Followers

Friday, 31 May 2013

మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..!? ఐతే ఫలితాలు ఇలా ఉంటాయ్!!



మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? అప్పుడప్పుడు కిందపడి పరుగెడితుందా? గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి. అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన వార్త అందుతుంది. 

ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధ గ్రహ ప్రభావంతో బంధువులు రాక, స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు, శుభవార్తలు వంటి శుభఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి. 

బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు పురోహితులు చెబుతున్నారు. 

Popular Posts