Followers

Friday, 6 September 2013

ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి :

మాంసకృత్తులు
మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా  అవసరం . పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది.
గ్ర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .

ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు 

తీసుకోవాలి :
  • మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.
  • శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను  పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి  పొందవచ్చు.
  • ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు ,జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.
  • వృక్షాల ద్వారా లంభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.
  • 16–18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల  మాంసకృత్తులు అవసరం. అదే విధంగా 16 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం.
  • గర్బవతికి రోజుకు 65 గ్రాములు ఒక  రోజుకు
  • పాలిచ్చే తల్లులకు/బాలింతలకు  6 నెలల వరకు   75 గ్రాములు 1 రోజుకు
ఆహార పదార్ధాలు
ప్రతి 100 గ్రాములకు లభించే మాంసక్రత్తులు /గ్రాముల్లో
సోయాబీన్స్              
43.2
శెనగ పప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు, కందిపప్పు
22
వేరుశెనగపప్పు, బాదం పప్పు,జీడిపప్పు
23
చేపలు          
20
మాంసము                         
22
ఆవు పాలు     
3.2
గేదె పాలు                
4.3
కోడిగుడ్డు  ( సుమారు 44 గ్రాములు)     
13.3     (ఒక గుడ్డుకు)

Popular Posts