పెద్దగా అరిచి లేపకూడదు. పడుకున్నవాన్ని
కుదిపి కుదిపి లేపకూడదు. ముందు మెల్లగా
పిలిచి , ఆపై స్వరం పెంచి , నెమ్మదిగా చేయివేసి కదిపి
లేపాలి. ఒంటరిగా నిద్రపోతున్నవారి విషయంలో
మరింత జాగురూకత వహించాలి.
మనిషి నిద్రిస్తున్నప్పుడు ఆత్మలోని అంశాలు
కొన్ని బయటికి వెళుతుంటాయి అని అంటారు.
అందుకే అనర్థాలు జరిగే అవకాశం ఉండటం వల్ల
నిద్రలేపే విషయంలో , అదీ అనారోగ్యంగా , పెద్ద
వయసు ఉన్న వారి విషయంలో ఎంతో మెళుకువ
చూపాలి.