Followers

Sunday, 19 May 2013

పూర్వం స్రీ జీవన విధానం ఎలా వుండేది?(Women In Old Days)



  •  ఇంటి ఇల్లాలు ఇంట్లోని కుటుంబసభ్యులందరికంటే  ముందే నిద్ర లేచేది.
  • రాత్రి ధరించిన వస్త్ర భూషణాలను  వదిలి స్వీయ కార్యాలను పూర్తి చేసుకొని, పనిచేయటానికి వీలైన వస్త్రాలను ధరించేది.
  • ఆపై   ఇల్లు ఊడిచి , పేడతో కల్లాపి చల్లి ముగ్గులు వేసేది. అభ్యంగన స్నానం అనంతరం పూజాదికాలు పూర్తి చేసేది.    
  • వంటింటిని శుభ్రం  చేసి, కావలసిన పరికరాలన్నీ శుక్తి చూర్ణం,  నార వంటివాటితో శుభ్రపరచుకునేది.
  • పగటి ఎండలో ఎండిన కట్టెలతో వంట ప్రారంబించేది.
  • నూనెలు, మజ్జిగ వంటి వాటితో వంటకములు చేసి భర్త కొరకు ఎదురుచూసేది.
  • భర్తకి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి మాత్రమే వండేది. వంట పూర్తయ్యాక, ముఖము, కాళ్ళుచేతులు శుభ్రపరచుకొని ఆభరణాలు దరించి గంధం, తాంబూలములతో  వినయవిదేయతలతో వడ్డించేది.
  • ఇంట్లో పెద్దవారి చికిత్సకి  అవసరమైన  ఔషధాలను    అందించేది.
  • భర్త సోదరుల, సోదరిమణుల  అవసరాన్ని గమనించి ఏర్పరచేది.
  • బోజననంతరం  కొంత విశ్రాంతి తీసుకొని, పాడిగేదల పనులన్నీ చూసేది.
  • ధనాన్ని, సమయాన్ని వృధా చెయ్యక  రాత్రి బోజనాన్ని సిద్ధం చేసి ఆపై  భర్త వద్దకు చేరి సపర్యలు చేసేది.

Popular Posts