Followers

Wednesday, 1 May 2013

వివాహం కాని ఆడపిల్లలు ఏ పారాయణం చేయడం వలన మంచి జరుగుతుంది?





పెళ్లి కానీ పిల్లలు , కోరికలు కలిగిన వారు  తిరుప్పావై  

పారాయణం చేయడం వలన  అవి ఫలిస్తాయని  

భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన   గోదాదేవి  

మానవమాత్రులని  కాక రంగనాదుడినే వివాహం 

చేసుకుంటానని  దీక్ష బూనుతుంది.  ఆ కారణముగా 

ఆమె ధనుర్మాసంలో  వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ 

చేస్తూ  తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని  ఒక 

పద్యం  అనగా పాశురం రూపంలో రచించేది. 

     అలా 30  పాశురాలను  ఆ మాసంలో రచించి 

వాటిని విష్ణువుకు  అంకితం చేసింది.  వెంటనే విష్ణువు 

ప్రత్యక్షమై  ఆమెను శ్రీరంగం రమ్మని  చెప్పగా ఆమె 

కోరికపై  ఆమె తండ్రి గోదాదేవిని  తీసుకొని శ్రీరంగం చేరి  

రంగనాధ స్వామితో  వివాహం జరిపిస్తాడు.  వివాహం 

జరిగినంతనే  గోదాదేవి రంగానాధుని పాదాల చెంత 

మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

Popular Posts