Followers

Thursday 11 July 2013

ఏ అవతారమయినా లోకరక్షణార్ధమే..

లోకంలో జన్మించిన మహనీయులెందరో నిశ్చల భక్తితో భగవన్నామ స్మరణయందే తమ సంపూర్ణ కాలము వెచ్చించి, మహామహితాత్ములెై ప్రసిద్ధి చెందారు. అట్టివారిలో మొట్టమొదట చెప్పుకోదగినవారు, రామభక్తి సామ్రాజ్యంలో నిరంతరం శ్రీరామనామోచ్ఛారణతో ఆయన పాదాల వద్ద తన జీవిత సర్వస్వం పునీతం చేసుకున్నవాడు శ్రీఆంజనేయస్వామి వారు.

Hanumanమనదేశం సదాచార సాంప్రదాయాలకు కాణాచి. కొందరి దృష్టిలో ఇవి శాస్ర్తీయమైనవి కావనీ, నిరర్ధకములెైనవనే భావన ఉంది. దూరం ఆలోచింపక, వాటిలోని వాస్తవికతను తెలుసుకోలేక ఇలా నిందిస్తారేమోగానీ, వాటిలో వాస్తవికత, విజ్ఞాన విషయాలు ఎన్నో ఉన్నాయి. పూర్వకాలం ఏమోగానీ, ప్రస్తుతకాలంలో గ్రామ, పట్టణ నగర పొలిమేరల్లో ఎతె్తైన, గంభీరమైన, ఆకర్షణీయమైన ఆంజనేయ స్వామి విగ్రహాలను నిర్మిస్తుండటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలా విగ్రహాలను ఊరి పొలిమేరల్లో ప్రతిష్టించడానికి ముఖ్య కారణం లేకపోలేదు. పొలిమేరల్లో స్థాపించిన ఈ విగ్ర హాల వలన ఆ ప్రాంతంలో నివశించే ప్రజలకి దీర్ఘవ్యాధులు, కలరా, మసూచి వంటి మహమ్మారి రోగాలు వ్యాపించవనే నమ్మకం ఉంది. ఈ నమ్మకానికి కారణమైన ఒక పురాణ కథని తెలుసుకుందాం.శ్రీమహా విష్ణువు కూర్మావతారం ధరించి పాలసముద్రంలో మంధర పర్వతం మునిగిపోకుండా తన వీపుపెై ఎత్తిపెట్టాడు. దేవదానవులు వాసుకిని తాడుగా చేసుకుని సముద్ర మథనం చేయగా అమృతం వంటి ప్రభావవంతమైన పదార్ధాలేకా కుండా, భయంకరమైన కాలకూట విషంతో పాటు అనేక నివారణలేని రోగక్రిములు కూడా ఉత్పన్నమయ్యాయి.

అంతే కాకుండా అనేక దుష్టశక్తులు కూడా ప్రబలి ప్రజల్ని బాధిం చడం మొదలయ్యింది.విషపదార్ధాల నుంచి వ్యాపించిన రోగ క్రిములు మసూచి, కలరా వంటి వ్యాధుల్ని వ్యాపింపచేయగా, ఊళ్ళకి ఊళ్ళు తుడిచిపెట్టుకుపోవడం మొదలయ్యింది. ఈ వ్యాధుల్ని ఎంత ఘనవెైద్యులు ప్రయత్నించినా దుష్టశక్తులు నశించలేదు. ఈ ఘోరమైన రోగాలు నయం కాలేదు. ఇక చేసేది లేక ప్రజారక్షణా తత్పరులెైన ఋషులు బ్రహ్మవద్దకు వెళ్ళి తమ ఆర్తిని తీర్చమని ప్రార్ధించారు. బ్రహ్మదేవునికి కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకనందున అందరితో కలిసి కైలాసవాసుడెైన ఆ పరమేశ్వరుని వద్దకు వచ్చాడు. ఆర్త జన రక్షకుడెైన ఆ శివుడు ఈ సమస్యనించి ప్రజల్ని కాపాడటం కోసం తాను వానర రూపాన్ని ధరించి, తన అంశలోని ఏకా దశ రుద్రులకు వానర రూపాలే కల్గచేసి ఈరోగాలు వ్యాపిం చినచోటకు వెళ్ళి భయంకరమైన వికృత అరుపులతో రణగణ ధ్వనిచేసిహడలెత్తిం చారు. ఈవానర సమూహ ధాటికి రోగక్రి ములుగా ఉన్న దుష్టశక్తులన్నీ నిలువనీడలేకుండా పోయాయి. ఈ విధంగా సర్వజనోద్ధరణకు వానర సైన్యం భూమ్మీద అవతరించింది. 

మనదేశం సదాచార సాంప్రదాయాలకు కాణాచి. కొందరి 

దృష్టిలో ఇవి శాస్ర్తీయమైనవి కావనీ, నిరర్ధకములెైనవనే 

భావన ఉంది. దూరం ఆలోచింపక, వాటిలోని 

వాస్తవికతను తెలుసుకోలేక ఇలా నిందిస్తారేమోగానీ, 

వాటిలో వాస్తవికత, విజ్ఞాన విషయాలు ఎన్నో ఉన్నాయి.


