Followers

Saturday, 20 July 2013

భ్రాంతిని తొలిగించే గీత

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతిఇంటా పఠించవలసిన భగవద్గీత పారాయణం చేయడం చాలా మందికి వీలుపడని విషయం. అందుకే కనీసం రోజుకి రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం
దృతరాష్ట్ర ఉవాచ.
dialogశ్లోకంః అన్వేచ బహవ శ్శూరాః
మదర్థే త్యక్త జీవితాః
నానా శాస్త్ర ప్రహరణాః
సర్వే యుద్ధ విశారదాః

నేను చెప్పిన ఏడుగురే కాక చాలామంది వీరులున్నారు. వారంతా నా విజయం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక నిలిచియున్నారు. అంతా రకరకాల ఆయుధాలు ప్రయోగించగలవారు. మంచి యుద్ధ కౌశలం కలవారే అయినా పాండవుల సంఖ్యకంటే లెక్కించదగ్గవారు కారు. 
శ్లోకంః అపర్యాప్తం తత్‌ అస్మాకం
బలం భీష్మాభిరక్షితం
పర్యాప్తంతు ఇదమేతేషాం
బలం భీమా భిరక్షితమ్‌

ఆచార్యా! మన సేనలో వీరుల సంఖ్య తక్కువ. పాండవ సేనలో చాలామంది ఉన్నారు. అందువలన భీష్ముడు మన సేనను రక్షిస్తున్నా, పాండవుల్ని జయించడానికి చాలదనే అనిపిస్తున్నది. భీముని రక్షణతో ఉన్న పాండవసేన నా దగ్గరగా మీద పడుతున్నట్లు కనిపించుచున్నది. మనల్ని ఓడించడానికి సమర్ధవంతమైనదిగా గోచరిస్తోంది.

Popular Posts