Followers

Friday, 5 July 2013

నక్షత్రములు - వాటి స్వరూపము


ఇక్కడ విశ్వంనంతటిని 360 డిగ్రీలుగా విభజిస్తే

డిగ్రీ నుండి 360 డిగ్రీలు పూర్తిచేసి తిరిగి యధాస్తానమునకు వచ్చుటకు అనగా భూమి సూర్యుని చుట్టి వచ్చుటకు 364.75 రోజులు పట్టుచున్నది .అనగా మేషరాశి ౦ డిగ్రీ వద్ద ప్రారంభమై 36౦ డిగ్రీలు పూర్తిచేయుటకు ఒకసంవత్సర కాలము పట్టుచున్నది. అంటే సుమారు ప్రతిరోజు భూమితనచుట్టూ తాను తిరుగుచు తన కక్ష్యలో ఒక డిగ్రీ ముందుకు జరుగు చున్నది. ఇలా 36౦ రోజులకు యధాస్తానమునకు చేరుచున్నది. అలా అనుకొన్నప్పుడు భూమి గమనములో తేడా వచ్చినప్పుడు చంద్రుని గమనములోకూడా తేడావచ్చును కదా? ఆలాంటప్పుడు భూమిచుట్టూ తిరిగే చంద్రుడు అనేక నక్షత్రముల మధ్య సంచరించును కదా? ఏలననగా
౦ నుండి ౩౦డిగ్రీలు మేషరాశి, ౩౦నుండి 60డిగ్రీలు వృషభరాశి, 60నుండి 90డిగ్రీలు మిధునరాశి, 90 నుండి 12౦ డిగ్రీలు కర్కాటకరాశి, 12౦నుండి 15౦డిగ్రీలు సింహరాశి, 15౦ నుండి18౦డిగ్రీలు కన్యారాశి ,18౦ నుండి 21౦డిగ్రీలు తులారాశి, 21౦ నుండి 24౦ డిగ్రీలు వృశ్చికరాశి, 24౦నుండి 27౦ డిగ్రీలు ధనుస్సురాశి , 27౦ నుండి ౩౦౦ డిగ్రీలు మకరరాశి ౩౦౦నుండి ౩౩౦డిగ్రీలు కుంభరాశి ౩౩౦ నుండి ౩60డిగ్రీలు మీనరాశి
ఈవిధంగా ఉన్నప్పుడు భూమితోపాటు సూర్యుని చుట్టే తిరిగే చంద్రుని గమనములో మార్పులుండునుకదా?
ఇప్పుడు మనము చూస్తున్న నక్షత్రములకు, జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడిన నక్షత్రములకు పొంతన కుదురుటలేదు.
జ్యోతిష్యశాస్త్రములో చెప్పిబడిన విధానము జ్యోతిష్యశాస్త్రములో గ్రహచక్రమును తయారు చేసేటప్పుడు చంద్రుని గమనమునుబట్టి నక్షత్రమును వేయుచున్నాము.
దీని వివరమేమనగా భూమిని  36౦ డిగ్రీలుగా విభజించు కొంటె చంద్రుడు సుమారు 4 నిమిషములకు ఒక డిగ్రి చొప్పున 24 గంటలలో భూమిని చుట్టి వచ్చుచున్నాడు. చంద్రుని యొక్క గమనమును బట్టి ప్రతి 13 డిగ్రీల 20 భాగములను {ఒకడిగ్రీకి 60 భాగములు} ఒక నక్షత్రముగా వర్ణించినారు. జాతకుడు జన్మించిన సమయమును బట్టి చంద్రుని గమనమును అనుసరించి నక్షత్రమును నిర్ణయిస్తున్నాము. ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా ప్రతి పదమూడు డిగ్రీల ఇరవై భాగాల పరిమాణమును ఒక నక్షత్రము గా  ప్రతి ముప్పై డిగ్రీలను ఒక రాశిగా విభజించి వాటికి మన మహర్షులు నామకరణం చేసారు. అంతే కానీ సృష్టిలోఉన్నవి ఇరవైఏడు నక్షత్రములే అన్నది మహర్షుల ఉద్దేశ్యము కాదని  అభిప్రాయము .

 జ్యోతిష్యశాస్త్రజ్ఞులు వేరు. జ్యోతిష్యులు వేరు . భారత దేశములో మన పూర్వికులు మరియు మన మహర్షులు మనకందించిన అద్భుతమైనది జ్యోతిష్య శాస్త్రము. ఈ శాస్త్రము  ద్వారా కొన్ని వేల సంవత్సరముల క్రితమే ఏ విధమైన పరికరములు లేని కాలములోనే భూత భవిష్యత్తు వర్తమాన కాలములను తెలుసు కొనుట , గ్రహణములు, పౌర్ణమి, అమావాస్యలు , సూర్యోదయము, సుర్యాస్తమయము, మరియు వర్షాభావ పరిస్తితులను గురించి మరియు వేసవి లో ముఖ్యముగా అగ్నికర్తరిలో ఉండే ఉష్ణోగ్రత మరియు అనేక రకముల విషయములను తెలిపి యున్నారు. వాటిలో కొన్నింటిని మనముప్రత్యక్షముగా చూస్తున్నాము . విజ్ఞులైన వారు మేధావులు ప్రస్తుత కాలమాన పరిస్తితుల ననుసరించి మరింత లోతుగా అధ్యయనము చేయుట ద్వారా జ్యోతిష్యశాస్త్ర  గొప్ప తనమును ప్రపంచానికి చాటగలము.

Popular Posts