అందరూ సుఖసంతోషాలు పొందారు. ఆ సమయంలో బ్రహ్మ దేవుడు వానరరూపంలో ఉన్న శివ శక్తిని ఆరాధిస్తే సకల శుభా లూచేకూరతాయని ఆశీర్వదించాడు. వానరులకు, నరులకు చాలా విషయాల్లో పోలికలున్నాయి కదా: కోతి నుంచే మాన వుడు ఉద్భవించాడని కూడా విజ్ఞాన శాస్తవ్రేత్తల అభిప్రాయం. కైలాసవాసుడు శివుడే శ్రీఆంజనేయస్వామిగా అవతరించాడని చెప్పుటకు గల మరో ఐతిహాస్యాన్ని తెలుసుకుందాం..పూర్వం గార్థభనిస్వనుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివు ని గూర్చి ఘోర తపస్సుచేసి శివశక్తినే తన కవచంగా చేసుకు న్నాడు. ఇక అనేక ఘోరకృత్యాలు చేస్తూ, తపోధనుల్ని, ప్రజానీ కాన్ని అల్లకల్లోలం చేయడం ప్రారంభించాడు. ఎన్నిచేసినా శివశక్తి కవచం వల్ల ఏదీ గార్ధభనిస్వనునికి తాకేది కాదు. వీని ఆగడాలు శృతిమించిపోవడంతో అందరూ శ్రీమహావిష్ణువుని వేడుకున్నారు. అప్పుడు ఆయన శివశక్తి కవచం వల్ల ఈ విధ మైన సమస్య రావటంచేత అందర్ని వెంట నిడుకుని కైలాసా నికి వచ్చాడు. 

శివునితో, పరమేశ్వరా గార్ధభనిస్వనునికి ఇచ్చిన నీ శివశక్తి కవచాన్ని ఉపసంహరించమని ప్రార్ధించాడు. అం దుకు ఆ పరమేశ్వరుడు, కేశవా! నీకు తెలియనిదేమున్నది భక్తులకిచ్చిన వరాన్ని తిరిగి తీసుకోలేను. అని సమాధానం ఇచ్చాడు. ఇక చేసేదిలేక విష్ణువు వానితో తలబడడానికి సమా యత్తమయ్యాడు. ఈ విషయంలో శివకేశవులకి వాగ్యుద్ధం జరిగింది. ఆ వాగ్యుద్ధంలో శివశక్తివల్ల శ్రీహరి ఓడిపోతే, ఆయన శివునికి దాసుడుకావాలి. అదే శ్రీహరి చేతిలో గార్ధ భనిస్వనుడు మరణిస్తే శివుడు, శ్రీహరికి దాసోహం చేసే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. దెైవలీలలు చెప్పడం ఎవరికి సాధ్యం..! శివకేశవులకు బేధం లేదు కదా..! శ్రీమహావిష్ణువు తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ సమ యంలో గార్ధభనిస్వనుడు తన సుందర ఉద్యానవనంలో విహ రిస్తున్నాడు. శ్రీమహావిష్ణువు ఒక అందమైన స్ర్తీరూపం ధరించి తనముందు కదలాడాడు. ఆ రాక్షసాధముడు చిత్తచంచలుడెై ఆ మాయారూపంలో ఉన్న శ్రీహరి వెంటపడ్డాడు. శ్రీహరి నయగారాలు నటిస్తూ, గార్ధభనిస్వనునిచేత విపరీతంగా మథు వు తాగించి, ఆ మత్తులో పడివున్న గార్ధభాసురుని తోడేలు రూపం దాల్చి ఖండఖండాలుగా చేసేసాడు.

అంతటితో గార్ధభ నిస్వనుడు నిర్జీవుడెైయ్యాడు. పరమేశ్వరుడు కూడా శ్రీహరి దుష్టసంహారానికి సంతోషించాడు. సర్వలోకాలకూ శాంతి కలి గింది. చెప్పిన మాట ప్రకారం తాను శ్రీహరికి దాసుడనన్నాడు. శ్రీమహావిష్ణువు పరమేశ్వరుని వారించి చిరునవ్వుతో పరమే శ్వరా! కాలక్రమంలో త్రేతాయుగంలో రావణ సంహారానికి నేను శ్రీరాముడుగా అవతరిస్తాను. అప్పుడు నీవు ఆంజనేయు డిగా అవతరించి నీ మాట నెరవేర్చుకుందువుగాని. అని వెైకుం ఠానికి తరలి వెళ్ళాడు. లోకాలన్నీ శాంతించాయి. ఋషులు, సకల రాజన్యులు ఎంతగానో సంతోషించారు. ఆనాటి మాట ప్రకారమే త్రేతాయుగంలో శివశక్తితో అంజనేయుడు అవత రించి నేటికీ శ్రీరామపద సేవా తత్పరుడిగా మనందరి చేతా పూజలందుకుంటున్నాడు. 

ఏలోకంలోనెైనా భక్తి తత్వం విశిష్టమైనది. అది లేకుండా ఎవ్వరూ పునీతులుకారు. ఈ భక్తితత్వం అలవాటుగా వచ్చేది కూడా కాదు. పురాకృత పుణ్యవిశేషం వల్ల, మహనీయుల సందర్శనం వల్ల, సత్సాంగత్యం వల్ల భక్తి తత్వం పరిపుష్టమవుతుంది. మనోవాక్కాయ కర్మల్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే అదే సత్యమవుతుంది. ఆ సత్యస్వరూపమే భగవంతుడు. భగవంతుని దర్శించడానికి భక్తితత్వమే ప్రాతిపదిక. స్థిరమైన భక్తికున్న శక్తి భగవత్శక్తిని మించినదనడంలో అతిశయోక్తి లేదు. మోహం నశిస్తేనే గానీ, భక్తి అబ్బదు.

Popular Posts