Followers

Tuesday, 30 April 2013

గణపతి మొదట గ్రామదేవత ....(Lord Ganesha)




 గణపతి మొదట గ్రామదేవత అంటే నమ్మశక్యంగా లేదు కదూ! పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ లాంటి గ్రామ దేవతల పేర్లు మనకు చిరపరిచితం. కానీ వినాయకుడు కూడా ఒకప్పుడు గ్రామదేవత. ఇది నిజమని చెప్పే కధనాలు, స్తోత్రాలు ఉన్నాయి.

మొదట పాళెగార్లుగా ప్రజల్ని కొల్లగొట్టినవారే, క్రమంగా రాజులు, చక్రవర్తులుగా మారిన దాఖలాలు ఎన్నో చరిత్రలో ఉన్నాయి. అలా గణపతిని మొదట ఆటవిక జాతులు "గణ నాయకుడి"గా కొలిచి ఉంటారు. మహా గణపతి సహస్ర నామంలో ఉన్న"ప్రతి గ్రామాధి దేవతా" అనే నామం ఇందుకు తార్కాణం. ఒక దశలో గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆరాధించేవారు.


కాలక్రమంలో వినాయకుడు అందరికీ ఆరాధ్య దేవుడయ్యాడు. ఇలా జరిగి కూడా వేల వేల సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు గణపతి విగ్రహం లేని పూజామందిరం వుండదు. గణేశుని పూజించకుండా ఏ పనీ ప్రారంభించరు. అలాగే గణపతి మొదట విఘ్నకారి. తర్వాతికాలంలో విఘ్న నాశకుడు అయ్యాడు. అంటే వినాయకునిలో రెండు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. గణపతి అంటే ప్రజలకు భక్తితోబాటు భయమూ ఉంది.


ఇంటి గుమ్మం మొదలు, పూజామందిరం వరకూ గణేశుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ముందుగా వినాయకుని పూజిస్తారు. ఆఖరికి హిందూ మతాన్ని ద్వేషించిన ఔరంగజేబు పూనా దగ్గర్లో ఉన్న వినాయకుని దేవాలయానికి మాన్యాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే, గణపయ్య ప్రభావం ఎంతటిదో చూడండి. గణేశుని పట్ల ఇతర మతస్తులకు కూడా భక్తి భావం కలుగుతుంది.


ఏ ఏ రోజులలో అభ్యంగనస్నానం చేయకూడదో చెబుతారా?




 శ్రాద్ధ దినములయందు , ఆది ,  మంగళ  వారములు 

పాడ్యమి , చవితి , షష్టి ,  అష్టమి , నవమి , చతుర్దశి  

తిధులందు  అభ్యంగనస్నానం చేయకూడదని  

శుకమహర్షి  తెలియజేశారు. ఆ తిధులలో   అభ్యంగన 

స్నానం చేసిన  గ్రహ , నక్షత్ర ప్రభావం వల్ల  అనారోగ్య , 

ఈతి భాదలోస్తాయి.

తల్లి , తండ్రి గొప్పతనం గురించి శాస్రాలలో ఏం చెప్పబడింది?



  • ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.
  • ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి.
  • ఒక్కసారి తల్లికి , తండ్రికి నమస్కరించిన , గోవును దానం చేసిన ఫలం వచ్చును.
  • సత్యం తల్లి......తండ్రి జ్ఞానము.
  • పదిమంది ఉపాధ్యాయుల కంటే  ఆచార్యుడు గొప్పవాడు. వంద మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే  ఆరు సార్లు భూప్రదక్షిణ  చేసిన ఫలము , వెయ్యి సార్లు కాశి యాత్ర చేసిన ఫలము , వంద సార్లు సముద్ర స్నానము చేసిన ఫలం దక్కుతాయి.
  • ఏ పుత్రుడు , ఏ పుత్రిక మాతృ దేవతను సుఖంగా ఉంచరో , సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసం కన్నా  హీనమని వేదం చెబుతోంది.
  • ఎంతటి  శాపానికైన నివృత్తి ఉంది.  కన్నతల్లి కంట నీరు  తెప్పించితే  దానికి లక్ష గోవులు దానిమిచ్చిన,  వేయికి పైగా అశ్వమేధ యాగాలు చేసిన పోదు.
  • తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని  అసహ్యించుకున్న  తప్పులేదు.  చెడు నడతతో   ఉన్న తల్లిని  నిరాదరించిన ఆది తప్పేనని ధర్మ శాస్రం చెప్తోంది.  తల్లిని మించిన దైవం లేదు. గాయత్రికి మించిన మంత్రం లేదు. 

