Followers

Monday, 1 July 2013

పత్రం పుష్పం, ఫలం, తోయం

పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే ప్రయచ్ఛతి
Off


తదహం భక్త్యువహృత, మశ్నామి ప్రయతాత్మనఃభక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే నాకు ఒక ఆకునుగానీ, ఒక పుష్పాన్నిగానీ, ఒక పండును గానీ, కొద్దిపాటి జలాన్నిగానీ సమర్పిస్తారో, అట్టివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరిస్తానని గీతలో శ్రీకృష్ణపరమాత్మ సెలవిచ్చాడు. స్వామి ఈ నాలుగు వస్తువులనే ఇక్కడ సూచించడంలో, తక్కిన వస్తువులు పనికిరావని కాదు. అవి సులభంగా లభిస్తాయనే చెప్పడం జరిగింది. ఏవి లభించకపోరుునప్పటికీ, ఇవి (పత్రం, పుష్పం, ఫలం, తోయం) లభించకపోవు కదా! ఇంతటి స్వల్ప కానుకలతోనే భగవంతుడు సంతృప్తి చెందుతున్నాడు. పూజకు వస్తు ప్రధాన్యంకాక, భకిఇ్త ప్రధాన్యమని చెప్పడమే పరమాత్ముని ఉద్దేశ్యం. నిజం చెప్పాలంటే భగవంతునికి ఇచ్చి మెప్పించడం వస్తువు మన దగ్గర ఏముంది?


కొండంత దేవునికి కొండంత పత్రిని సమర్పించగలుగుతామా? ఉడుత చేసిన సాయానికంటే దాని భక్తిని మెచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. అందుకేనేమో మనం మాట్లాడుతున్నప్పుడు, ఏదో ఒక సందర్భంలో ‘ఉడుతా భక్తి’ అని అంటుంటాం. తనకు ఇచ్చిన ఉసిరి కాయకు ప్రతిగా శంకరా చార్యుల వారు, ఓ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షాన్నే కురిపిం చాడు. శబరి ఎంగిలి పండ్లను స్వీకరించిన స్వామి, ఆమెకు మోక్షాన్నే ప్రసా దించాడు. కుచేలుని అటుకులను బజారులో అమ్మితే ఒక్క నయాపైసా రాదు. ఆప్యాయతతో పేదమిత్రుడిచ్చిన అటుకులను స్వీకరించి, అతడిని ఐశ్వర్య వంతుడ్ని చేయలేదా?!మరి ప్రభావం దేనిలో ఉంది? వస్తువుల్లో మాత్రం కాదు. భావంలో ఉంది. భక్తిలో ఉంది. మన చేతిలోనున్న చిత్తు కాగితం పైసాకి పనికిరాదు. ప్రభుత్వం వారి ముద్ర పడితే అది విలువ సంతరించుకుంటోంది. అక్కడ కాగితమనే వస్తు ప్రభావం కాదు. ముద్ర ప్రభావమే. కాబట్టే పైశ్లోకంలో ‘భక్త్యా’, ‘భక్తువ హృత’ అని స్వామి రెండుసార్లు నొక్కి చెప్పాడు. స్వామి ఎంత చిన్న వస్తువు నైనా స్వీకరిస్తాడు. అయితే ఆ వస్తువుని సమర్పించుకునే వానికి ఓ అర్హత ఉం డాలి. అదేమి అర్హత అని అడిగితే, భక్తుడై ఉండటమే అర్హత అన్న సమాధానం లభిస్తుంది. ఇంకా కొన్ని లక్షణాలను జగద్గురు ఆదిశంకరాచార్య తమ ‘శివా నందలహరి’లో చెప్పారు.

