కార్యనిర్వహణకు, కార్యసాధనకు నిర్దేశించిన రెండు ప్రధానమైన దైనందిన సూత్రాలు, ‘ఆలస్యం అమృతం విషం’, ‘నిదానమే ప్రధానం’! ఆలస్యమైతే అమృతం విషమౌతుందేమో సందేహమే కానీ, నిదానంగా... నెమ్మదిగా... ఆలోచించి, నిర్ణరుుంచి చేసే కార్యం మాత్రమే కచ్చితంగా సఫలీకృతమౌతుందనీ, నిర్దేశమైన లక్ష్యాన్ని చేరవచ్చని, ‘నిదానమే ప్రధానం’ అని చెబుతుంది. అందుకనే ‘దానం కాని దానం’ ఏదని అడిగితే... దానంతో సమానమైనదేది అని ఎవరైనా చెబితే, అది ‘నిదానమే’నని ఘంటాపధంగా చెప్పవచ్చు.
‘కార్యనిర్వహణ కోసం, కార్యాతురణం కో సం, తపన పడనివారు విద్యార్జన కోసం ఎలా కష్టపడతారు? ‘విద్యాతురాణాం న సుఖం న నిద్రా!’ అటువంటి విద్య లేని వాడు సంపాదిం చలేడు. అతని దగ్గరకు ధనం ఎలా వస్తుంది?’ అని శాస్త్రం సహేతుకంగా ప్రశ్నిస్తుంది. క్రమం గా శ్రమ కోర్చి, కృషి చేసి, కృషి ద్వారా ఫలితం సాధించగలిగితే, క్షేమం, సుఖం, సౌఖ్యం తమం తట తామే వచ్చి తలుపు తడతాయి. క్షేమం ద్వారా సందప వస్తుంది. సంపద ద్వారా పోషణ వస్తుంది. పోషణ ద్వారా తనకు, సమాజానికి క్షే మం కలుగుతుందని శుక్ల యజుర్వేదం ప్రబో ధిస్తుంది.
తడ నోర్వక యొడలోర్వక
కడు వేగం బడచి పడిన కార్యంబగునే
తడ వోరిచన నొడలోర్చిన
చెడిపోయిన కార్యమెల్ల చేగూరు సుమతీ!
ఆలస్యం భరించలేక, శరీరశ్రమకు ఓర్చు కొన లేక, మిక్కిలి వేగంగా, త్వర త్వరగా చేసిన కార్య ము నెరవేరుతుందా? ఓరిమి వహించి, నేర్పుగా, ఆలస్యాన్ని సహించి, శరీర శ్రమను అనుభవిం చి, నెమ్మదిగా పని చేస్తే కార్యం తప్పకుండా నెర వేరుతుంది. సఫలీకృతమౌతుంది. పాడైపో యి న కార్యం సైతం ఓర్పు, నేర్పులతో చేయబ డిన ప్పుడు ఫలితం అందచేస్తుందని సుమతీ శతక కర్త హితవు.
ప్రయత్నం చిన్నదైనప్పటికీ, నెమ్మదిగా, మనసు పెట్టి ఏకాగ్రతగా కొనసాగితే ఫలితం చేకూరుతుంది. ‘ప్రయత్నం చేయగలుగుతున్నాననే’ అహంకారంతో ఎప్పుడో ఒకప్పుడు చేయవచ్చు గదా... అని ఒకింత బద్ధకించేవారిని ఫలరాహిత్యమే పలకరిస్తుందని పెద్దలు చెబుతారు. చీమ చిన్నదైనప్పటికీ, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, వెయ్యి యోజనా ల దూరం సైతం సునాయాసంగా చేరగలుగుతుం ది. ‘నేను రెక్కలు విప్పి ఎగిరితే చాలు, యోజన దూరం సైతం చిటికెలో అధిగమించగలనని’ కదల కుండా ఒక చోటే కూర్చుని ఉంటే, గరుత్మంతు డంతటివాడు సైతం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు గదా?బిడాల మూషికోపాఖ్యానంలో మూషికం చెప్పిన ట్లుగా భీష్ముడు ధర్మరాజుతో చెప్పిన మాటలు ‘నిదానాన్ని’ స్పష్టంగా విశదీకరిస్తాయి. కాలం కాని కాలంలో ఆలోచన లేకుండా... త్వరపడి చేసే కార్యం కర్తకు లాభం చేకూర్చనీయదు. అన్నింటినీ సమకూర్చుకొని నిదానంగా, నెమ్మది గా, సమయం, సందర్భం మొదలైనవన్నీ చూచు కొని అడుగు ముందుకు వేస్తే, అనుకున్నది సాధ్యమౌతుంది? దైవం, విధి, అలాంటి కార్యా నికే అనుకూలంగా ఉంటూ సంకల్పం సిద్ధింప చేస్తుందని భీష్ముడు విశదీకరిస్తాడు.