Monday, 29 April 2013

చతుర్విద దానాలు అంటే ఏమిటి?




చావు భయంతో  భీతిల్లే వాడికి  ప్రాణ అభయం 



ఇవ్వటం , రోగాలతో రోప్పులతో నరక యాతన పడే 



వాడికి వైద్యం చేయటం , పేదవారికి  ఉచిత విద్యను 



అందించటము.










    క్షుద్భాదతో  అల్లాడే వానికి అన్నదానం చెయ్యటం 

ఇవే చతుర్విద దానాలు. ఈ దానాలు చేసిన వారికి 

పూర్వ జన్మ పాపాలు నశించి , ఈ జన్మలోనే 

సుఖిస్తారు.

Sunday, 28 April 2013

శంఖం పూరించటమంటే ఏమిటి?




గృహ ఆవరణలోని దుష్టశక్తులు  దూరంగా 

పారిపోతాయి. ఆరు నెలలు  పురాణ శ్రవణము వలన 

కలిగిన ఫలం ఒక్కసారి శంఖం  పూరించినంతనే 

కలుగుతుంది.

మహాపుణ్యాతిదిపుణ్య పుజాదికార్యలేవి ?



  •  పాడ్యమి నాడు విష్ణు మూర్తికి  ఘ్రుత స్నానం చేసినవారి  ఇరువది ఒక్క తరములను  తరించి విష్ణులోకాన్ని చేరతారు.
  •  బ్రహ్మదేవునకు నేయితో ,  పాలతో స్నానం చేయించినవారు  బంగారు విమానంలో  బ్రహ్మలోకాన్ని చేరతారు.
  • చెరకు రసంతో  స్నానం  చేయించిన వారు  ప్రకాశమైన సుర్యలోకాన్ని చేరతారు.
  • గంధపు నీటితో గానీ ,  చందనపు నీటితోగాని  అభిషేకించినవారు  బంగారు వన్నె కాంతితో రుద్రలోకాన్ని చేరతారు.
  • పరిశుద్దమైన జలంతో గాయత్రి మంత్రమును  వంద పర్యాయములు జపించి బ్రహ్మదేవునకు అభిషేకించిన  వారు సులభముగా బ్రహ్మలోకాన్ని పొందుతారు.     

కులాలేందుకు ఏర్పరిచారు?




రక్తానికి కులం లేదు. దేహానికి కులం లేదు. ఆత్మకు, 

శరీరంలోని అవయవాలకు  కులం లేదు. మానవ 

జీవన విధానం నడుచుకోనుటకు  వృత్తి  నిమితం 

పెట్టిన పేర్లే నేటి కులములని శుక్లయజుర్వేదం 

చెబుతుంది.

త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు లింగరూపంలో ఎందుకు వుంటాడు ?



  
బృగుమహర్షి   శాపం వల్ల పరమేశ్వరుడు  

లింగరూపంలో వుంటాడు. లింగానికి పుజిస్తేనే 

ఫలమెక్కువ.  శివలింగానికి  మడి, ఆచారము, శుద్ధి 

ఉండవు. అందుకే శివ సన్నిధికి  ఎలా అయిన 

వెళ్ళవచ్చు.  విష్ణు ఆలయానికి  మాత్రం అత్యంత  

శుభ్రంగా వెళ్ళాలి.  లేదంటే  శ్రీమహావిష్ణువు 

ఊరుకున్న  లక్ష్మిదేవి సహించదు.

హఠయోగంలో ఆసనాలు ఒక భాగం.

ఆసనాలు: ప్రస్తుత కాలంలో యోగ పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం.


పతంజలి మహర్షి ఏనాడూ యోగాసనాలు పాటించాలని ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం విశ్రాంతిగా, స్థిరంగా కూర్చునే ఆసనాన్ని మాత్రమే సూచించారు పతంజలి. పద్మాసనం కూడా అనుమతించారు. ఆసనాలతో శరీరంలోని భౌతికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు కాని, అత్యున్నతమైన సమాధిస్థితిని చేరుకోవడానికి యిది ప్రామాణికం కాదు.
ప్రాణాయామం: హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి, పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్పలేదో, అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాసక్రియ చేయడం వల్ల ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వ్ధృది చేస్తుంది. అనునిత్యం సాధనం చేయడం వల్ల మాత్రమే యిది సాధ్యపడుతుంది.


