Followers

Tuesday 30 July 2013

వాస్తుశాస్త్రమ

1 మనము కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు విషయాలను తప్పక పా టింపవలయును. గాలి, వెలుతురు, నీరు మొదలగునవి మన ఇంటిలో నికి ఆహ్వానించే విధంగా మనము ఇంటి నిర్మాణము చేయవలెను.
2 మనము స్థలము కొనుగోలు చేయునపుడు నలు చదరముగా గాని, సమకోణ దీర్ఘ చతుర స్రాకారముగ ఉన్న స్థలంగాని ఎంపిక చేసుకోవాలి. అది తూర్పు, ఉత్తరం పల్లంగా వుండాలి. ఈశాన్యం పల్లంగా ఉన్న స్థలం చాల మంచిది. 3 ఇంటికి చుట్టు ప్రహరి ఉండుట చాల మంచిది.
4 ఇల్లు కట్టుకొనే ముందు ఇంటికి చూట్టూ ఖాళీ స్థలం వుంచుకోవాలి. తూర్పు, ఉత్తరాలతో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుకొనుట చాలా మంచిది .
5 ఈశాన్యం పెరిగిన స్థలం చాలా మంచిది. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది . ఈశాన్యం కాకుండా ఏ మూల పెరిగినా దానిని తగించే వీలు వుంటెనే ఆ స్థలాన్ని తీసుకోవాలి.
6 స్థలము, గృహాలతో నిగదులు తూర్పు భాగమునకు పల్లముగా ఉండాలి. మనము వాడిన నీరు తూర్పునకు గాని, ఈశాన్యానికి గానీ వెళ్ళే విధంగా కట్టుకోవాలి.
7 ఇంటికి ద్వారాలు తూర్పులోనూ, ఉత్తరములోనూ, ఉత్తరములోనూ, ఈశాన్యాలలోనూ, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యంలో ఉంటె మంచిది. ఉత్తర వాయువ్యాలలో, తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ నైరుతి లో మరియు పశ్చిమ నైరుతి లో ద్వారాలు ఉండకూడదు.
8 . వంటగది నిర్మాణము ఈశాన్య భాగమున ఉండరాదు. ఈశాన్యం మూల పొయ్యి అసలు ఉండరాదు. ఇంటిలో పొయ్యి ప్రధానంగా ఆగ్నేయంలో ఉండాలి. అలా వీలు కుదరనప్పుడు నైరుతి భాగములో పెట్టవచ్చును. మిగతా దిశలు పొయ్యికి పనికి రావు.
9 . ఇంటిలో ఈశాన్య భాగములో పూజా మందిరం నిర్మించుట చాలా మంచిది.
10 .పడక గది నైరుతి భాగములో కట్టుకోవాలి. దక్షిణం వైపు తల ఉంచి నిదురించుట చాలా మంచిది. ఎట్టి పరిస్థితులలోను ఉత్తరం వైపు తల ఉంచి నిదురించ కూడదు.
11 . గొయ్యి లేకుండ ఉండేటటువంటి మరుగు దొడ్డి ఆగ్నేయంలో నిర్మించు కొనుట చాలా మంచిది. సెప్టిక్ టాంకులు తూర్పు, ఉత్తరాలలో కట్టుకొనవచ్చును. లెట్రిన్ లో తూర్పు ముఖంగాను, పడమర ముఖంగాను కూర్చోన కూడదు. ఈశాన్యములో మరుగు దొడ్డి అసలు ఉండకూడదు.
12 . ఇంటిలోని గదులు అన్ని తూర్పు భాగమునకు పల్లముగా ఉండాలి. ఇంటిలో వాడిన నీరు తూర్పునకు గాని, ఈశాన్యమునకు గాని వెళ్లునట్లు ఇల్లు నిర్మించుకోవాలి.
13 . ఈశాన్య స్థలం ఎంత పెరిగితే అంత మంచిది.
14 . ఉత్తర దిశ ఉన్న స్థలం దక్షిణం వైపు ఉన్న స్థలం కన్న పల్లంగా ఉండాలి.
15 . గుడి గోపురాల నీడలు ఇంటిపై పడకూడదు. శివాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఇళ్ళ నిర్మాణం చేయ కూడదు.
16 . ఇంటికి తూర్పు వైపున, దక్షిణం వైపున ద్వారం గల ఇండ్లు శుభ దాయకంగా ఉండును. ఆ ఇంటిలో నివసించు వారికి అష్ట ఐశ్వర్యములు కలుగును.
17 . ఇంటి నిర్మాణమునకు ముందు పునాది త్రవ్వకం ఈశాన్యము నుండి ప్రారంబించవలెను.
18 . మన ఇంటికి తూర్పు వైపున ఉన్న స్థలం కలుపుకొనుట మంచిది. ఆగ్నేయం, నైరుతి, దక్షిణం ఉన్న స్థలాలను కలుపుకొనగూడదు.
19 . తూర్పు భాగాన స్నానాల గది నిర్మించుట మంచిది. దక్షిణాన గొయ్యి లేని స్నానాల గది నిర్మించుట ఎంతో శుభదాయకం.
20 . తూర్పు భాగాన గాని, ఈశాన్య భాగాన గాని భావి త్రవ్వించి, ఆ భావిలోని నీటితో ఇంటి నిర్మాణము చేయుట అన్ని విధాల మంచిది.

Popular Posts