Followers

Friday 3 May 2013

వృక్షాలు కొడుతున్నప్పుడు గర్భిణీ స్త్రీలు ఎందుకు చూడరాదు?




గర్భిణీ స్త్రీలు చెట్టు కొడుతున్నప్పుడు చూడకూడదని చెప్పడం జరుగుతుంది. ఈ దృశ్యం వారిలోమృతుని కాష్టానికి కట్టెలకై చెట్టు కొడుతున్నారేమోనన్న భావన కలిగించవచ్చు.
కాని నేటి కాలంవారు దీన్ని పట్టించుకోరు. 

చెట్లు కొడుతున్నప్పుడు గర్భిణీ చూస్తే ఆమె మనసుపై ఎలాంటి ప్రభావం ఉండదని వారు వాధిస్తున్నారు. వారు నిషేధమైన వాటిని పాటిస్తున్నారా లేదా అనేది ముఖ్యం కాదు. వారు ఆహ్లాదంగా మరియు ప్రశాంతంగా ఉన్నారా లేదా అనేదే ముఖ్యమని భావించబడుతుంది.

ఈ విషయంపై ప్రాచీన కాలంలో ఇచ్చిన ఒకనొక వివరణ ఏమటంటే, గర్భిణీ స్త్రీలు చెట్టువిరిగి కింద పడుతున్నప్పుడు ఉరకలేక పోవడమే కాక తప్పించుకోలేకపోతారు. ఈ ఒక్క కారణమే కాక మరోకటేమిటంటే చెట్టు విరిగి కింద పడుతున్నప్పుడు ఉత్పన్నమయ్యే శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ శబ్ధం గర్భంలోని శిశువు గుండె మరియు మెదడుపై చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశముంది.

కాబట్టి నేటి వైద్యులు కూడా గర్భిణీ స్త్రీలను విస్ఫోటనా శబ్ధాలను, పెద్ద శబ్ధాలను వినకుండేలా ఉండమని చెబుతారు. ఒకేసారి విరిగి పడే చెట్లు, పేలుల్లు, రెండు పెద్ద వస్తువులు ఢీ కొనడం వల్ల ఉత్పన్నమయ్యే పెద్దశబ్దాలు మొదలగు వాటి వల్ల ఒక్కసారిగా దిగ్బాంతికి గురై, దాని ప్రభావం గర్భిణీ స్త్రీపై మరియు శిశువుపై శాశ్వతంగా పడే అవకాశం ఉంది.
కాబట్టి ఇలాంటి నిషేధాలు ఎంతో విలువైనవి.

Popular Posts