యేవం దేవర్షిః పరమద్యుతిః
బిభ్రత్పిఙ్గజటాభారం ప్రాదురాసీద్యథా రవిః

నారదుడు స్వయముగా వచ్చాడు. ఆయనకు స్వాగతాది పూజలు సలపి

తం దృష్ట్వా భగవాన్కృష్ణః సర్వలోకేశ్వరేశ్వరః
వవన్ద ఉత్థితః శీర్ష్ణా ససభ్యః సానుగో ముదా

సభాజయిత్వా విధివత్కృతాసనపరిగ్రహమ్
బభాషే సునృతైర్వాక్యైః శ్రద్ధయా తర్పయన్మునిమ్

నారదా మూడు లోకాలూ బాగున్నాయా,  నీకు తెలియనిది ఏదీ ఉండదు కదా. పాండవులు బాగున్నారా, ఏమి చేయాలనుకుంటున్నారు అని ప్రార్థించగా

అపి స్విదద్య లోకానాం త్రయాణామకుతోభయమ్
నను భూయాన్భగవతో లోకాన్పర్యటతో గుణః

న హి తేऽవిదితం కిఞ్చిల్లోకేష్వీశ్వరకర్తృషు
అథ పృచ్ఛామహే యుష్మాన్పాణ్డవానాం చికీర్షితమ్

శ్రీనారద ఉవాచ
దృష్టా మాయా తే బహుశో దురత్యయా మాయా విభో విశ్వసృజశ్చ మాయినః
భూతేషు భూమంశ్చరతః స్వశక్తిభిర్వహ్నేరివ చ్ఛన్నరుచో న మేऽద్భుతమ్

అపుడు నారదుడు, స్వామీ, నేను నీ మాయను చూచాను, నీ సృష్టిలోని ప్రజాపతుల మాయను కూడా చూచాను, సకల చరాచార జగత్తులో నీ సంచారం, అగ్నికి ఎలా కప్పులేదో, అలాంటి నీమాయను చూచాను. నీవేమి చేయాలనుకుంటున్నావో అది ఎవరు  తెలుసుకుంటారు. సృష్టిస్తున్నావు రక్షిస్తున్నావు నిగ్రహిస్తున్నావు. నీ మాయను ఎవరూ తెలుసుకోలేరు. లేనిది ఉన్నట్లుగా చూపుతావు ఉన్నదాన్ని లేనట్లుగా చూపుతావు. అలాంటి నీకు నమస్కారం. సంసారములో ఉన్నవారిని విడిపించడానికి నీ కీర్తి అనే దీపం వెలిగించావు, నిన్ను  ఆశ్రయించినవారి అజ్ఞ్యానం అనే చీకట్ని తొలగించడానికి

తవేహితం కోऽర్హతి సాధు వేదితుం స్వమాయయేదం సృజతో నియచ్ఛతః
యద్విద్యమానాత్మతయావభాసతే తస్మై నమస్తే స్వవిలక్షణాత్మనే

జీవస్య యః సంసరతో విమోక్షణం న జానతోऽనర్థవహాచ్ఛరీరతః
లీలావతారైః స్వయశః ప్రదీపకం ప్రాజ్వాలయత్త్వా తమహం ప్రపద్యే

ఐనా అడిగావు కాబట్టి చెబుతున్నాను

అథాప్యాశ్రావయే బ్రహ్మ నరలోకవిడమ్బనమ్
రాజ్ఞః పైతృష్వస్రేయస్య భక్తస్య చ చికీర్షితమ్

నీ మేనత్తకొడుకు ధర్మ రాజు రాజ సూయ యాగం చేయాలనుకుంటున్నాడు.. తదవారా నిన్ను ఆరాధించి చక్రవర్తిత్వాన్ని పొందాలనుకుంటున్నాడు. దాన్ని మీరు ఆమోదించండి

