Followers

Monday 22 July 2013

శ్రాద్ధకర్మలు నిర్వర్తించుట అనునది మానవులెుుక్క విధి. ఇందు ప్రతిఫలం ఆశించరాదు.


మహాలయమనగా! మహన్‌-ఆత్యంతి కోలయో యత్ర=మహాలయః అని వ్యుత్పత్తి. అట్టి మహాలయము ఎందుకు ఆచరించాలి? దాని ప్రాశస్త్యము ఏమిటి? అన్న విషయాలు ముందుగా తెలుసుకుందాం!

‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమంపక్ష మాశ్రీతాః
కాంక్షంతి పితరః అన్న మప్యస్వహం జలమ్‌.’’


mahaఅనగా! మన పితృదేవతలు ‘ఆషాఢమాసము రెండు పక్షము లు మెదలు తిరిగి భాద్రపద కృష్ణ పక్షము’ వరకు గల ఐదుపక్షము లు మన పితృదేవతలు ఎన్నో ఇక్కట్లు పాలగుచుందురట! అందులకుగల కారణం సూర్యుడు కన్యా తులారాసుల నుండి వృశ్చికరాశి వచ్చువరకు ప్రేతపురి శూన్యముగా నుండునని; అందు వల్ల ఆ కాలమందు మన పితృదేవతలు అన్నోదక ములు కాంక్షిస్తూ భూలోకమున వారివారి గృహముల చుట్టు ఆత్రతంగా తిరుగుచుందురు అనియు భార తము పేర్కొనుచున్నది.అందువల్లనే మరణాంతరము నిర్వర్తించే ఈ కర్మలకు అంతటి ప్రాధాన్యత కలిగి యున్నది కాబట్టి, అంత్యకాలమందు ‘కర్ణుడు’ కృష్ణ పరమాత్మను చివరిగా ఒక కోరినాడట. కృష్ణా ! ‘‘నా జన్మవృత్తాంత రహస్యము దయతో ధర్మరాజుకు సవిస్తరముగా వివరించి వానిచే తనకు పిండప్రదా నములు గావించమని’’ కోరి నాడుట! 

వానికోరికను పరమాత్మ అంగీకరించి ధర్మరాజుచే ఆకార్యక్రమము చేయించినాడుట! అలా ధర్మరాజు 77 వేలమందికి పిండప్రదానాదులు గావించి వార్కి సద్గగతులు కల్పించినాడు. కావున ఈ శ్రాద్ధకర్మలు నిర్వర్తించుట అనునది మానవులెుుక్క విధి. ఇందు ప్రతిఫలం ఆశించరాదు. నూరు యజ్ఞాలు చేయడం కన్న, మన వంశ వృక్షానికి కారకులయిన పితృదేవతల తర్పణాలే! ఎంతో ముఖ్యమైన విగా ఎప్పబడినవి. ఈ విషయమందు అలక్ష్య భావన ఎంతమాత్రము కూడదు అని దైవజ్ఞులు చెప్తారు. ఇంకా, వారు వారి ప్రవచనాలలో ఇలా చెప్తారు. విశ్వదేవతలు పదమూడు మంది అని వారు 1. క్రతు 2. దక్ష 3. సత్య 4. వసు 5. ధూళి 6. రోచన 7. పురూరవ 8. ఆర్ద్రన 9. కాల 10. కామ 11. ధనురుచి 12. రుద్ర 13. విలోచన. ఏకోదిష్ట-హేమ-పార్వణ సిద్ధాంతములలో ఏదో ఒక్క పద్ధతిలో ఈ పితృకార్యములు చేయుట శ్రేష్టమని చెప్తారు.

ఇక ఉత్తరాయణం దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని, దక్షినాయణం పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసము. మహాలయమంటే! భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి, ఇక్కడొక స్మృతి కారిక.

యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్‌
తదస్య క్షయమేవస్యాత్‌ వర్షాసుచ మఘాసుచ


అనగా వర్షఋతువునందు భాద్రపద కృష్ణత్రయోదశి మఘా నక్షత్రంతో కూడి వున్నప్పుడు దేనితో కూడినా, ఏ పదార్థంతో శ్రాద్ధం చేసినా. అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుం దట...! అంతటి విశిష్ఠత గాంచిన ఈ మహాలయ పక్షంలో అన్నివర్ణముల వారు వారిశక్తిని బట్టి ‘చతుర్దశి’ తిధిని విడువ కుండా పదిహేనురోజులు ఆచరిస్తారు. అలాశక్తిని లేనివారు తమపెద్దలు మరణించిన తిథినిబట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరిస్తారు. గతించినవారి తిథి గుర్తులేనప్పుడు ‘‘మహాలయ అమా వాస్యే’’ నిర్ణయింపదగినది. మరియు ఋతు దోషము వల్లగాని, కాలదోషము వల్లగాని, జాతామృతశౌతము అస్పర్శ గలిగినప్పుడు కూడా ఈ అమావాస్యయే పితృకర్మ లన్నింటికీ ప్రామాణిక దినము. ఈ పితృకార్య నిర్వహణలో కొం దరయితే! మనం ఇక్కడ పెట్టేశ్రాద్ధం అక్కడి పితృదేవతలకు ఎలా చేరుకుంటుంది? అని వితండవాదం చేసేవారు నేటి సమాజంలో కూడా లేకపోలేదు పోనీ... వారి బాటలోనే ఒకసారి ఆలోచిద్దాం....!

మనభారతీయ సంస్కృతిలో వైదికమార్గాన్ని, ఋషివాక్యాన్ని విశ్వసించే మతం మనది. అంతటి పుణ్యపురు షూలైన వారు కూడా వీటిని గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. అలా అని భావితరాలవార్ని తప్పుడు మార్గంవైపు నడిపించే అగత్యం వార్కిలేదు. అందువల్లనే మనపూర్వీకుల నుండి నేటివరకు ‘‘ఆర్షధర్మం’’ మీద విశ్వాసముంచు కున్నవారు ఎన్నడూ చెడిపోలేదు అని పెద్దలు చెప్తారు.మరోవిషయం ఆలోచిద్దాం! ఎక్కడో సుదూర ప్రాంతమందుగల ‘‘ఢిల్లీ ఆకాశవాణి’’ కేంద్రంనుండి వెలవడే మాటలు, పాటలు, మన కంటికి ఏ మాత్రమా కనిపించని రీతిలో ‘‘శబ్దగ్రాహకములైన కొన్ని అణువుల సముదాయముతో వాయు తరంగాలై మోసుకునివచ్చిన మాటలు పాటలు వినగలుగుతున్నామంటే’’! ఆలాగునే మనం ఇక్కడ పెట్టి శ్రాద్ధ ద్రవ్యంలోని ఆహారసారాన్ని మన పితృదేవతలు అందుకుంటారు అని ! 

జ్ఞానధనులైన మనపెద్దలకు అంతటి విశ్వాసము వున్నది గ్రహించవలెను. అంతేకాని, మనకు ఎంతో పూజనీయులైన మహర్షుల వాక్యంపైనా, పెద్దలపైనా విశ్వాసముపైన అప్రమాణబుద్ధితో చూచుటకూడా మరి దోషమేకదా....కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా మహాలయ పక్షాలను ఆచరించి, వారి వారి వారి వంశవృక్షమూలకారకులైన పితృదేవతల శుభాశీస్సులతోపాటుగా, ఆచంద్ర తారార్కమూ వంశాభివృద్ధితోపాటు సర్వశుభములు పొందుదురు గాక !


Popular Posts