తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ ,మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా
పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము.
ఈ శరీరంలా మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే పూర్తి స్నానం యొక్క భావము.