Followers

Wednesday 24 July 2013

ఆలోచన-ఆయుధం

కెరటాలపై తేలుతూ,   ఆటుపోట్లను  ఎదుర్కొంటూ,  నీటి  మీద  నిలదొక్కుకుంటూ, నావ  గమ్యం  చేరడానికి  చుక్కాని  మీద  నియంత్రణ  ఎంత  అవసరమో...

మనిషి  జీవితంలో కూడా  కష్ట, సుఖాలను  ఎదుర్కొంటూ, ఆనందడోలికల్లో  తేలియాడుతూ   గమ్యాన్ని/లక్ష్యాన్నిచేరడానికి  "ఆలోచనల" మీద  నియంత్రణ  కూడా  అంతే  అవసరం..

మానవ జీవితాన్ని  దిశా, నిర్దేశం  చేసేది  మరియు ముందుకు నడిపే చుక్కాని కూడా   "ఆలోచన" లేదా "ఆలోచనల సముదాయమే" .. నా ఈ జీవిత అనుభవాల పరంపరలో నేను నేర్చుకున్న నీతి, తెలుసుకున్న సత్యం "అన్నిటికి మూలం ఆలోచనే" అని.  

ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే దాని గురించి ప్రతి క్షణం (లేక ఎక్కువ సేపు)  ఆలోచించగలిగితే చాలు..ఖచ్చితంగా  అనుకున్నది సాదించగలిగే శక్తీ, యుక్తి తో పాటు అనుకున్నది తొందరగా  సాదించటానికి వీలవుతుంది.  అది చదువు , ఉద్యోగం , స్నేహం,  ప్రేమ, లక్ష్యం కావొచ్చు, మరేదైనా కావొచ్చు... అది ఎంత చిన్నదైన లేక ఎంత పెద్దదైన కావొచ్చు విజయం నీ ముంగిట అనతికాలంలోనే రెక్కలు కట్టుకొని వాలుతుంది. 

మానవ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దోకోవడానికి  కావాల్సిన ఒకే ఒక ఆయుధం "ఆలోచన" ... ఆలోచనలు మంచివైతే నీ పయనం మంచి వైపు...ఆలోచనలు  చెడువైతే నీ దారి చెడువైపు...

ఆలోచనలు  - మాటలుగా  మాటలు - చేతలుగా చేతలు - ఇస్టాలుగా 
ఇస్టాలు - అలవాట్లుగా (ఆచరణలు) 
అలవాట్లు - స్వభావాలుగా  (వ్యక్తిత్వంగా ) 
స్వభావాలు - తలరాతలుగా  పరివర్తన చెందుతాయి..

అంటే ఒక్క నీ ఆలోచనల సమాహారమే నీ జీవితాన్ని నడిపే ఆయుధం... నీ మాటే నీవు సృష్టించుకొనే ప్రపంచం  (Word Makes World) ... కావున 

చెడు ఆలోచనలను నియంత్రించుకో...
మంచి ఆలోచనలను పెంపోదించుకో... 
ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకో..
మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో..
మంచి సమాజాన్ని సృష్టించుకో..
అందరికి ప్రేమను పంచుతూ..అందరికి సేవ చేసుకొంటూ.. జీవిత లక్ష్యాన్ని చేరుకో...    

జీవిత సమరంలో కష్టాల్, సుఖాల్, దుఖాల్ ఏమి ఎదురైనా మొక్కవోని దైర్యంతో, మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకో... ఈ ప్రపంచాన్ని అంతటా ప్రేమను పంచే ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో.... ఇందుకు నీ  వంతుగా మంచి ఆలోచనలు అభివృద్ధి  చేసుకో....  

Popular Posts