శ్రావణ బహుళ అష్టమి రోజున
దేవకీవసుదేవుల పంటగా జన్మించి
యశోదాదేవికి కన్నులపంటైన
‘అష్టమి’ అంటే ఎనిమిదవ తిథి ఈ
ఎనిమిదవ తిధికి విశిష్టమైన
గొప్పదనం ఉంది. ‘ఓం నమో
నారాయణాయ’ అనే అష్టాక్షరి
మంత్రం ఎనిమిది అక్షరాలుగల
మంత్రం. అలాగే దేవకీదేవికి
ఎనిమిదవ సంతానం, ఎనిమిదవ
నెలలో జన్మించినవాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణావతారం గొప్పది. దీనులను
ఆదుకోవడానికి శ్రీహరి ఎత్తిన
అవతారమది. ద్వాపర యుగంలో
రాక్షసాంశ జులెందరో ప్రభువులై
ప్రజల్ని పీడించారు. ఆ
సమయంలో దుష్టశిక్షణ, శిక్ష
రక్షణచేసి, ధర్మాన్ని
పరిరక్షించడంకోసం శ్రీహరి
శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణ
భగవానుడు దేవకీ గర్భమునుంచి
ఉదయించిన పవిత్ర దినానే్న
మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా
జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణుడు
రోహిణి యుక్త అష్టమినందు
అవతరించాడు. ఆ కారణంగా ఆ
అష్టమినే కృష్ణజయంతిగా
చెప్పబడుతోంది. శబ్దార్థ
కల్పతరువు ప్రకారం ‘్భక్త
దుఃఖకర్షిం కృష్ణః’ అంటే భక్తుల
దుఃఖాన్ని పోగొట్టేవాడు
శ్రీకృష్ణుడుఅని అర్థం. శ్రీకృష్ణుని
సదా స్మరించువారు ఈతి బాధలు
లేకుండా అఖండ సౌభాగ్యాలతో
తులతూగుతారని శ్రీనారదీయ
పురాణంఅంటోంది. ‘కృష్ణస్తు
భగవాన్ స్వయం’ అన్నట్లుగా
పురిటి పొత్తిళ్ళలో ఉండే, తన
మాతాపితలైన దేవకీ
వసుదేవులకు
శ్రీమన్నారాయణునిగా తన నిజ
స్వరూపాన్ని దర్శింపచేశాడు.
వృషభ లగ్నంలో లగ్నమందు
గురుచంద్రులు, తృతీయాన
రాహువు, చతుర్ధాన రవి,
పంచమమున బుధ, శుక్రులు,
షష్టమమున శని, నవమున కుజ
కేతువులున్నారు, శ్రీకృష్ణుని
జాతకం గొప్పది. అంతేకాదు ఈ
భూమండలం మీద ఎవరికీ
లేనటువంటిది ముప్ఫైరెండు
సాముద్రిక లక్షణాలుండడంవల్ల
శ్రీకృష్ణుడు సకల
లోకారాధ్యుడయ్యాడని జ్యోతిష్య
శాస్త్రం చెబుతోంది. శ్రీకృష్ణుని
స్మరించుకుని, సేవించుకునే పుణ్య
పర్వదినాలలో జన్మాష్టమి అత్యంత
ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా
ఆనాడు శ్రీకృష్ణ భగవానుని భక్తితో
సేవిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి
రోజున జనులు అభ్యంగన
స్నానమాచరించి, నూతన వస్త్రాలు
ధరిస్తారు. శ్రీకృష్ణుడు రోహిణి యుక్త
అష్టమినందు అవతరించాడు. ఆ
దినాన ఉపవాసం చేసేవారు ఏడు
జన్మల పాపాలనుంచి
విముక్తులవుతారని పురాణాలు
చెబుతున్నాయి. ద్వాపర,
కలియుగాన సంధిలో ‘శుభకృత్’
నామ సంవత్సరాన సింహమాసాన
(సూర్యుడు సింహరాశిలో ఉన్న
సమయాన) కృష్ణపక్ష అష్టమి తిథి
యుక్తరోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ
భగవానుడు జన్మించాడు. లోక
కంఠకుడైన కంసుడు ఇత్యాది
దురంహరులను అంతమొందించి,
లోకరక్షకుడయ్యాడు. మన
దేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని
అత్యంత వేడుకగా
జరుపుకుంటారు. ముఖ్యంగా
ఉత్తర భారత క్షేత్రాలైన ‘మధుర’,
‘ద్వారకా’, బృందావనం, ‘
్ఢకూర్’లలో ఈ వేడుకలు
అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న
కృష్ణాలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి
వేడుకలు అంగరంగ వైభవంగా
నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి
రోజున, ప్రతీ ఒక్కరూ ప్రాతఃకాలానే
నిద్ర లేచి స్నానాదికాలు ముగించి
శుచి శుభ్రతలతో నూతన వస్త్రాలు
ధరిస్తారు. శ్రీకృష్ణ ప్రతిమను లేదా
పటాన్ని ఉంచి షోడశోపచారాలతో
స్వామిని భక్తితో అర్చించాలి.
పండిన పండ్లు, రుచిగల పిండి
పదార్థాలు, లడ్డూలు,
మోదకములు, పాలతో వండిన
పదార్థాలతో, నెయ్యి, పాలు, తేనె,
బెల్లంతో కూడిన నైవేద్యాన్ని
స్వామికి సమర్పిస్తారు. అనంతరం
పచ్చకర్పూరం, యాలకులు,
లవంగాలు, జాజి, జాపత్రి
మొదలైన సుగంధ ద్రవ్యాలతో
కూడిన తాంబూలాన్ని స్వామికి
సమర్పిస్తారు. కర్పూర
నీరాజనాన్ని, నమస్కారాలను
సమర్పించి, పూజను ముగిస్తారు.
కొందరు స్వామికి కల్యాణాన్ని
కూడా జరిపిస్తుంటారు.
బృందావనలీల, నోట పదునాల్గు
భువనాలను చూపెట్టడం, పూతన
శకటాసురలను సంహరించడం,
మల్లయోధులను మట్టికరిపించడం
లాంటిఎన్నో లీలలు కృష్ణయ్య
మానవులకు చూపించిన
మహత్తరలీలలు.మీరు మీ
కర్తవ్యాన్ని మీరు చేయండి.
ఫలితాన్ని నాపై వేయండి
ఎవరికేమి కావాలో దాన్ని నేను
ఇస్తాను అని చెప్పే భగవంతుడిని
ఎవరు దూరం చేసుకొంటారు.
అందుకే నీలో నాలోనే కాదు
సర్వములోనూ నిండిఉన్న ఆ
కృష్ణపరమాత్మకు శరణం శరణం
శరణం.