దేవుడి పూజకు ప్రధాన దీపంగా పెట్టుకునే దాంట్లో ఒక
వత్తి కాకుండా రెండుకాని, అంతకన్నా ఎక్కువగాని
వుండడం ప్రసస్తం. ఏకవత్తి పూజ మధ్యలో వచ్చే
దీపసేవ సమయంలో మాత్రమే ఉపయోగించాలి.
పూజకు అంగంగా పెట్టుకునే దీపంలో మాత్రం ఒక
కుంభవత్తి (నిలువుగా ఉండేవత్తి) అడ్డంగా వుండే
వత్తులు రెండు, మొత్తం మూడు వత్తులు
పెట్టుకుంటారు. త్రిగుణాలకు సంకేతంగా. కొంతమంది
కేవలం రెండే పెట్టుకుంటుంటారు. వాళ్ల ఉద్దేశ్యంలో
జీవాత్మ, పరమాత్మ అనేది సంకేతం.