పిల్లలు సరైన సమయంలో కలగకపోతే 28 సార్లు ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణం చెయ్యటం చాలా చోట్ల , చాలా కాలం నుంచి ఉన్నదే.
దానికి వైద్య కారణం వెదికితే చిరంజీవి వంటి రావి చెట్టు పురుష అంశం కలది. వేపచెట్టు స్రీ అంశం కలది. ఈ రెండు కలసిన ప్రదేశం వద్ద ప్రదక్షిణలు చేయటం వల్ల శరీరం వాటి నుంచి అమ్లజనితం ఇట్టే గ్రహిస్తుంది. గర్భ దోషాలను అరికడుతుంది. ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేయటం ద్వారా వాటిపై నుంచి పడిన సూర్యకిరణాల వల్ల గర్భ కోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే అవకాశముంది.