శ్రిమహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ
ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి
సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి
రమ్మని జ్యేష్టాదేవి కోరింది. ఆ సమస్య కొలిక్కి వచ్చిన
సమయంలో లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో
చెప్పింది.
వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ
శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి
శ్రిమహలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు. ఆమెను
ఆవిధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప
అన్నివేళలా వారిపై ఉంటుందని పురాణాలూ
తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ
పరిసరాల్లోకి రాదు.