శ్రీమన్నారాయణుడు భక్తజనవత్సలుడు. భక్తుల
కోరికలను తీర్చేందుకు తానే స్వయంగా రంగంలోకి
దిగుతాడు. ఆ మహావిష్ణువు తన భక్తుడైన అర్జునునికి
పార్థసారథిగా రథ సారథ్యం వహించాడు. స్నేహితుడైన
కుచేలునికి సకల మర్యాదలు చేసి అంతులేని ఐశ్వర్యాన్ని
ప్రసాదించాడు. పాండవులు రాజసూయయాగాన్ని చేస్తూ
అగ్రపూజలను అందుకుంటున్న సమయంలో, ఆ
యాగానికి వచ్చిన అతిథులందరికీ పాదపూజ చేసాడు.
ఇలా మనేకు ఎన్నో ఉదంతాలు కనబడుతుంటాయి.
కోరికలను తీర్చేందుకు తానే స్వయంగా రంగంలోకి
దిగుతాడు. ఆ మహావిష్ణువు తన భక్తుడైన అర్జునునికి
పార్థసారథిగా రథ సారథ్యం వహించాడు. స్నేహితుడైన
కుచేలునికి సకల మర్యాదలు చేసి అంతులేని ఐశ్వర్యాన్ని
ప్రసాదించాడు. పాండవులు రాజసూయయాగాన్ని చేస్తూ
అగ్రపూజలను అందుకుంటున్న సమయంలో, ఆ
యాగానికి వచ్చిన అతిథులందరికీ పాదపూజ చేసాడు.
ఇలా మనేకు ఎన్నో ఉదంతాలు కనబడుతుంటాయి.
నిత్యం ఆ స్వామిని స్మరించుకుంటూ మన పనులను
శ్రద్ధగా చేస్తున్నప్పుడు, తప్పకుండా మన జీవితం
ఫలవంతమవుతుంది. మనం చేయాల్సిన పనులను
శ్రద్ధతో చేస్తే చాలు, అదే పదివేలని పెద్దలు అన్నారు.
ఇందుకు వారు, పక్షులను, జంతువులను, కీటకాలను
మనకు ఉదాహరణలుగా చూపించారు. వాటిని విహంగ
(పక్షుల) మార్గం, మర్కట (కోతి) మార్గం, పిపిలికా
(చీమల) మార్గం అని మూడు రకాలుగా చెప్పవచ్చు.
1. విహంగమార్గం :
ఒక పక్షికి ఓ పండు దొరికిందనుకుందాం. ఆ పక్షి ఓ చెట్టు
కొమ్మపై కూర్చుని, కాళ్ళకింద పండును పెట్టుకుని,
ముక్కుతో పొడుస్తూ తింటున్నప్పుడు, అకస్మాత్తుగా
పండు కింద పడిపోవచ్చు. ఫలితంగా ఆ పక్షి కడుపు
నిండకపోవచ్చు. ఇంతకీ కారణం దాని ఆతృతే. అలాగే
కొంతమంది తాము చేయాల్సిన పనుల విషయంలో
అలుపులేకుండా చేయాలని ప్రయత్నిస్తుంటారు. పక్షి
తనకు దొరికిన పండును తినడానికి ప్రయత్నం
చేసినట్లన్న మాట. అయితే పనిలో వారు చూపిస్తున్న
తొందరే, వారి ప్రయత్నాలకు అడ్డుపడుతుంటుంది.
అందుకే నిదానమే ప్రధానమన్నారు.
2. మర్కట మార్గం:
అదే పండు ఓ కోతికి దొరికిందని అనుకుందాం, వెంటనే ఆ
కోతి తనకు దొరికిన పండును నోటికి కరచుకుని ఒక
కొమ్మ నుంచి మరో కొమ్మకు దూకుతుంటుంది. అలా
దూకుతున్నప్పుడు, ఏదో ఒక సమయంలో నోట్లోని పండు
కిందికి జారిపడిపోవచ్చు. ఈ విధంగా, చేసేపనిలో
స్థిరత్వం
లేనప్పుడు ఫలితం శూన్యంగానే లభిస్తుంది. పట్టు
సడలినప్పుడు పండు మట్టిపాలవుతుంటుంది. ఇక్కడ
పండు స్థానంలో మనం చేయాలనుకున్న పని అని
చెప్పుకోవచ్చు.