ప్రత్యాహర: ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహర. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం వాంఛల నియంత్రణ, వైరాగ్యం పెంపొందించుకోవడం, ధర్మశ్త్రాసాల్లో చెప్పినట్లు నడుచుకోవడమే కాదు. నిరంతర ఏకాగ్రత సాధనతో జాగ్రదావస్థని దాటివుండటం. మెదడుని అదుపులో ఉంచడానికి నిరంతరం హృదయం, ఇంద్రియాలు ప్ర్నయతిస్తుంటాయి. వాటిని జయించడానికి పైనచెప్పినట్లు నిరంతర సాధన, ఏకాగ్రత అవసరం.


ధారణ: సాధనలో పై అయిదు దశలు దాటాక, శరీరం, శ్వాసక్రియ, మనసు సాధకుడి అదుపులోకి వస్తాయి. ఇప్పుడు ఏకాగ్రతపై దృష్టి నిలపాలి. సాధకుడు ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, ఓ నిరిద్దష్టమైన వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రతి రోజూ యిలా సాధన చేయడం వల్ల సాధకుడు ఏకాగ్రతలో ఓ ఉన్న్థతసితిని చేరుకుంటాడు.

ధ్యానం: ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేయడానికి ధ్యానాన్ని మించినది లేదు. ధ్యానంలో ఒక వస్తువుపై దృష్టి నిలిపినప్పుడు, క్రమేపీ ఆలోచనలు అంతరిస్తాయి. తనకి, ఎదురుగా వున వస్తువుకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశలో ఇంద్రియాలు, మనసు కూడా ఆ ్తవసువు వైపే లగ్నమవుతాయి. ఏకాగ్రత అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇదొక అత్యున్నత స్థితి. ఈ స్థితికి చేరుకున్నాక సమస్యలను అర్ధం చేసుకోవడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా గోచరిస్తాయి.


సమాధి: ధ్యానానికి, యోగకి యిదే పతాకస్థాయి. సాధకుడు తను అనే అహాన్ని మరిచి, ఏ శక్తిని/వస్తువుని తన దృష్టి లగ్నంగా చేసుకున్నాడో ఆ శక్తి, తాను ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు. హద్దులన్నింటిని దాటుకుని, ఈ ఉన్నతస్థితికి చేరుకున్న వ్యక్తిని ‘యోగి’ అంటారు. సమాధి స్థితికి చేరుకున్న సాధకుడు ప్రకృతిని అర్ధం చేసుకోవడమే కాదు, స్పర్శించగలడు, ప్రకృతిలోని ప్రతి అణువుతోనూ అనుభూతి చెందగలడు. ఈ అపూర్వ శక్తితోనే వేద ఋషులు కంప్యూటర్ల వంటి సాంకేతిక సహకారం లేని కాలంలోనే నాలుగు లక్షల సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వస్తాయని, అదే యుగాంతమని కనుగొన్నారు.

యోగ సాధనతో వ్యాధులు దూరం !

పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి.


ఎనిమిది విధానాలు:
యమ: ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ వుండాలి.
ఆ అయిదు అంశాలు:
1. అహింస
2. సత్యం
3. బ్రహ్మచర్యం
4. దొంగతనానికి పాల్పడకపోవడం
5. కోరికలను అదుపులో ఉంచుకోవడం



ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు.
నియమాలు: యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి వుంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా వుండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి వుండాలి. వాంఛలు అదుపులో వుండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి వుండాలి. పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-
1. పరిశుభ్రత
2. సంతృప్తి
3. సంయమం
4. ధర్మశాస్త్రాల అధ్యయనం
5. ప్రతి చర్యను భగవత్‌ అర్పితం చేయడం
ఈ అయిదు నియమాలను పాటించడంతో సాధకుడికి మానసికంగా, శారీరకంగా ప్రయోజనం చేకూరుతుంది.




యోగానికి అష్టాంగాలు (ఎనిమిది సాధనాలు) ఉన్నాయి.


యోగం అనే మాటకు ఆసన, ప్రాణాయామాలు అనే కొత్త అర్థం మాత్రమే ఈనాడు స్థిరపడిపోయింది. యోగానికి అష్టాంగాలు (ఎనిమిది సాధనాలు) ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి.       