తామసించి చేయ దగదెట్టి కార్యంబు
వేగరంప నదియు విషమె యగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనెఏ పనినీ గర్వంగా చేయరాదు. తొందరపడి కూడా చేయరాదు. తొందరపడి చేస్తే ఆ పని విషమై పో తుంది. ఎలా విషమౌతుందో... వేమన సోదాహర ణంగా వివరిస్తాడు, చెట్టుకున్న పచ్చి కాయ అక్కడే ఉంటే, నెమ్మది నెమ్మదిగా, క్రమ క్రమంగా పండు గా పరిణమిస్తుంది. అలాగే పచ్చికాయను తెచ్చి ముగ్గబెటితే, ‘పండు’ అవుతుందో... కాదో తెలియదు. చెడిపోవడం మాత్రం సహజమేనని హెచ్చరిస్తాడు. ఏ పనైనా మొదలు పెట్టే ముందు ఎలా చేస్తే తేలికో... ఎలా చేస్తే కష్టమో అంచనా కట్టాలి. ఏ పద్ధతిని అవలంబిస్తే ఎటువంటి ఫలి తముంటుందో అంచనా వేయాలి. అందులో గుణ గణాలేమిటన్న అవ గాహన పొందాలి. అందులో దోషాలేవయినా వున్నాయేమో గమనించాలి. ఇవన్నీ తెలుసుకో కుండా పని ప్రారభించే వాడు చిన్నపిల్లవానితో సమానమని వాల్మీకి మహర్షి రామాయణం, అయోధ్యాకాండలో చెబుతాడు.
కొంత మంది మాత్రమే ముందుచూపుతో ఆ కార్యానికి సంబం ధించిన మంచి చెడులను గమనిస్తారు. ఫలితా న్ని చక్కగా ఊహించి దానిని బట్టి కావలసిన ముందు జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందువల్ల వారు విజయం సాధిస్తారు. ‘అభ్యాసము కూసు విద్య!’ ఎంతగా నెమ్మదిగా, త్వరపడకుండా అభ్యాసము చేస్తే, విద్య అంత త్వరగా వరిస్తుం ది. అంతగా సిద్ధిస్తుంది. మనం చేసే మంచీ చెడూ’ విచక్షణా జ్ఞానం బుద్ధిరూపంలో కటా ిస్తుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత ఫలితం కలుగుతుంది. అదృష్టం రూపంలో విధి అనుకూ లించినప్పుడు ఫలితం కూడా అలాగే ఉంటుం దని శాస్త్రం చెబుతుంది. అందుచేత పని చేసిన తరువాత వచ్చే ఫలితం ‘దైవాధీనం’ అని విజ్ఞులంటారు.
‘అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన’
‘తినగ తినగ... వేపపూలు... వేప చిగుళ్ళు తియ్యగా ఉంటాయి’ అని ఎవరికైనా సందేహ మొస్తే ‘తియ్యగా ఉంటాయనే’ వేమన సమా ధానం చెబుతారు. అలాగే మొదట గార్ధభస్వర ములా అనిపించిన రాగం, క్రమక్రమంగా, హాయిగా, కోకిలగానంలా తీయగా ఉందనిపిం చవచ్చు. కనుక ఈ భువిపై అసాధ్యమేదీ లేదు. సాధించలేనిదంటూ ఏదీ లేదు. సాధనముతో మాత్రమే పనులన్నీ సమకూరుతా యని భరోసా ఇస్తాడు.
