Followers

Thursday, 25 July 2013

పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వేదకాలంలోనే స్పష్టంగా చెప్పిన మన పూర్వీకులు

ఋగ్వేదం ఎంత పురాతనమైనదో మనకు తెలుసు.
ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో క్రింది శ్లోకాన్ని చూడండి.
 వా ఏష న కదాచనాస్తమేతి నోదేతి, తం యచస్తమేతీతి మన్యంతేహ్న ఏవ తదంత్వమిత్వాథాత్మానం విపర్యస్యతే- రాత్రీమేవావస్తాత్ కురుతేహః పరస్తాత్ … య ఏవం వేద” 14.6
అర్థం:
సూర్యుడు ఉదయించడం,అస్తమించడం అంటూ అనేది ఎప్పటికీ ఉండదు. సాయంకాలం అతడు విపర్యాసాన్ని పొంది మనకు కనబడడు. మళ్ళీ తెల్లారేసరికి కనబడతాడు.ఈ గోళంలో 
కొంతభాగానికి కొంతసేపు మిగతాభాగానికి కొంతసేపు చీకటి,వెలుగులను ప్రసాదిస్తూ రాత్రి,పగలు అనే వ్యవహారాన్ని కలిగిస్తాడు.
ఇందులో విపర్యసం అనే పదం నాకు అర్థం కాలేదు.
అసలు రాత్రి,పగలు అనేవాటిని ఎంత స్పష్టంగా ఆ కాలంలోనే వివరించారో చూడండి.
అంతేకాక గోళం అంటూ భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్తున్నారు.
వేదాల్లోని ఈ విషయాన్ని చూసి 19వ శతాబ్దపు వేద పరిశోధకుడు మోనియర్ విలియంస్ (Monier Williams) భారతీయుల సునిశిత మేధాశక్తిని ప్రశంసించిన విధానం చూడండి.
“Indians had made some shrewd astronomical guesses more than 2000 years before the birth of Copernicus” (The Vedas p.39)
ఇంకో తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే ఈ ఋగ్వేదపు ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదటిసారిగా “ఆంధ్ర దేశం” అని ఉపయోగించబడింది.
ఇందుకు సంబంధించిన శ్లోకం
“తుంగా కృష్ణా తథా గోదా సహ్యాద్రి శిఖరావధి|
ఆ ఆంధ్రదేశ పర్యంతం బహ్వృచశ్చాశ్వలాయనీ” (33.6)

Popular Posts