Followers

Sunday, 28 July 2013

జుట్టు రాలడం సమస్యగా ఉందా?..




చాలా మంది అందంగా ఉన్నా, జుట్టు మాత్రం గడ్డి లాగా ఉంటుంది.దీనితో వారు సహజం గా అందం గా ఉన్నా జుట్టుకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియక దిగులు పడుతూ ఉంటారు.కొంచెం సమయమం కేటాయిస్తే అందమైన, పట్టు కుచ్చు లాంటి జుట్టు మీ సొంతం..!! అది ఎలా అంటే..తలంటి పోసుకునే ముందు రోజు రాత్రి ఆలివ్ ఆయిల్, ఆముదం, కొబ్బరినూనె ఈ మూడు సమభాగాలుగా తీసుకుని కొంచెం గోరు వెచ్చగా చేసి 5నుండి10 నిమిషాలు మునివేళ్ళతో మృదువు గా మసాజ్ చేయండి.తరువాత రోజు పొద్దున వీలైతే కుంకుడుకాయల తో కాని, మీ తలకి సరిపడిన మంచి మైల్డ్ అంటే ఎక్కువ కెమికల్స్ లేని షామ్పూ తో శుభ్ర పరుచుకోండి.ఇలా వారానికి 2 సార్లు చేయటం ద్వారా నెల తిరిగే సరికి మీ జుట్టు లోని మార్పు ను మీరే గమనిస్తారు.!!మీ జుట్టు కు మంచి మెరుపు రావటము కోసం ఇలా చేయండి.
కేశ సౌందర్య కానుక మీ జుట్టు కోసం
మీ జుట్టు తలంటి పోసుకున్నా కూడా నిర్జీవం గా ఉందా??ఐతే మీ జుట్టు మెరుపు కు “మన అమ్మ” చిట్కా!!దీనివల్ల మీజుట్టుకు మెరుపు మాత్రమే కాక, మృదువు గా అవుతుంది..!! మామూలుగా మీ తలంటి అయ్యాక , చివర్లో ఒక నిమ్మచెక్క ను తీసుకొని ఒక మగ్గు గోరు వెచ్చని నీళ్ళలో పిండి, ఆ నీళ్ళను తలమీద పోసుకోండి.తరువాత మరొక మగ్గు మామూలు నీళ్ళను పోసుకోండి.ఇంతే మీరు చేయాల్సింది…ఎంత సులువో చూశారా!..
చక్కని జుట్టు కోసం
అందమైన, దట్టమైన, నల్లని, నిడుపాటి కేశసంపద అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ ఉరుకులు పరుగుల నేటి జీవితంలో కేశసంరక్షణ కోసం తగినంత సమయం కేటాయించే అవకాశమే కనిపించటం లేదు. అయినప్పటికీ, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఎవరైనా చక్కని నిగనిగలాడే కేశపాశంతో అందరి దృష్టిలోనూ అందగత్తెలుగా నిలవవచ్చు.
జిడ్డుగా వుండే జుట్టుకు తరచూ అంటుకుపోయే సమస్య ఎక్కువగా వుంటుంది. మైల్డ్‌ షాంపూను రోజూ వాడటం లేదా వారంలో మూడు రోజులు వాడటం వల్ల ఈ అంటుకుపోవటం తగ్గుతుంది. ఎండిపోయినట్లుగా వుండే జుట్టుకు మూడు రోజుల కోసారి షాంపూ చేసుకోవటం మంచిది. ఇలాంటి రకం జుట్టుకు, క్రీమ్‌ వున్న షాంపూలు మేలు చేస్తాయి.
షాంపూను ఎప్పుడూ నీటిలో కలిపిన తరువాతే తలకు పట్టించుకోవాలి. నేరుగా షాంపూలను తలకు పట్టిస్తే, జుట్టు బలహీనమవుతుంది.
షాంపూ చేసుకున్న వెంటనే జుట్టుకు కండిషనర్‌ పట్టించుకుంటే, జుట్టు పట్టుకుచ్చులాగానూ, మెరుస్తూనూ వుంటుంది. జిడ్డుగా వుండే జుట్టుకు, 1/2 మగ్గు నీటిలో 1 చెక్క నిమ్మరసం, 1 చెంచా వినిగర్‌ కలిపి కండిషనర్‌లా వాడుకోవాలి. శుష్కమైన కేశాలకు క్రీమ్‌ కలిసిన కండిషనర్‌లను వాడాలి.
జిడ్డుగా వుండే జుట్టుకు మసాజ్‌ చేసేటప్పుడు, నూనెకు మారుగా హెయిర్‌ టానిక్‌ వాడాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా వుంటుంది.
అప్పుడప్పుడూ చక్కని క్లినిక్‌లో జుట్టుకు లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటుంటే, జుట్టు కుదుళ్లు దృఢంగా వుంటాయి. వారంలో ఒకసారి ఇంట్లోనే స్టీమ్‌ మసాజ్‌ చేసుకోవచ్చు. జుట్టుకు నూనె బాగా రాసుకుని మర్దన చేసుకుని, గంట తరువాత వేడి నీటిలో టవల్‌ను తడిపి, పిండి, తలకు చుట్టుకోవాలి. కాసేపటి వరకూ మళ్లీ మళ్లీ తడుపుతూ, చుట్టుకుంటూ వుండాలి.
నీరు బాగా తాగటం వల్ల తల మీది చర్మంలో తగినంత తేమ నిలిచి వుంటుంది. చుండ్రు వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. అందుకని రోజులో 10 నుంచి 15 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి.
టవలూ, దువ్వెనా, ఎవరివి వారికే వుండాలి. అలా జాగ్రత్త పాటిస్తే, ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. జుట్టూ ఆరోగ్యంగా వుంటుంది.
జుట్టు, కెరోటిన్‌ ప్రోటీన్‌తో తయారవుతుంది. జుట్టు బాగుండాలంటే, కెరోటిన్‌ ప్రోటీన్‌ వుండే పదార్థాలైన పాలు, పాలతో చేసిన పదార్థాలు, బీన్స్‌, సోయా, గుడ్లు, మాంసం, చేపలు బాగా తీసుకోవాలి. జుట్టు రాలటం, బలహీనం కావడం జరిగితే, ఏదైనా మంచి బ్యూటీ క్లినిక్‌లో ఓజోన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. దీని వల్ల జుట్టు దృఢంగా వుండటంతో పాటు, కొత్త జుట్టు కూడా పెరుగుతుంది.
నెలకు ఒకసారి జుట్టుకు గుడ్డు పట్టించి, 20 నిముషాల తరువాత కడిగేయాలి. ఆ పైన షాంపూ చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలదు; జుట్టుకు కొత్త మెరపూ వస్తుంది.
నెలకు ఒకసారి జుట్టుకు తప్పకుండా మెహందీ పెట్టుకోవాలి. మెహందీ, జుట్టుకు మెరపు నీయటంతో పాటు, మంచి కండిషనర్‌గానూ పని చేస్తుంది.
తలంటుకునే రోజు మందు రాత్రి పడుకునే ముందు లేదా తలంటుకునే అరగంట ముందు జుట్టుకు నూనె రాసి, కడిగేయాలి. దీని వల్ల జుట్టుకు కావలసిన తేమతో పాటు, కాంతి కూడా నిలిచి వుంటుంది. జుట్టుకు పరమశత్రువు చుండ్రే కనుక యాంటి డాండ్రఫ్‌ షాంపూలు వాడాలి. దీనితో చుండ్రు సమస్యను శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు.‌

Popular Posts