మనిషి కంటి చూపుకి మహాశక్తి ఉంది. కొత్త
వాహనానికి నిమ్మకాయలు కట్టడము , ఇంటి
గుమ్మానికి గుమ్మడికాయను కట్టడము... ఇవన్ని
దిష్టిలో భాగాలే. నిజంగా దిష్టి వుంటుందా అంటే మాత్రం
ఉంటుందనే చెప్పాలి.
మీరు బాగా చేసే వంట ఒక్కోసారి ఏ రుచి
లేకుండా ఉంటుంది. తీరా తరచి చూసుకుంటే ఆ
సమయంలో వచ్చిన వారు చేస్తున్న వంట గూర్చి
మాట్లాడినట్టు గుర్తుకువస్తుంది. ఆ వంట మీరు ఎంతో
బాగా చేస్తారనట్టు గుర్తుకొస్తుంది.అదే దిష్టి.
అన్ని సార్లు బాగా వచ్చిన వంట ఎందుకల అయిందో
మీకు భోధపడుతుంది. మనిషి కనుల నుంచి
అధ్బుతమైన విద్యుత్ ప్రసరిస్తుంది. కొంత మంది
మంచి దృష్టి తో చూస్తే , మరికొంత మంది ద్వేష దృష్టితో
చూస్తారు.
ఫలితమే ఇది అలాంటి సమయాల్లోనూ, పదిమంది
నోట్లో మీ పేరు నానినప్పుడు సున్నం, పసుపు
కలిపినా ఎర్రనీళ్ళతో దిష్టి తీసి దూరంగా పోయాలి.
పక్క వారికి ఇబ్బంది లేకుండా చేసే ఏ చర్య అయిన,
నమ్మకమైన మంచిదే .