యోగం అనే మాటకు కలయిక అని అర్థం. ‘జీవాత్మ పరమాత్మతో కలిసే ప్రక్రియనే యోగం అంటారు’ అని యాజ్ఞవల్క్యుడు మొదలైన మహర్షులు తెలిపారు. జీవాత్మ తనకున్న జీవలక్షణాన్ని వదిలిపెట్టి పరమాత్మలో ఐక్యం చెందే మహోన్నతిస్థితి యోగం.
యోగసాధన అత్యున్నతమైనదని మహర్షులు చెప్పారు. ఎన్నో వికారాలతో కూడిన మనసును సాధన ద్వారా లొంగదీసి, చిత్తమాలిన్యాలను తొలగించి, ఆత్మానందం పొందడమే యోగం. అయితే యోగం అనే మాటకు ఆసన, ప్రాణాయామాలు అనే కొత్త అర్థం మాత్రమే ఈనాడు స్థిరపడిపోయింది. యోగానికి అష్టాంగాలు (ఎనిమిది సాధనాలు) ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ యోగాంగాలు పతంజలి, యాజ్ఞవల్క్యుడు, ఘేరండ, శివసంహితలు చెప్పాయి. ఇవి నేర్చుకోవడంలో లేదా సాధన చేయడంలో గొప్ప ప్రయోజనం ఉంది. 

మానవుడు శరీరం ద్వారా యోగసాధన చేసి భగవంతుణ్ని పొందాలి. ఆత్మ పరమాత్మోపాసన చేయాలన్నా శరీరమే దానికి సాధనం. శరీర సాధన చేయాలంటే ఆ శరీరాన్ని స్థిరం చేసి, దాన్ని ఆశ్ర యించి ఉన్న మనసును నిశ్చలం చేయాలంటే దానికి మొదట సాధన కావాలి. అందుకే యోగసాధన కన్నా ముందు అష్టాంగయోగం ప్రవేశపెట్టారు ఋషులు. యమ నియమాలు మనిషికి... వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను, సత్ప్రవర్తనను కలుగచేస్తాయి. ఆసన, ప్రాణాయామాలు శరీరాన్ని సాధన కోసం లొంగదీస్తాయి. ప్రాణాయామం ప్రాణశక్తిని ఇచ్చి, లోపల ఉన్న శారీరక మాలిన్యాలను బయటకు పంపిస్తుంది. తద్వారా నాడీ శుద్ధి, శరీర శుద్ధి జరిగి తరవాత చేసే సాధనకు మనసును, చిత్తాన్ని స్వాధీనపరచి, సిద్ధం చేస్తుంది.
ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అంగాలు వ్యక్తి ఆత్మోన్నతికి కావలసిన లక్షణాలను అందిస్తాయి. అయితే ఈ అష్టాంగసాధన తరవాత చేసే సాధన, ఈ సాధన పరమప్రయోజనాన్ని వదిలిపెట్టి కేవలం ఆరోగ్యం కోసం ఆసన, ప్రాణాయామాలను సాధన చేస్తూ, దానికే యోగా అన్న పేరును పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఋష్యాశ్రమాలో, యోగాపీఠాల్లో ఉచితంగా నేర్చుకోవాల్సిన యోగం వ్యాపార వస్తువుగా మారడం ఆశ్చర్యం.                 

Saturday, 27 April 2013

జపం తర్వాత ఎంత నిగ్రహంగా వుండాలి?





జపవిధి  అయ్యాక,  వారిలో ఓ అపూర్వ శక్తి వస్తుంది. 

వాక్కు సత్యమవుతుంది. జపం చేసిన తర్వాత  పలికే 

మాటలను ఎంతో వివేకంతో పలికితే మంచిది. చెడు 

పలకటం ద్వారా  వచ్చిన జపసిద్ది  పోవటమే కాక  

పలికిన చెడు మాటలు భవిష్యత్తులో  యధార్థాలు  

అవుతాయి. మంచి మాటలు మాట్లాడితే  మనసు 

మంచిగా  ఉండటమే కాకుండా  మంచి జరుగుతుంది.

పూర్వకాలంలో తుఫాను వంటి ఉపద్రవలోస్తాయని ఎలా కనిపెట్టేవారు?



  • తేనెపట్టు లోని తేనెటీగలు  బయటి  కొచ్చి  ఝంకారనాదాలు  పెడుతుంటాయి.
  • పావురాళ్ళు గమ్యం లేకుండా తిరుగుతూ అలజడిగా అరుస్తుంటాయి.
  • కుక్కలు చెవులు విప్పార్చి  ఒకింత భయంతో  తుఫాను దిశగా  చూస్తాయి.
  • అడవిలోని ఏనుగులు  గుంపులు గుంపులుగా అటు ఇటు పరిగెడుతుంటాయి.
  •  కొన్ని జంతువులు  ఆహారం కోసం బయటికి రాకుండా లోపలే ఉండిపోతాయి.
  • ఆవులు, మేకలు వర్షపు రాకను  పసిగట్టి ఎప్పటిలాకాక  విరుద్దంగా  అరుస్తాయి.  

