Followers

Thursday, 11 April 2013

శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైన పూలు?


కలువ పువ్వు, ఎర్ర గన్నేరు పువ్వు, శనగ పువ్వు, 

సంపెంగ పువ్వు, మల్లె పువ్వు, మోదుగ ఆకులు, 

గరికె,   గంటగలగర  పువ్వులు, తులసి దళములు ఇవి 

శ్రీకృష్ణునకు చాల ఇష్టమైనవి. అన్ని పువ్వుల్లోకి  

నల్లకలువ పువ్వు వెయ్యి రెట్లు ఎక్కువ ఇష్టమైనది.

ఎర్ర తామర కంటే తెల్ల తామర పువ్వు ఇంకా 

వెయ్యిరెట్లు ఎక్కువగా ప్రీతికరమైనది. తెల్ల తామర 

పువ్వు కంటే కూడా తులసి ఇంకా వెయ్యి రెట్లు ఎక్కువ 

ఇష్టమైనది.  తులసి పుష్పము కంటే, శివలింగ పుష్పం 

కంటే సౌర్య పుష్పం  శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రీతికరమైనది. 

ఏ పూలు దొరకని యడల తులసి దళములతోనైన ,  

శ్రీకృష్ణుని పూజించాలి. తులసి దళములు   దొరకని 

యడల తులసి చెట్టు వుండే చోటులోని మట్టి 

తీసుకువచ్చి  దానితో  శ్రీకృష్ణుని  పూజ 

భక్తిపూర్వకముగా చేయచ్చు. 

Popular Posts