Followers

Thursday, 30 May 2013

విభూతి, మట్టి ఎందుకు గొప్పవి? (Vibhuti and Soil – Precious)






"నా దగ్గరేముంది బూడిద..", "మట్టే మిగిలింది, ఇంకేం 

లేదు" లాంటి మాటలు వింటుంటాం. తమ దగ్గర ఏమీ 

లేనప్పుడు, లేదా, ఇతరులకు పైసా కూడా 

ఇవ్వదల్చుకోనప్పుడు ఇలా మాట్లాడతారు. నిజానికి 

బూడిద, మట్టి చాలా గొప్పవి, అమూల్యమైనవి. వాటి 

విలువ తెలీక మాత్రమే, మట్టి (మృత్తిక), బూడిదలను 

(విభూతి) నిరర్ధకాలుగా, అవి నిష్ప్రయోజనమైనవి 

అన్నట్లుగా చెప్తారు.


విభూతి, మట్టి చాలా గొప్పవని ధర్మ శాస్త్రాలు 

చెప్తున్నాయి. పంచ స్నానాల్లో ఆగ్నేయ స్నానం, 

వాయవ్య స్నానం ఉన్నాయి. ఆగ్నేయ స్నానం అంటే 

విభూతిని ధరించడం. వాయవ్య స్నానం అంటే గోవులు 

నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టిలో తేలుతూ 

నడవడం. కనుక విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో 

విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ 


పురాణం చెప్తోంది.

భస్మ స్నానం, మృత్తికా 


స్నానం పూర్తయిన తర్వాతనే 

కొత్త యజ్ఞోపవీతం 

వేసుకోవాలనేది శాస్త్రం.


పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, 

మనకు సర్వాన్నీ ప్రసాదించే 

చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి 


లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, 

చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని 

సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన 

తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది.


నిప్పు కాలుస్తుంది. కట్టెలు, పిడకలు లాంటివి నిప్పు 

సోకినప్పుడు కాలిపోతాయి.. ఈ రెండింటి కలయికతో 

పుట్టిన విభూతి, ఆ రెండు గుణాలనూ వదిలి, కొత్త 

రూపాన్ని, శాశ్వతత్వాన్నీ సంతరించుకుంది. ఏదైనా ఒక 

వస్తువును లేదా పదార్ధాన్ని కాల్చినప్పుడు బూడిదగా 

మారడం మనకు తెలిసిందే. కానీ బూడిదను కాలిస్తే ఏ 

మార్పూ జరగదు. ఎంతమాత్రం రూపాంతరం చెందదు. 

తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు 

లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో 

మార్పులేని మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి 

శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు 

ఆరోగ్యదాయిని కూడా. విభూతి దహించదు, 

దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. 

నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా 

ప్రీతికరమైంది.

కనుక, మట్టిని, విభూతిని నిరర్ధకాలుగా 

ఎన్నటికీభావించకండి. ఈ రెండూ చాలా పవిత్రమైనవి, 

అమూల్యమైనవి.

Popular Posts