నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతిఇంటా పఠించవలసిన భగవద్గీత పారాయణం చేయడం చాలా మందికి వీలుపడని విషయం. అందుకే కనీసం రోజుకి రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
శ్లోకంః
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవా శె్చైవ కిము కుర్వత సంజయః
సంజయా! కురుక్షేత్రం ధర్మాచరణకి యోగ్యమైన ప్రదేశం. నా కుమారులు కౌరవులు, పాండురాజు కుమారులైన పాండవులు యుద్ధంచేయడానికి నిశ్చయించుకుని అచ్చటికి చేరి ఉన్నారు. అచట వారేమి చేసితిరి?
సంజయ ఉవాచ.
శ్లోకంః దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దురోధన స్తదా
ఆచార్యం ఉప సంగమ్య రాజా వచనమబ్రవీత్
ఇరుసేనలూ అక్కడ చేరిన సమయంలో పాండవుల సేనను దుర్యోధనుడు చూసాడు. వ్యూహాలుగా విభజింప బడి యుద్ధ సంసిద్ధులై నిలిచిన ఆ సేనల్ని చూసి దుర్యోధనునికి భయం కలిగింది. వెంటనే ఆచార్య ద్రోణుని సమీపించి ఈ విధంగా తన భయాన్ని తెలియచేస్తున్నాడు.