తిరుమల స్వామిని దర్శించేటప్పుడు బ్రహ్మ నాడిని దర్శించాలంటారు? అది ఎలా?



సప్తగిరి వాసుని  దర్శనానికి  వెళ్ళినప్పుడు  కనులు  

మూసుకొని  ధ్యానించకుండా చుడగలిగినంతసేపు  

స్వామినే చూస్తూ కదలండి. శ్రీ  వెంకటేశ్వర స్వామివారి 

విగ్రహనోసటి  కుడి పక్కన నామం కింద సూర్యనాడి,  

ఎడమ పక్క నున్న నామం కింద బ్రహ్మనాడి,  

మధ్యనుండే ఎర్రని నామమే  బ్రహ్మనాడి. ఈ 

బ్రహ్మనాడి యందె పరమాత్ముడున్నాడు.

చెప్పుల్ని బయట వదిలిరావాలని అంటారు. ఎందుకని?





రకరకాల  సమస్యలూ , ఆలోచనలు.... వాటి ప్రభావం 

మనసు మీద పడుతుంది.  

    అందుకనే దేవాలయాల్లోనూ ,  గృహాల్లోను చెప్పులు 
బయట వదిలి ,  అనగా అహాన్ని , కోపాన్ని , సమస్యలని వదిలి  లోపలికి   వెళ్ళాలని  పరమార్థం . దానికి తోడూ చెప్పులు లోపలికి  తేవటం ద్వారా వందలాది క్రిములు  ఆ పరిసరాల్లో స్ధిరనివాసం ఏర్పరచుకొని  అనారోగ్యం కలిగిస్తాయని కూడా. 

నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏ నియమాలు పాటించాలి?




ఉదయం  యువరాజులా తినాలి.

మధ్యాహన్నం   మహారాజులా  భుజించాలి.


రాత్రి చక్రవర్తిలా  ఆరగించాలి.

అన్నం తక్కువ పెట్టుకోవాలి. కూర ఎక్కువ 

పెట్టుకోవాలి. ఎక్కువసేపు నమలాలి.

పదిమంది మీ వద్దకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి?



ముందుగా వృద్దుడిని  పలకరించాలి.  తరువాత 

అందులో  జ్ఞానమున్నవారిని ,  చదువుకున్నవారిని 

పలకరించాలి.  ఆ తరువాత  దూరపు బంధువు ,   

ధనవంతుడినీ  పలకరించాలని  గౌతమ మహర్షి 

చెప్పాడు.

మన శరీరంలో విశుద్దిచక్రం ఎక్కడుంది?



మెడలో విశుద్దిచక్రం  ఉంటుంది. అక్కడ రెండు దళాలుంటాయి.   గంధం  మెడపై  రాయటం వల్ల అక్కడి  వేడిని గంధం  గ్రహించి విశుద్ది  చక్రాన్ని సక్రమంగా నడిపిస్తుంది.  శుభకార్యాలలో  రాసే  గంధం వెనుక  ఆధ్యాత్మికతతో  పాటు అనంతమైన  ఆరోగ్యం  దాగి ఉంది. గంధం  చెమటని  హరిస్తుంది.  చెమట పొక్కులు  రాకుండా నిరోదిస్తుంది  .     

నిద్రపోయేవారిని ఎలా లేపాలి?




పెద్దగా  అరిచి లేపకూడదు.  పడుకున్నవాన్ని   

కుదిపి   కుదిపి   లేపకూడదు.  ముందు మెల్లగా 

పిలిచి , ఆపై స్వరం పెంచి , నెమ్మదిగా చేయివేసి కదిపి  

లేపాలి. ఒంటరిగా నిద్రపోతున్నవారి విషయంలో 

మరింత జాగురూకత వహించాలి. 

       మనిషి నిద్రిస్తున్నప్పుడు  ఆత్మలోని అంశాలు  

కొన్ని బయటికి వెళుతుంటాయి అని అంటారు.  

అందుకే అనర్థాలు జరిగే అవకాశం ఉండటం వల్ల 

నిద్రలేపే విషయంలో , అదీ  అనారోగ్యంగా , పెద్ద 

వయసు ఉన్న వారి విషయంలో ఎంతో మెళుకువ  

చూపాలి. 

పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అని అంటారు గదా! అందులోని పరమార్థం ఏమిటి?




