Followers

Sunday, 5 May 2013

యమపురి దారి ఎలా ఉంటుంది?




మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత 

యమభటులు జీవిని యమపురికి తీసుకెళతారు. దారి 

అంత ఎగుడుదిగుడులు.  ఆకలిదప్పికలు తీరే 

అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బ లెత్తినా  

యమభటులు కొరడాలతో  కొట్టి నడిపిస్తారు. 

కనుచూపులోనే   నీరుంటుంది.  త్రాగబోతే చేతికి 

అందదు  .  మేహమేఘాలు  నిరంతరం  

వర్షిస్తుంటాయి. అయితే అవి వర్షించేది నీరు కాదు 

రక్తాన్ని.  అలా పదిహేడు రోజుల పాటు జీవించినపుడు  

చేసిన పాపాలను తలచుకొని వాపోతుంటాడు జీవుడు 

. ఆ తరువాతే యమపురి మజిలీ  అయిన   

సౌమ్యపురం చేరతాడు

Popular Posts