ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా
ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును
గూర్చిన విజ్ఞానం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్నవైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాదుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సాంప్రదాయములు కలవు.