అనాదిగా  వస్తున్న  ఈ వాక్యాల్లో  ఎంతో పరమార్థం  దాగివుంది.  

పుణ్యమంటే  పూజ..... శ్రేష్టమైన  పువ్వులతో పూజ చేస్తే ముంచి 

పురుషుడు భర్తగా లభిస్తాడని, దానమనే  పుణ్యం వల్ల మంచి 

సంతానం కలుగుతుందని పరమార్థం. 

భోజనం చేస్తున్నపుడు ఎన్ని నీళ్ళు తాగాలి?




ఈ విషయమున ఆయుర్వేదం  నిక్కచ్చిగా  చెప్పింది.  

భోజనం ప్రారంబించిన  దగ్గర్నుంచి  పూర్తీ అయ్యేవరకు   

అరగ్లాసు  మాత్రమే తాగాలి.  భోజనం అయ్యాక  ఓ 

గంట తర్వాత  ఓ గ్లాసు  ఆపై తాగాలి.  ముద్దముద్దకి  

గ్లాసు నీరు తాగితే  శరీరంలోకి వెళ్ళిన  ఆహరం 

సాంబారులో  తేలే  ముక్కల్లా  జీర్ణం కాక మలబద్దక 

సమస్యలు, ఉదర వ్యాదులు వస్తాయి.

ఆడపిల్లను శుక్రవారం, కోడలిని శనివారం పంపకూడదా?






లక్ష్మి దేవి వంటి ఇంటి ఆడపడచును  శుక్రవారం 


పంపరు.  అదే కోడలిని శనివారం పుట్టింటికి  

పంపకపోవటానికి కారణం..... ఆ రోజులు 

పూజాదికాలు, హొమాలకు శుభప్రదమైన రోజు.  ఇంటి 

భాద్యత గల కోడలికి  కుటుంబపరమైన  

దైవకార్యలప్పుడు  తగిన ప్రాధాన్యత  ఇవ్వటం కోసమే  

శుక్ర, శనివారంలు పంపరు.

పూర్వకాలంలో దేవదాసీల ధర్మలేంటి?




పున్నములప్పుడు,  విశేషదినముల  అప్పుడు దైనిక  

కార్యక్రమాల్లో  నృత్యం చేసేవారు.  కొంత మంది 

రాజులు వారిని తమ గూఢచరులుగా  కూడా 

నియమించుకునేవారు.  వారి పని, దేవుణ్ణి భర్తగా  

కొలిచి దేవస్ధాన  కార్యక్రమాల్ని  చూడటంతో పాటు 

ధర్మకార్యాల్లో  పాలుపంచుకోవటం.  నృత్యగానాల వల్ల 

వారు ధనాన్ని  పొందేవారు. అంతేగాని మరొకలా 

కాదు.

Friday, 26 April 2013

గృహాలకు, వ్యాపార సంస్ధలకి కలబంద కట్టేది ఎందుకు?





కలబంద కలిమిని తెచ్చిపెడుతుంది. దుష్టశక్తుల్ని , 

నరదిష్టిని   ఆపి తనే అవహించుకొని , ఎంత కాలమైన 

పాడవ్వదు .   ఎండి రాలిపోదు.  ఎంత  త్వరగా  ఎండి  

పాడైతే   అంత దిష్టి ఉన్నట్టు. 

నవరత్నాల ఉంగరాన్ని ధరించమని శాస్రాలు ఎందుకు చెప్పాయి?





మనిషి శరీరంలో  తొమ్మిది ధాతువులు  వున్నాయి.  

వాటి పరమార్ధాన్ని చెప్పేవే నవరత్నాలు.  రక్తం 

పగడానికి , ఎముకలు ముత్యానికి ,  పుష్యరాగం 

మాంసానికి ,  శిరోజాలు నీలానికి ,   వైడుర్యానికి 

క్రొవ్వు,  గోమేదికానికి  బలము,  కేంపునకు వీర్యము,   

వజ్రానికి వెన్నుపూస ,  పచ్చకు గోళ్ళు  సూచికలు.

    కానీ ప్రస్తుతం పెట్టుకునేవారు నవరత్నాలు  

ధరిస్తున్నమనుకుంటున్నారు  .  నిజానికి అసలైన 

నవరత్నాలను  దరించటమన్నది    ఎంత 

డబ్బున్నవారికి సాధ్యం కాదు.

దేవాలయ వాతావరణంలో నూతన శక్తి మనలో ఎందుకొస్తుంది?



గుడిగంటలు ,  శంఖనినాదాలు  ,  మంత్రాలు  

మనిషిలో వినికిడి శక్తిని  ఉధృతం చేస్తాయి.  

