నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతిఇంటా పఠించవలసిన భగవద్గీత పారాయణం చేయడం చాలా మందికి వీలుపడని విషయం. అందుకే కనీసం రోజుకి రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం
దృతరాష్ట్ర ఉవాచ.
శ్లోకంః పశె్యైతా పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం
వ్యూఢాం దృపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా
ఆచార్యదేవా! పాండవ సేనాపతి ధృష్టద్యుమ్ను డు మంచి బుద్ధిమంతుడు కనుక నీ శిష్యునిగా అనుగ్రహించ బడినాడు. నీ మరణము కోరి తన సైన్యసమూహాలని దుర్భేద్యమైన వ్యూహాలుగా తీర్చి నిలిచాడు. అందు వల్ల పాండవసేన బలము ఎంతగా పెరిగినదో చూడండి.
శోకంః అత్ర శూరాః మహేష్వాసాః భీమార్జున సమాయుధి
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః
ఆచార్యా! ఈ పాండవ సేనలో ఉన్న వారంతా భీమునంత బలము, అర్జునునంత విలువిద్యా పరాక్రమంతో తులతూగగలవారే. వారెవ్వరంటే, శ్రీకృష్ణుని సోదరుడు సాత్యకి, పాండవుల్ని కాపాడిన విరాటరాజు, ద్రౌపది తండ్రి, మహారధుని కుమారుడు ద్రుపదుడు మాత్రమే కాక మరికొందరు..