Followers

Friday 3 May 2013

ఆత్మ శిధిల ప్రాయమైన ఐహిక దేహాన్ని వీడి పోతుందే కానీ, ఆత్మ ఎన్నటికీ నాశనము కానిది, ఎప్పటికినీ శాశ్వతమైనది

ఆత్మ శిధిల ప్రాయమైన ఐహిక దేహాన్ని వీడి పోతుందే కానీ, ఆత్మ ఎన్నటికీ నాశనము కానిది, ఎప్పటికినీ శాశ్వతమైనది. అది ఎలా అంటే ఉదాహరణకు చక్కటి సూటు కోటు వేసుకొని అన్ని సరిగ్గా ఉన్నాయా అనే సందేహ నివృత్తి కోసం నిలువుటద్దం ఎదుట నిలబడి మిమ్మల్ని మీరు పరీక్షగా చూసుకుంటారని అనుకుందాం. సూటు కోటుతో సింగారించుకున్న మీ స్వరూపం మీ మనసుకు నచ్చిందంటే, తృప్తిగా నిలువుటద్దం ముందు నుండి మీరు తప్పుకుంటారు. ఆ తరువాత అద్దంలో మీ రూపం మటుమాయమవు తుంది. మీరు అద్దంలో కనబడనంత మాత్రాన మీరు లేనట్టా లేక ఉన్నట్టా అనేది గమనించండి. 

అదే ఇంకొక రోజున లాల్చీ ధోవతితో అద్దం ముందు నిలబడ్డారు, అప్పుడు అద్దంలో కనబడేది లాల్చీ ధోవతితో గల మీ ప్రతి బింబ స్వరూపమే. అంతకు ముందు రోజు మీ ప్రతి బింబ స్వరూపం సూటు కోటుతో కనబడగా, మరో రోజున లాల్చీ ధోవతితో కనబడుతోంది. ఈ క్రమంలో మీ ఐహిక దేహ రూపంలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని పరిశీలిస్తే, మీరు ధరించిన దుస్తుల్లో మార్పు కానీ మీ ఐహిక దేహ రూపంలో ఎటువంటి మార్పులేదు. అదే విధంగా ఆత్మను కలిగియున్న దేహ స్వరూపం వేరు గానీ, ఆత్మ స్వరూపం వేరు కాదు. ఎలా అయితే మీరు దుస్తుల్ని మారుస్తారో అదే విధంగా మీలోని ఆత్మ స్వరూపమే మీ దేహాన్ని విడిచి వేరొక దేహంలో ప్రవేశిస్తుంది, ఆ దేహరూపాన వసిస్తుంది. 

అప్పుడు ఐహిక ప్రపంచాన వేరొక నామధేయంతో పరిఢవిల్లు తుంది. పురాణాది ఇతిహాసాల్లో పేర్కొనబడిన విధంగా నాశనము లేనిది ఆత్మ అయినట్ల యితే ఆ ప్రతి బింబానికి అసలు స్వరూపమైన భగవంతుడు యుగ యుగాంతాల్లో సైతం నాశన రహితుడు. అందుకే ఆయన్ని ఆది మధ్యాంత రహితుడని భక్తి పూర్వకంగా పిలుచుకుంటాము. కనుక భగవంతుడి స్వరూపమైన ఆత్మ మనలో ఉన్న క్రమంలో సామాన్య మానవుడు సైతం నేనే దేవుడ్ని అనే భావనకు గురి అయినట్లయితే అది అపోహ ఎంత మాత్రం కాదు. అలా పలుక గల సాహసం చేసిన వ్యక్తి లో ఇమిడి యున్న ఆత్మ, అతనిచే ఆ పలు కు పలికించు తోంది. ఈ క్రమంలో ఆత్మపర మాత్మ ఒక్కటే అన్నది అర్ధం అవు తుంది. ఇదే వాస్తవం కూడా.

Popular Posts