అహింస, ఇంద్రియనిగ్రహం, సర్వభూతాలపట్ల దయాగుణం, క్షమాగుణం, శాంతిత్వం, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఎనిమిది మనఃపుష్పాలను ఆ విష్ణుమూర్తికి (సర్వేశ్వరునికి) అత్యంత ప్రీతికరమైనందున, పరిపూర్ణ విశ్వాసంతో, చిత్తశుద్ధితో మనం సమర్పించాలి.
ఒకానొక కాలంలో ఒక సాధువు కుటీరం నిర్మించుకుని, తన దగ్గరకొచ్చిన భక్తులను బోధన చేస్తూ, నిరాడంబరంగా కాలం గడుపుతుండేవాడు. ఒక ధనవంతుడు సాధు దర్శనానికొచ్చి, ఆ మరసటి దినాన తమ ఇంటికి ఆతిథ్యా నికి రావాలంటూ పిలిచాడు. సాధువు అంగీకరించడంతో పాద పూజతో ఆ సాధువుకి స్వాగతం ఏర్పాటు చేయబడింది. ఆ దంపతులు పద్ధతి ప్రకారం ఆచమనం చేసి, ‘ఆయురారోగ్య శ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్థకామమోక్ష చతుర్వధ ఫలపురషార్థ సిద్ధ్యర్థం గురుపూజామహం కరిష్యే’ అంటూ సంకల్పం చెప్పసాగారు. ఆ పలుకులను విన్న సాధువులేచి విసవిసా వెళ్ళి పోసాగాడు. ‘ఎందుకెళుతు న్నారు?’ అని దంపతులు అడగ్గా, అందుకా సాధువు, ‘అయ్యా! నీ పూజలొద్దు. నీ పురస్కారాలూ వద్దు.
raamపదిపువ్వులను పాదాలపై పెట్టి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, చతుర్విధపురుషార్థాలు ఇమ్మంటున్నావే?! ఆ వస్తు వులు నా దగ్గర లేవు’ అని సదరు దంపతులకు బుద్ధి చెప్పాడు. కాబట్టి నిజ మైన భక్తి ఇచ్చేదే గానీ, తీసుకునేది కాదు. ఓడేవాడు యోధుడు కాడు, వేడేవాడు భక్తుడు కాడు.భక్తినితప్ప అన్యం కోరడం భక్తుని లక్షణం కాదు. రాయబార సమయంలో శ్రీ కృష్ణుడు దుర్యోధనుని విందును తిరస్కరించి పేదింటి విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయనకు కావలసింది ప్రేమకానీ, ఆడంబరం కాదు. విదుర పత్ని మైమరచి అరటితొక్కలను అందిస్తే తిన్నాడట. భక్తుడు మైమరస్తే భగవం తుడు మరుస్తాడు. భక్తితో దేనిని ఇస్తే, దాన్ని తింటాడు. పైశ్లోకంలో ‘అశ్నామి’ అని ఆయనే చెప్పాడు కదా! అశ్నామి అంటే తింటానని అర్థం. ఆకుగానీ, పుష్పంగానీ, ఫలంగానీ, నీళ్ళుగానీ భక్తితో ఇస్తే తింటానని అన్నాడు. పండుని తింటానంటే సరిపోతుంది. 

ఆకును, పుష్పాన్నీ కూడా తింటానన్నాడే! భక్తికి పరవశుబైన భగవానుడు ఆకునైనా తింటాడు. పువ్వునైనా తింటాడు. భగవం తునికి సమర్పిస్తున్నప్పుడు, ఆయన మన ఎదుట ఉన్నాడా ఏమిటి? అన్న సందేహం కలుగవచ్చు. ఎవరికి సమర్పించినా ఆ భగవంతునికే సమర్పిస్తు న్నామన్న భావనతో సమర్పించాలి. అన్ని రూపాలు ఆయనవే కదా మరి! ఏ రూపంలోనైనా ఆయనే స్వీకరించవచ్చు.‘పత్రం, పుష్పం, ఫలం, తోయం’ అని వరుసగా చెప్పడంలో కూడా ఓ అంత రార్థం ఉంది. పత్రానికంటే పుష్పం, పుష్పానికంటే ఫలం, ఫలానికంటే తోయం (నీరు) ప్రశస్తమైనది. ముందుకెళ్ళేకొలది హింస ఉంటుంది. వెనక్కి వచ్చే కొలదీ హింస పాళ్ళు తక్కువ. ఇంకా లోతుగా చెప్పాలంటే, పత్రమంటే మరస్సు, పుష్పమంటే బుద్ధి. కాబట్టి జ్ఞానియైన భక్తుడు ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం’తో ఆ సర్వాంతర్యామిని సేవించి ముక్తిని పొందాలి.

భక్తినితప్ప అన్యం కోరడం భక్తుని లక్షణం కాదు. రాయబార సమయంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుని విందును తిరస్కరించి పేదింటి విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయనకు కావలసింది ప్రేమకానీ, ఆడంబరం కాదు. విదురపత్ని మైమరచి అరటితొక్కలను అందిస్తే తిన్నాడట. భక్తుడు మైమరస్తే భగవంతుడు మరుస్తాడు. భక్తితో దేనిని ఇస్తే, దాన్ని తింటాడు.

Popular Posts