ఆకు లేదా పత్రం కింద దీపం వుంచి దీపాన్ని
భగవంతునికి సమర్పించాలి. భూమికి ఆకర్షణ శక్తి
ఎక్కువ. దైవధ్యాన మంత్రాలతో మనం పూజ
చేసినప్పుడు మన భక్తి దీపం ద్వార భగవంతునికి
తప్పక చేరుతుంది.
స్వామి అనుగ్రహం దీపాన్ని చేరి, మళ్ళి మనకి
చేరేలోపు భూమి ఆకర్షణతో భూమాతలోకి
చేరుతుంది. అందుకే జపించేటప్పుడు,
ధ్యానించేటప్పుడు కూడా కింద ఏదో ఒక గుడ్డ లేదా
చాప వంటి ఆసనాన్ని వేసుకొని పూజ చేసుకోవాలని
చెబుతారు.