ఫలపరీక్ష చేయకుండా పని ప్రారంభించినవాడి పరి స్థితి ఎలా ఉంటుందో వాల్మీకి రామాయణంలోని అయోధ్య కాండలో వివరిస్తాడు. నిష్ఫలమైన మోదు గ చెట్టుకు నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెబుతాడు. కాయలు కాయని మోదుగ చెట్టును ఫలముల కోసం పెంచడం ప్రారంభిస్తే, చివ రకు ఫలములు రాక నిరుత్సాహపడి నీరసపడి పోతాడు. కొంతమంది కళ్ళు మూసుకొని ఏదో ఒకటి జరుగుతుందనిలెమ్మని కష్టసుఖాలు ఆలోచిం చకుండా అనుభవజ్ఞుల సలహాలను పాటించకుండా పని ప్రారంభించి, చివరకు నిష్ఫలమైన పని చేశా నని బాధపడతారు. అందుకే ఏ పనిలోపైనా ముం దు ఆలోచన చేయాలి. సరియైన నిర్ణయానికి రావా లి. తీసుకొన్న నిర్ణయాన్ని క్రమశిక్షణతో అమలు పరచాలి. అప్పుడే ఫలితం చేకూరుతుంది.
గ్రంథాన్ని చదివి, దానిని మననం చేయకుండా, అభ్యాసం చేయకుండా, మస్తకంలోకి ఎక్కించకుం డా వదలి వేసిన విద్య అవసరం కలిగినప్పుడు జ్ఞాపకం రాదు. పనికిరాదు. అలాగే ఇతరుల ఆధీ నంలో ఉన్న ధనం మనకు అవసరమైనప్పుడు ఉప కరించదు. అభ్యాసం చేయని విద్య తాళపత్ర గ్రంథా నికో... అటకపై పుస్తకాల కట్టలకో పరిమితమౌ తుంది. విద్యానుభవం సాధించిన వారు, నిరంతరం విద్యాభ్యాసం సాధన చేసేవారు మాత్రం చర్చలలో పాల్గొంటారు. కనుక శ్రద్ధగా... నెమ్మదిగా... త్వర పడకుండా మనసునకు ఎక్కేటట్లు అధ్యయనం చేయాలని పెద్దలు చెబుతారు.
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగయ పట్ట వలదు
పట్టి విడుచుట కన్న పరగ జచ్చుట మేలు!
ఒక పనిచేయడానికి ముందుగా ఆలోచన, సాలో చ న కావాలి. ఆ పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత పూర్తి చేయాలనే పట్టుదల ఏర్పడాలి. పట్టు పట్టిన తర్వాత సాధించేంత వరకూ పట్టు వదల కూడదని వేమన అంటాడు. పట్టు దొరికిన తర్వాత గట్టిగా పట్టుకొమ్మని, పట్టువదలవద్దని అంటారు. పట్టు విడిచి పెడితతే పని పూర్తికాదు. కనుక పట్టు వదలడం కంటే మరణమే మేలని, కార్యసాధన వదలి పెట్టడం అవసానదశ అని హెచ్చరిస్తాడు.
ఏ పనిని ముందు చేయాలి? ఏ పనిని తరువాత చేయాలనే విషయాన్ని నిర్ణయించుకోలేని వారికి రాజనీతి తెలియదనే చెప్పాలని వాల్మీకి మహర్షి రామాయణంలోని యుధ్దకాండంలో వివరిస్తాడు. ముందు చేయాల్సిన పనులను వెనుక, వెనుక చేయాల్సిన పనులు ముందర చేయాలనుకునే రాజు ఎక్కువకాలం నిలవడు.
