కలియుగంలో మానవులు దిశానిర్దేశములు లేక ఎవరు ఏవిధంగా చెబుతారో అదే నిజ ము అని నమ్ముతారు. మతం చెప్పే విషయాలు వక్రంగా తెలియబర్చి పబ్బం గడుపుకుంటారు ప్రవక్తలు. మతం అసలు రహస్యం శోధనతో భగవంతుడిని తెలుసుకోవటం అని అందరూ తెలుసుకోవాలి. కాలగర్భంలో మతం పుట్టుక, చరిత్ర జరిగిన కాలంతో పోలిస్తే చాలా చిన్నది. మతం భగవంతుణ్ణి ’ఫలానా దేవుడు’ అంటూ ఒక వర్గాన్ని విభజించడం.... అలాగే మతాలు అంటే పదిరకాలుగా దేవుణ్ణి ప్రార్థించటం కాదు అని మానవుడు గ్రహించవలసి వుంది.
భగవంతుడు
ప్రతీ మానవుడు భగవంతుని ప్రార్థించాలి. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సృష్టికర్త. ఈ లోకంలో రెండు మార్గాలు కనిపిస్తాయి. 1, శ్రేయమార్గము. 2. ప్రేమ మార్గము. జ్ఞానులు, యోగులు ముక్తి మార్గము ద్వారా ’’శ్రీయోగమార్గము’’ నందు మంచిని గ్రహించి, దానిని అనుసరిస్తారు. అల్పబుద్ధి గలవాడు, అజ్ఞాని, సంపాదన ధనార్జన నిజమనకుంటూ ఐహిక సుఖా లకు అలవాటు పడి ప్రేమ మార్గాన్ని ఎంచుకుంటాడు.’’దేవుడు అనగా సర్వము ప్రసాదించిన యజమాని ’’. దేవము అంటే వేదాలలో చెప్పినట్టు పుణ్యకార్యం చేయువాడు అని అర్థం. ’తేనత్యక్రేన భుంజీధాః’ అంటే సృష్టి అంతా భగవంతుని ప్రతిఫలాపేక్ష లేనిది. ఈ సృష్టిని అనుభవించు జీవులు ’భక్తి పూజ’ కల్గి యుండటం దైవత్వం.
‘సహనావవతు సహనౌభునక్తు! హవీర్యంకరవావహై తేజస్వీ నావధీతమస్తు మావిద్వాషావహై! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః’. ‘దేవుడు అనే పదానికి అర్హమైన సృష్టికర్తా! నీకు మేము ప్రమాణం చేయుచున్నాం. సర్వకాల సర్వావస్థలందు నిన్ను మరవం. నీవు ప్రసాదించిన జీవనంతో అందరం ఆయుః ఆరోగ్య అష్టైశ్వ ర్యాలను తృణప్రాయంగా భావించి స్వార్థచింతన లేకుండా పుణ్యప్రదం కల్గి వుంటాం. అందరి సహజీవనం శాంతియుతంగా సాగిస్తాం’ అని అర్థం. శ్రేష్ఠులు, మంచివారు, ఉత్తమ పురుషులు. విజ్ఞానులు, తత్వ భోధకులు ఆచారవ్యవహారములు ఏ విధంగా ఆచరింతురో ఇతరుల కూడా దానిని ప్రామాణముగా భావించి నడుచుకుంటారు. అందుకు కొన్ని నియమాలు ఉన్నాయి అవి, 1, ఆధ్యాత్మికము 2, అధిభౌతికము 3, అధిదైవికము ఈ నియమాలకు మానవుని ఆలోచనలో ఒకే అర్థం వుండాలి.
భగవంతుని తాపత్రయము, రోగములతో శరీరమునకు కల్గు లోపము, ఇంద్రియములు, మనస్సుల వికా రము, చిత్తచాంచల్యమునకు శరీరంలోని జీవుడు బానిసకాకుండా, ప్రవక్తల అర్థాన్ని మానవుడు నాది నా మతము, నాదేవుడు అనే చపలత్వం లేకుండా దైవప్రేరణ కల్గియుండటం దైవత్వం అనబడుతుంది. కాల ప్రయాణం బ్రహ్మదినం 14 మన్వంతరాలు మరియు సంధికాలం కలిపి 4,32,00,00,000 సంవత్సరాలు అనగా 1000 చతుర్యుగములు. మన్వం తరం 71 చతుర్యుగములు అనగా 30, 67, 20, 000 సంవత్సరాలు. చతుర్యు గములు అంటే సత్యయుగము, త్రేతాయు గము, ద్వాపరయుగము, కలియు గము కలిపి మొత్తం 43,20,000 సంవత్సరాలు. ఇప్పటికీ సృష్టి ఆరంభం నుండి 1,84,03,20,000 గడిచినవి. కలి యుగం 5105 సంవత్సరాలు గడిచింది. ఇన్నికోట్ల సంవత్సరాల నుండి మన పంచాగం కాలగణన జరుగుతూనే వుంది. ఇప్పటికీ 196 కోట్ల 08 లక్షల 53 వేల 105 సంవత్సరాలు కాలగర్భంలో గడిచాయి.
మతాలకు పూర్వం
2000 సంవత్సరాలు పూర్వం క్రీస్తుమతం లేదు. 1400 సంవత్సరాలకు పూర్వం మహమ్మద్ ప్రవక్త చెప్పని మతం లేదు. వీటికి పూర్వం భౌద్ధ, జైన, హిందూమతాలు మొదలయినట్లు తెలుస్తోంది. మరి వీటికి పూర్వం విజ్ఞానం తెలియబర్చినట్లు, కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వమే సృష్టి ఆరంభయినట్లు పరిశోధించి తెలుసుకున్నారు. జ్యోతిష్యసిద్ధాంతం ప్రకారం సృష్టి ఆరంభం అయి ఆరు మన్వంతరాలు గడి చాయి. ఏడవ మన్వంతరం గడుస్తోంది. ఇంకా ఏడు మన్వంతరాలు నడవాల్సివుంది.