Followers

Friday, 5 July 2013

జాతక పరిశీలన ఎలా చేయాలి ?



జాతక పరిశీలన ఎలా చేయాలి ?

జాతకము ద్వారా మానవుని జీవన విశేషములు తెలుసుకోవచ్చు . జాతక పరిశీలనలో అనేక మార్గములున్నవి . గ్రహ చారము , గో చారము , గ్రహ దశ , భావ విశ్లేషణ, గ్రహముల కున్న శుభత్వ , పాపత్వము లను , గ్రహల స్థితి , దృష్టి , యుతి గ్రహముల బలాబలములు ఇలా అనేక విధములుగా పరిశీలన చేసి ఫలిత నిర్ధారణ చేయవచ్చు .
గ్రహచారము అంటే ఏమిటి ?
జాతకులు జన్మించినపుడు గ్రహములు, రాశులు ఆధారముగా జాతకము తయారు చేసుకొంటాం . జాతకుడు పుట్టినపుడు ఉన్న గ్రహముల స్థితినే గ్రహ చారము అంటాం . వ్యక్తీ బ్రతికి ఉన్నంత కాలము ఇది శాశ్వతము .

గో చారము అంటే ఏమిటి ?
జాతకులు పుట్టినపుడు ఫలితములు తెలుసు కొనుటకు వీలుగా ఉంటుందని గ్రహాలను అవి ఉన్న స్థానాలను బట్టి రాశులలో వేసుకొని జాతక చక్రం తయారు చేసుకొంటున్నాం .కానీ గ్రహాలు అక్కడే స్థిరంగా ఉండలేదు . అవి నిత్యము సంచరిస్తూనే ఉన్నాయి . దీనినే గో చారము అంటారు .

మానవుడు పుట్టినప్పటి నుండి రోజు రోజు కు శారీరక , మానసిక స్థితులలో ఏ విధముగా మార్పులు కల్గుచున్నాయో , గ్రహాలు సంచరించే విధమును తెలుసుకొని ఫలిత నిర్ధారణ చేయుటకు ఉపయోగ పడును.  

గ్రహదశ : జన్మ నక్షత్రమును బట్టి  దశ ఏర్పడుచున్నది . దీనినే జన్మకాల దశ అంటారు . తదుపరి ఒకదాని తర్వాత మరొక దాస వస్తుంది . ఏ వ్యక్తికైనా ఫలితములు తెలుసుకొనేటప్పుడు నడుస్తున్న దశకు అధిపతియైన గ్రహమే అధికారిక గ్రహము . ఆ గ్రహము యొక్క బలమును బట్టి జాతకునకు కలుగు ఫలితములు ఆధారపడి ఉంటాయి .

భావ విశ్లేషణ : జాతకునకు సంబంధించి ఏ భావమును పరిశీలించాలని అనుకొంటున్నామో ఆభావ సంభంద గ్రహము , భావ కారకులను ముఖ్యముగా పరిశీలించాలి .

గ్రహములకు శుభత్వ, పాపత్వములు . : ఒక్కో లగ్నమును బట్టి శుభ గ్రహము పాప గ్రహముగానూ , పాప గ్రహము శుభ గ్రహముగాను మార్పు చెందును . జాతకులు జన్మ సమయమును బట్టి మార్పులు కలుగును .
గ్రహముల స్థితి , యుతి , వీక్షణ : జాతకులు పుట్టిన సమయములో గ్రహాలూ ఎక్కడెక్కడ ఉన్నాయి , ఏ ఏ గ్రహాలు కలసి ఉన్నాయి , ఏ గ్రహలచే చూడ బడు చున్నాయి . అనే విషయాన్ని చూడాల్సి ఉంటుంది .
ఇంకా అనేక విషయములను చాల నిశితంగా పరిశీలించి ఫలిత నిర్ధారణ చేయాలి .

Popular Posts