నల్లచారలు గల జింకలు సంచరించే ప్రదేశాన్ని
ఎంచుకొని ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసేవారు
ఋషులు. అలాంటి జింకలు సంచరించే ప్రాంతమంతా
పుణ్యభూమి.
ఆ ప్రదేశంలో యజ్ఞాలు, యాగాలు, ఏ ధర్మ
కార్యాలు చేసిన ఎటువంటి విఘ్నాలు లేకుండా
ఫలప్రదం అవుతాయి. అలాంటి ప్రదేశంలో దేవతలు,
పుణ్య ఋషులు సదా సంచరిస్తుంటారు. పూర్వం
రాజాధిరాజులు అలాంటి ప్రదేశాల్లోనే యజ్ఞయాగాదులు
చేసేవారు.