Followers

Monday 6 May 2013

శ్రాద్ధ కర్మలు (Sharda Karmalu)




మానవుని పరలోక అనంత అంతిమయాత్ర, దానియొక్క విశేషతలు మన వేదాలలో విపులీకరీంపబదినవి. ఆత్మ జీవునిలో తన ఉనికిని కోల్పోయినను దానికి మరణం లేదు. తన ఇహలోక సత్, దుష్ట కర్మల ప్రభావం వల్ల ఆత్మ కృంగి కృశించును. ఈ కర్మల ప్రభావం వలననే ఆత్మ యొక్క ప్రయాణం నిర్ణయించబడుతుంది. అది సుగమమాలేదాకంటభరితమా అనే మాట. మన దేహము జీవించుటకు, తిండి ఎంత అవసరమో ఆత్మ ఆనందంగా జీవించుటకు ఇహంలోని దాని వంశీయులు ఆచరించు పుణ్యకార్యములు, వేద మంత్రముల పతన అంత అవసరం. వాటినే శ్రాద్దకర్మలు, పితృకార్యాలని పిలుస్తారు. వీటిని చెప్పబడిన సమయములలో చెయ్యవలసిన విధానములో చేసి పరలోకంలో సంచరించు ఆత్మలకు శాశ్వత విముక్తి ప్రసాదించగలవారము. మనము ఆచరించు శ్రాద్ధ కర్మలను బట్టే అవి సంతోషం, విచారం వంటి ఆలోచనాతరంగాలలో తిరుగాడుతూ ఉంటాయి. పితృ కార్యాలు సకాలంలో చేటి పితృ దేవతలను సంతృప్తి పరచి సంతోష పెట్టడం వారి వంశోద్దారకుల ముఖ్య కర్తవ్యం. వారి దీవెనలు, ఇహలోక వాసులకు విజయకారకాలు. జీవి, ఆత్మ, పితృ దేవతలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ మామూలు మానవులకి అగమ్య గోచరములు, అసత్యాలుగా (కంటికి కనిపించనివి కావున) కనిపించినప్పటికిని పండితులు, సూక్ష్మబుద్ది కలవారు సశాస్త్రీయమైన వివరణ ఇవ్వగలరు.
సైంటిఫిక్ గా ఇవన్నీ మనం నమ్మనప్పటికీ మనల్ని కని,పెంచి, మంచి విద్యాబుద్దులు చెప్పించి, మన అవసరాలనన్నిటినీ తీర్చి మన జీవితానికి ఒక స్దిరత్వం కల్పించిన మన తల్లిదండ్రులకు, పెద్దలకు కృతజ్ఞాతగా ఇహంలో తిరిగి ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోనలేము. కాని పరలోకము పొందిన అట్టి పితృ దేవతలకు చేయు శ్రాద్ధ కర్మల ద్వారా మనము చేయగలిగినిది చేసి వారిని మెప్పించి మన ఋణము తీర్చుకోనవచ్చునని మన వేదాలలో ఈ పితృ కార్యాల ద్వారా చెప్పబడియున్నది. ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించడం ద్వారా పితృ దేవతలను మెప్పించడమే కాక మన పిల్ల పాపలతో సుఖజీవనముగడపగలము.
మనకు రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరమునకు 12 మాసములు ఉన్నట్లుగా పితృ దేవతలకు కూడా కాల, సమయములు వేరుగా ఉండును. మనకు ఒక సంవత్సర కాలము వారికి ఒక దినము మనము సంవత్సరమునకు ఒక మారు పెట్టు ఆబ్డీకము వారికి రొజూ మన మందించు భోజనము వారు సంతుష్టులవని యెడల మనకు కీడు వాటిల్లును. పాప పుణ్యముల నిలయమగు ఈ కలియుగమున ఈ పితృ కార్యములు చేయుట ద్వారా
మనకు పుణ్యము, పితృదేవతలకు ఊర్ద్వలొక ప్రాప్తి కలుగును. కావున ఈ కర్మలు మనము చేయుట అత్యావశ్యకము.
(ఈ సేవలో మీకు ఈ పితృ కర్మలు చేయుటేలాగో వివరిచేదము). పితృ కార్యములు సాదారణముగా వారి వారి ఇండ్లలో గాని, నదీ తీరములందు గాని జరిపించేదరు. ఈ సేవలను వాడుకొనదలచినవారు ముందుగా నిర్ణయించుకొన్నదాని ప్రకారము (మాచే ఒసగబడు ఈ సేవను) వినియోగించుకొనవచ్చును. ఉద్యోగ రీత్యా కాని, మరే ఇతర కారణాల వల్ల కాని, విదేశాములందున్నవారి కోరికననుసరించి మేము కర్తృత్వ విధానముతో మీ బదులుగా ఈ కార్యక్రమములు నిర్వహించగలవారము. ఇక్కడున్న మీ బంధువులు వీటికి హాజరుకావచ్చును.


Popular Posts