వెనుక పనులు ముందు, ముందు పనులు వెనుక చేస్తే ఆ రాజ్యం వృద్ధికి రాదు. పురుషయత్నం ప్రథమ సోపానమనీ, అది మనిషి లౌకిక జీవితంలో కలిగే సఖదుఃఖాలకు కారణభూతాలౌతాయని విజ్ఞులు చెబుతారు. పురు ష ప్రయత్నం చేయవద్దనే పలాయనవాదాన్ని ఎన్న డూ మన సంప్రదాయం సమర్థించదు. సమర్థించ బోదు.సముద్రంలో అలల మాదిరిగా, చక్రభ్రమణంలో మాదిరిగా వచ్చే సుఖదుఃఖాలు, చీకటి వెలుగులు, హాని వృద్ధి చేసే పని, సామర్థ్యాన్ని బట్టి కలుగుతా యని మహాభారతంలో కనిపిస్తుంది. కర్మఫలాన్ని బట్టి ప్రయత్న ఫలితం ఆధారపడి ఉంటుందని వ్యాసమహర్షి చెబుతాడు.
శ్రమ, ఆటంకాలు కలుగుతాయనే భయంచేత కొం దరు పనిని ప్రారంభించడానికి వెనుకాడతారు. వారి ని భర్తృహరి అధములని పిలుస్తాడు. పనిని మొద లు పెట్టిన తరువాత ఏర్పడిన అవరోధాలకు, విఘ్నా లకు భయపడి మధ్యలోనే వదలిపెట్టే వారిని మధ్య ములంటాడు. పని ప్రారంభించిన తరువాత విఘ్నా లు ఎదురౌతుంటే వారు భయపడరు. విధి నిర్వహణ నుండి వెనుదిరగరు. ఆటంకాలు ఎదురౌతున్నకొద్దీ వారి ఉత్సాహం రెట్టింపువుతుంది. రెట్టించిన ఉత్సా హంతోనే వారు విధి నిర్వహణ నిర్వహించి అజే యులై నిలుస్తారు. అటువంటి వారినే భర్తృహరి ఉత్త ములని నిర్వచిస్తాడు.
వారు ‘నివానులనీ’, ‘నిదాన మే ప్రధానమని’ హెచ్చరిస్తాడు.
బుద్ధిమంతులకు, కార్య సాధకులకు, కార్య నిర్వాహ ణకోసం నాలుగు సాధనాలను శంకరాచార్యుల వారు ప్రతిపాదిస్తారు. వానినే సాధన చతుష్టయమ ని అంటారు. అవి ఉన్నప్పుడే సత్య స్వరూపుడైన ఆత్మయందు నిష్ఠ సాధ్యమౌతుందని, అవి లేనివా నికి అది అసాధ్యమని ఆచార్యులవారు వివరిస్తారు. ‘నిత్యా నిత్య వస్తు వివేకము’ మొదటి సాధనమని, విరక్తి రెండవ సాధనమని, శమదమాది షడ్గుణ సంపద మూడవ సాధనమని, మోక్షాపేక్ష నాలుగవ సాధనమని నిర్వచిస్తారు.
దాటశక్యంగాని దానిని దాటించగలిగేది... పొంద శక్యముగాని దానిని పొందించగలిగేది. ప్రకాశింప శక్యము గాని దానిని ప్రకాశింపచేయగలిగేది, సాధించ లేని దానిని సాధ్యం చేయగలిగేది ‘తపస్సు’ మాత్రమేనని విజ్ఞులు చెబుతారు. దాని వలన మా త్రమే అసాధ్యమైనది సాధింపబడుతుందని, నిదా నంగా చేయగలిగినప్పుడు అది సుసాధ్యమౌతుం దని పెద్దలు అంటారు.నీతిశాలి అయిన, కార్యదక్షుడైన, ప్రణాళికాబద్ధు డూన శ్రీరామచంద్రుని కార్యాన్ని కోతులే నిర్వహిం చాయి గదా! అక్కడ నిదానమే గెలిచిందిగా. సము ద్రానికి సేతువు కట్టి, రాక్షససేనను ఓడించి, రావ ణుని చంపి, లంకాధిపత్యాన్ని, సీతను రాముడికి అప్పగించ లేదా! అందుకే... నిదానమే... ప్రధానం!