యక్ష్యతి త్వాం మఖేన్ద్రేణ రాజసూయేన పాణ్డవః
పారమేష్ఠ్యకామో నృపతిస్తద్భవాననుమోదతామ్

తస్మిన్దేవ క్రతువరే భవన్తం వై సురాదయః
దిదృక్షవః సమేష్యన్తి రాజానశ్చ యశస్వినః

శ్రవణాత్కీర్తనాద్ధ్యానాత్పూయన్తేऽన్తేవసాయినః
తవ బ్రహ్మమయస్యేశ కిముతేక్షాభిమర్శినః

అప్పటి కాలములో యజ్ఞ్యం చేస్తే పూర్ణాహుతికి దేవతలందరూ స్వయముగా వచ్చి తీసుకునేవారు. ఆ దేవతలని చూడడానికి అందరూ వచ్చేవారు . ఇపుడు దేవతలే నిన్ను చూడడానికి యజ్ఞ్యానికి వస్తారు. నీవు దగ్గర ఉండి బావమరిదుల కోరికలూ దేవతల కోరికలూ తీర్చాలి.

యస్యామలం దివి యశః ప్రథితం రసాయాం
భూమౌ చ తే భువనమఙ్గల దిగ్వితానమ్
మన్దాకినీతి దివి భోగవతీతి చాధో
గఙ్గేతి చేహ చరణామ్బు పునాతి విశ్వమ్

దేవతలూ రాజులూ నిన్ను చూడడానికి వస్తారు. నీ పేరు విన్నా అన్నా ధ్యానం చేసినా నీకు దూరముగా ఉండేవారైనా అన్ని పాపాలూ తొలగించుకుంటారు. అలాంటిది నిన్ను ఎదురుగా చూచి స్పృశించినవారి భాగ్యమేమని చెప్పలి. భూలోక రసాతలపాతాళ లోకములో ఉంది. భూలోకములో గంగగా దేవలోకములో మందాకినిగా పాతాళములో భోగవతీ గా నీ కీర్తిని విస్తరింపచేస్తోంది. కాబట్టి నీ వారందినీ నీవు అనుగ్రహించు
సకల లోకాన్ని గెలిచి చక్రవర్తిత్వాన్ని కోరుతున్న ధర్మరాజుని అనుగ్రహించు

శ్రీశుక ఉవాచ
తత్ర తేష్వాత్మపక్షేష్వ గృణత్సు విజిగీషయా
వాచః పేశైః స్మయన్భృత్యముద్ధవం ప్రాహ కేశవః

ఈ మాట విన్న స్వామి మంత్రి ఐన ఉద్ధవునితో ఇలా మెలమెల్లగా అంటున్నాడు

శ్రీభగవానువాచ
త్వం హి నః పరమం చక్షుః సుహృన్మన్త్రార్థతత్త్వవిత్
అథాత్ర బ్రూహ్యనుష్ఠేయం శ్రద్దధ్మః కరవామ తత్

ఉద్ధవా నీవే మాకు ఉత్తమ నేత్రం మిత్రుడివి, ఏమి చేయాలో చెప్పేవాడివి, ఇపుడు ఏమి చేయాలో చెప్పు

ఇత్యుపామన్త్రితో భర్త్రా సర్వజ్ఞేనాపి ముగ్ధవత్
నిదేశం శిరసాధాయ ఉద్ధవః ప్రత్యభాషత

జరాసంధుని వధించమని అంతమంది రాజులూ పంపారు. ధర్మరాజు రాజసూయం చేస్తున్నాను రమ్మని చెప్పాడు. ఏది చేస్తే బాగుంటుందో మంత్రివైన నీవు చెప్పు అని స్వామి సర్వజ్ఞ్యుడైనా ఎదుటివారిని మోహింపచేస్తూ మాట్లాడితే  ఆజ్ఞ్యను శిరసా వహించి ఉద్ధవుడు సమాధానం చెబుతున్నాడు

                                                        సర్వం శ్రీకృష్ణార్పణ్మస్తు

Popular Posts