వినాయక చవితి వచ్చిందంటే పిల్లలకి, పెద్దలకి ఎంతో
హడావిడి. పూజలో ఉపయోగించే పత్రి వాసనలను
సంవత్సరంలో ఒక్కసారైనా ఆఘ్రాణించాలని, కనీసం ఓ
గంటైనా వాటి వద్ద ఉండాలని విఘ్నదిపతి పూజలో
పత్రిని చేర్చారు. ఆ పత్రిలో ఔషధ గుణాలు ఎన్నో .
హడావిడి. పూజలో ఉపయోగించే పత్రి వాసనలను
సంవత్సరంలో ఒక్కసారైనా ఆఘ్రాణించాలని, కనీసం ఓ
గంటైనా వాటి వద్ద ఉండాలని విఘ్నదిపతి పూజలో
పత్రిని చేర్చారు. ఆ పత్రిలో ఔషధ గుణాలు ఎన్నో .
వాటి సుగుణాలను తెలుసుకోమని చెప్పటమే పెద్దలు
వినాయక చవితి పర్వదినాన పత్రి వాడమని
చెప్పటంలో పరమార్ధం.
- మాచి పత్రం నులి పురుగులను హరించి అతి
- దప్పికను నివారిస్తుంది.
- మునగాకు కఫాన్ని , వాతాన్ని తగ్గించి శ్వాసని
- క్రమబద్దం చేస్తుంది.
- బిల్వాపత్రము మీదుగా పిల్చే గాలి తగిలినంతనే
- చర్మ రోగాలు నశిస్తాయి. ఈ ఆకులతో పూజించటం
- ద్వారా గాలి ఆడని దేవాలయాల్లో, గృహాలలో
- దుర్వాసనలు తొలగి భక్తులకి పవిత్రమైన భావన
- కలుగజేస్తాయి.
- గరిక ముక్కు సంబంధిత వ్యాధులను
- అరికడుతుంది. ఉమ్మెత్త ఆకులు వెంట్రుకలకు
- బలాన్ని, నిగారింపును తెస్తాయి.
- తులసి ఆకుల గూర్చి ఎంత చెప్పిన ఇంకా మిగిలే
- ఉంటాయి. ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఈ
- తులసి ఆకుని వినాయకుని పూజలో వాడకూడదు.
- మామిడాకుల్లో పుండ్లు తగ్గించే గుణముంది.
- గన్నేరు ఆకు ద్వారా అనేక శరీర దురదలను
- తగ్గించవచ్చు.
- విష్ణుక్రాంత పత్రం అనేక వ్యాధులకు
- క్రిమిసంహరకంగా పనిచేస్తుంది.
- దానిమ్మ ఆకు తింటే చర్మం కాంతి
- వంతమవుతుంది. దేవదారు ఆకు వెక్కిళ్ళను,
- వాపులను తగిస్తుంది.
- మరువం సువాసనలకు శ్వాస రోగాలు, చెవి
- సంబంధిత వ్యాధులు నయమవుతాయి.
- వావిలకు తలకు పెట్టుకుంటే తలనొప్పి
- మటుమాయమవుతాయి.
- జాజి పత్రం తినటం ద్వారా kantam మధురంగా
- తయారై పలుకులు వెన్నెల చినుకుల్లా
- అవుతాయి. తీగగరికను కడుపులోని వికారాలను
- తగ్గించేందుకు వాడతారు.
- జమ్మి ఆకు అతిసారాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకు రసం
- జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తుంది.
- రావి చెట్టు కింద చదువుకుంటే జ్ఞాపక శక్తి పెరిగి
- ఏకసంతాగ్రాహి అవుతాడు. మద్ది ఆకు ద్వారా
- వాతాకఫాలను తగ్గించవచ్చు. జిల్లేడు ఆకు తలపై
- పెట్టుకొని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది.
అంతటి మహాశక్తివంతమైన ,
పవిత్రమైన ఆకులను ఒక్కొక్కటి స్పర్శించటం ద్వారా
ఎంతో మేలు కలుగుతుందని పూర్వం ఋషులు ఈ
మహా పూజ విధానాన్ని ఏర్పరిచారు.