భగవంతునికి ఆర్పించే పుష్పల్లోని సువాసనలు  

ఘ్రాణశక్తిని   తట్టిలేపుతాయి.

    స్వామి ప్రసాదంలో  రోజువారి మనం  వాడనివి 

ఉదాహరణకు   పచ్చ కర్పూరం  వంటివి వేస్తారు.  

మనిషి ఆలోచనల్ని పెంచి  ధర్మ మార్గం వైపు   

తీసుకెళ్ళే  శక్తి ప్రసాదంలో ఉంది .

      నుదుటన  పెట్టుకొనే చందనపు బొట్టు , చెవిలో 

పెట్టుకొనే  తులసి వల్ల రక్తప్రసరణ  పెరిగి 

ఆరోగ్యవంతమవుతుంది  .

ఒకరి దుస్తులు మరొకరు ధరించవచ్చ?





ఈ అలవాటు  ఎక్కువగా ఆడవాళ్ళల్లో   వుంటుంది.  సౌందర్య  సామగ్రి నుంచి  బట్టలు , నగలు ఎలా ఎన్నో మార్చుకుంటుంటారు.
అలా మార్చుకుంటున్నది  కేవలం నగలు , చీరలు మాత్రమే కాదు , వ్యాధులు కూడా.
       వారు ధరించిన వస్తువులకి  వారికి సంబంధించిన  వ్యాధులక్రిములు ఎన్నో కొన్ని ఆ వస్తువులకి అంటిపెట్టుకొని ఉంటాయి.  నగల విషయానికొస్తే  తెలీకుండా రంధ్రాలలో  వారి శరీరం తాలూకు మట్టిక్రిములు  నిక్షిప్తమైవుంటాయి.  మిగతావారు ధరించినప్పుడు  అవి వారిని చేరతాయి.  బట్టల విషయానికొస్తే  ఎంత ఉతికినవైన  వారి శారిరతత్వాన్ని  అవహించుకోనేవుంటాయి.  మీరు ధరించాగానే  ఆనందముగా  తమ పని తము చేసుకోనిపోయి  మీకు వ్యాదుల్ని  బహుకరిస్తాయి.

వధూవరుల వివాహ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?



  •   గోత్రములు అనగా మూల పురుషులవి విచారించాలి. ఏకగోత్రం అనగా  ఒకే ఇంటి  పేరుగల వాళ్ళు వివాహానికి పనికి రారు.
  •  తండ్రి వంశమున ఏడుతరాల వరకు , తల్లి వంశమునకు ఐదు తరాల వరకు  వివాహం చేయరాదు.
  • మేనత్త , మేనమామ  బిడ్డల వివాహం వల్ల  అనర్ధములు కలుగుతాయి.
  • గురువు పుత్రికను వివాహమాడరాదు  .
  • వరునికన్న వధువు  చిన్నగా  వుండాలి.
  • అక్కకి పెళ్లి చెయ్యకుండా  చెల్లికి పెళ్లి చేయరాదు.
  • సవతి తల్లి వుంటే ఆమె వైపు కూడా విచారించి వివాహాన్ని నిశ్చయించాలి.
  • ఒకరిని ప్రేమించిన యువతిని పురుషుడు వివాహం చేసుకోనరాదు.
  • తల్లి తండ్రి వంశ పారంపర్య  వ్యాధులున్నచో  వివాహం చేసుకోవడం వల్ల  ఆర్ధిక , ఆనంద నాశనములు.
  • వివాహం చేసుకునే వదువులో  పురుషుడు చూడాల్సింది కులం కాదు గుణం.
  • అదేవిధంగా  పురుషుడు విషయంలో  వధువు ప్రధానముగా చూడాల్సింది  సంపద కాదు గుణము, సమర్ధత.  

Thursday, 25 April 2013

హనుమాన్ జయంతి


యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
విశేషాలు:
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.
స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
పంచముఖ హనుమాన్:
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

||శ్రీహనుమాన్-చాలీసా|| శ్రీమద్గోస్వామీ-తులసీదాసజీ అవధీ భాషాయాం విరచితం


 శ్రీమద్గోస్వామీ-తులసీదాసజీ అవధీ భాషాయాం విరచితం
||శ్రీహనుమాన్-చాలీసా||
దోహా
శ్రీ గురు చరన సరోజ రజ నిజమను ముకురు సుధారి |
బరనఊ రఘుబర బిమల జసు జో దాయకు ఫల చారి ||
బుద్ధిహీన నను జానికే సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస బికార్ ||

ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేఊ సాజై || 5||

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||

సూక్ష్మ రూపధరి సియహిం దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||

భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉర లాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాఈ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాఈ || 12 ||

సహస వదన తుమ్హరో జాస గావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||

జమ(యమ) కుబేర దిగపాల జహాం తే |
కవి కోవిద కహి సకే కహాం తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భఏ సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||

రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోం లోక హాంక తే కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకట తేం(సేం) హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరధ జో కోఇ లావై |
సోఈ అమిత జీవన ఫల పావై || 28 ||

చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||

అష్ఠసిద్ధి నౌ(నవ) నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||

తుమ్హరే భజన రామకో పావై |
జనమ జనమ కే దుఖ బిసరావై || 33 ||

అంత కాల రఘువర పురజాఈ |
జహాం జన్మ హరిభక్త కహాఈ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరఈ |
హనుమత సేఇ సర్వ సుఖ కరఈ || 35 ||

సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాఈ |
కృపా కరో గురుదేవ కీ నాఈ || 37 ||

జో శత వార పాఠ కర కోఈ |
ఛూటహి బంది మహా సుఖ హోఈ || 38 ||

జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచంద్రకీ జయ | పవనసుత హనుమానకీ జయ | బోలో భాఈ సబ సంతనకీ జయ |దోహా

|| ఇతి శ్రీమద్గోస్వామీతులసీదాసజీ అవధీ భాషాయాం విరచితం శ్రీహనుమాన చాలీసా||

Wednesday, 24 April 2013

మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని ఎందుకంటారు?


మంగళవారానికి కుజుడు అధిపతి. ఈయనను మంగళుడు, అంగారకుడు అని కూడా అంటారు. అతడు భూమిపుత్రుడు. భూమిని తవ్వడానికి ఉపయోగించే గునపాలు, పారలు వంటి వాటికి కూడా కుజుడే అధిపతి. ఆయన తన సంకేతాలైన గడ్డపారలు వంటి వాటితో తన తల్లి అయిన భూమిని గాయపరుస్తుంటే సహించలేడు. అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కుజుడు అగ్నితత్వం కలవాడు కాబట్టి, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు గాను, అతడు అధిపతిగా ఉన్న మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 

భోజనాన్ని ఎలా భుజించాలి?



ఎత్తైన ప్రదేశంలో  కూర్చొని నోటికి దగ్గరగా  తినటం 

ద్వారా విపరీతమైన పొట్ట వచ్చి అందం తగ్గుతుంది. 

కొవ్వు పెరిగి ఆరోగ్యం పాడైపోతుంది. భారతీయ ఋషి  

సంప్రదాయం ప్రకారం  కటిక నేల మీద    కూర్చోకుండా 

చాప, పట్టా వంటిది వేసుకొని, కుటుంబ సభ్యులందరూ    

గుండ్రంగా  కూర్చొని మధ్యలో  ఆహార పదార్థాలు 

పెట్టుకొని  భుజించినట్లైతే  యాభైశాతం  వ్యాధులు 

అరకట్టబడతాయి.

ఏ శివాలయంలో పూజ చేస్తే ఏ ఫలం?



శిధిలమవనున్న  శివాలయంలో  అభిషేకం  చేస్తే, 

మహా మహిమాన్వితమైన  జ్యోతిర్లింగంలో  చేసిన 

అభిషేకానికి  పదిరెట్లు ఫలం. 

హీరవాయువు ఏ సమయంలో వస్తుంది?



బ్రహ్మ  ముహూర్తకాలంలో  అనగా సూర్యుడు  ఉదయించక  ముందు 

నాల్గు, ఐదు  గంటల సమయం. అ సమయంలో  వీచే గాలి అమృతం 

వంటిది. దాన్నే ఋషులు  హీరవాయువు  సమయమంటారు. ఆ 

ముహూర్తంలో  లేచినవారికి బుద్ధి  వికసిస్తుంది.   ఆయుష్షు  వృద్ధి  

చెందుతుంది. ఏ పనైనా  విజయవంతమవుతుంది.



దుఃస్వప్న దోషాలు హరించిపోవాలంటే?



'ఓం నారాయణ, శ్రీధర , పురుషోత్తమ , వామన, శంఖి 

నమో నమః ' అని నిద్ర కు ముందు , లేచిన తర్వాత 

జపించవలయును. అలా జపించినవారికి  దోష  కలలు 

రావు.    అంతకు ముందు వచ్చిన  కలల  దోషాలు 

తీరిపోతాయి.

Popular Posts